ఇపుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్ పైనే కేంద్రీకృతమైంది. బెంగాల్ లో బీజేపీ ని గెలిపించడానికి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. కొంతకాలం అక్కడే ఉండి పార్టీ ని గెలిపించే ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ కూడా పలుమార్లు ర్యాలీలలో పాల్గొని ప్రసంగాలు చేసారు. ఎన్నికల సంఘం కూడా 8 విడతల పోలింగ్ పెట్టి ఎన్నికల ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే దీదీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఇండియా టుడే , రిపబ్లిక్ టీవీ లు బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు ఫలితాలు ఇచ్చాయి. మిగతా ఛానల్స్ లో తృణమూల్ కే ఛాన్స్ అన్నట్టు ఉన్నాయి.
ఎన్‌డీటీవీ .. సీట్లు: 294 మ్యాజిక్ మార్కు: 148 …టీఎంసీ: 157… బీజేపీ: 120…. లెఫ్ట్: 16 ఇతరులు: 1.
ఏబీపీ సీఓటర్ .. తృణమూల్ .. 152-164 , బీజేపీ 109-121 … లెఫ్ట్ 14-25..
రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్.. బీజేపీ 138-148 — తృణమూల్ 128-138 … లెఫ్ట్ 11-21..
టైమ్స్‌నౌ సీఓటర్ బీజేపీ 115 … తృణమూల్ 158… లెఫ్ట్ 19..
ఇండియా టుడే — బీజీపీ 172-192 … తృణమూల్ 64-88 … లెఫ్ట్ 7-12.
మొత్తం మీద బెంగాల్ లో బీజేపీ , తృణమూల్ ఎత్తులు పైఎత్తులు రాజకీయ క్రీడను రసవత్తరం గా సాగేలా చేశాయి. అన్ని దశల్లో పోలింగ్ బాగా జరిగింది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. అసలు ఫలితం కోసం మే 2 వరకు ఆగాల్సిందే.