ఆయన లైఫ్ స్టైల్ వేరే ..అందుకే అంత యాక్టీవ్ !

Sharing is Caring...

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ 72 సంవత్సరంలోకి ప్రవేశించారు. ఇప్పటికి ఆయన చురుగ్గా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు. నిన్న గాక మొన్న జరిగిన తిరుపతి లోకసభ ఉపఎన్నిక ప్రచారంలోనూ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆయన కంటే చిన్నోళ్లు  కృష్ణ రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటుంటే .. బాబు మాత్రం ఏ మాత్రం అవకాశం దొరికినా ఏదో పని చేయాలనీ తపన పడుతుంటారు. అసలు బాబు జీవన విధానమే  డిఫెరెంట్ గా ఉంటుంది. చక్కటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. క్రమం తప్పకుండా యోగా .. ధ్యానం, కొన్ని ఎక్సర్ సైజులు చేస్తుంటారు.

ఇక ఆహారం విషయాని కొస్తే సాత్విక ఆహరం తీసుకుంటారు. సిగరెట్టూ మందు వంటి అలవాట్లకు చాలా దూరం.వక్కపొడి,పాన్ వేసుకునే అలవాటు  లేదు. రోజూ బాబు తెల్లవారుజామున నాలుగున్నరకు నిద్ర లేస్తారు. యోగా .. ఎక్సర్ సైజులు ముగించుకుని .. దిన పత్రికలు చదువుతారు. వాటిలోనుంచి ఆరోజు తాను అడ్రెస్ చేయాల్సిన అంశాలుంటే  నోట్ చేసుకుంటారు.

తర్వాత పిఏకి చెప్పి అవసరమైన సమాచారం తెప్పించుకుంటారు.ముందురోజే షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి దాని కనుగుణంగా ఏమి అవసరమో చెక్ చేసుకుంటారు. పొద్దున్న 7 గంటలకు టిఫిన్ పరిమితంగా తీసుకుంటారు. అక్కడనుంచి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలకు హాజరవుతారు. అధికారంలో ఉండగా అయితే ఫుల్ బిజీగా ఉండేవారు.

ఇప్పుడయితే తన కార్యాలయంలో కూర్చుని పార్టీలో ఉన్న కీలక నాయకులతో ఫోన్ లో మాట్లాడతారు. ఏపీ,తెలంగాణ రాజకీయ విశేషాలు తెలుసుకుంటారు. అవసరమైన సందర్భంలో జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ నేతలతో రాజకీయ కార్యక్రమాలపై చర్చిస్తారు. ఎవరికైనా లెటర్స్ రాయాలంటే వాటిని రెడీ చేయించుకుంటారు.

మధ్యలో మనవడు దేవాంశ్ తో కాసేపు ఆడుకుంటారు. లంచ్ లోపల కొన్ని పండ్ల ముక్కలు తింటారు. జ్యూస్ తీసుకుంటారు. మధ్యలో హెరిటేజ్ డైరీ గురించి శ్రీమతి భువనేశ్వరి,బ్రాహ్మణిలతో మాట్లాడతారు. అవసరమైన సూచనలు చేస్తుంటారు.

ఇంటిదగ్గర ఉండే పక్షంలో కుటుంబ సభ్యులంతా కలసి లంచ్ చేస్తారు. లంచ్ లో రాగి లేదా జొన్న సంకటి , వెజిటబుల్ కర్రీ , చేపముక్కలు, పెరుగన్నంతో భోజనం ముగిస్తారు. అక్కడ నుంచి కొద్దీ సేపు రిలాక్స్ అవుతారు. తర్వాత కుటుంబ సభ్యులు.. బంధువులు ఎవరైనా వస్తే వారితో మాట్లాడతారు.

సాయంత్రం ఓ సారి టీ తాగుతారు.తర్వాత బలవర్ధకమైన స్నాక్స్ ..  రాత్రికి పుల్కా, పెరుగుతో డిన్నర్ ముగిస్తారు. ఫుడ్ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందుకే ఇప్పటికి ఆయన వెరీ యాక్టీవ్ గా ఉంటారు. 2017 అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎక్కువ సేపు మాట్లాడలేక కూర్చుండిపోయారు.

ఎందుకో అలసటకు గురయ్యారు. ఏ కార్యక్రమంలో అయినా అరగంటకు తక్కువ కాకుండా ఉపన్యాసం ఇచ్చే చంద్రబాబు ఆ రోజు కేవలం 20 నిమిషాలు మాట్లాడి ..కూర్చుండి పోయారు. బాబు స్థితి ని గమనించిన అధికారులు కంగారు పడ్డారు. మంచినీళ్లు తాగిన  కాసేపటికి ఆయన మామూలు పొజిషన్ కి వచ్చారు.

డాక్టర్ల సలహామేరకు అప్పటినుంచి కొంత రిలాక్స్డ్ గా  పని చేస్తున్నారు. ఇపుడు ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి శ్రీమతి భువనేశ్వరి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒకప్పటితో పోలిస్తే చురుకుదనం ఏమీ తగ్గలేదు. వయసు రీత్యా కార్యక్రమాలను కొంతమేరకు తగ్గించుకున్నారు. కరోనా టైమ్ లో సందర్శకులను కూడా కలవడం లేదు. 

బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు!!

————-K.N.Murthy

post upadated on 20/4/2022

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!