ఆమెకు కాపీరైట్ చట్టం గురించి తెలియదా ? 

Sharing is Caring...

Priyadarshini Krishna ………………….     Nayantara sidestepped the issue

లేడీ సూపర్ స్టార్ నయనతార కు కాపీ రైట్ చట్టం గురించి తెలియదా ? తెలిసినా తెలియనట్టే వ్యవహరిస్తున్నారా ? చూస్తుంటే ఆమె ధోరణి తెలియనట్టే నటిస్తున్నట్టు ఉంది. హీరో ధనుష్ కి రాసిన మూడుపేజీల బహిరంగ లేఖలో ఆయన కారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఏవేవో రాసింది. అసలు పాయింట్ ను చర్చించకుండా … ఇష్యూని పక్కదారి పట్టించాలని నయనతార ప్రయత్నించింది.   

కంటెంట్ క్రియేషన్ అనేది ఒక మెయిన్‌ స్ట్రీం ఇండస్ట్రీగా రూపాంతరం చెందిన ఈ కాలంలో అలాంటి కంటెంట్ పై హక్కులను క్రియేట్ చేసిన వ్యక్తులకు/ సంస్థలకు ఉండేలా copyright act  రక్షణ కల్పిస్తోంది. 1957లో నే రూపొందిన ఈ చట్టం 1958 లో అమలు లోకి వచ్చింది.తదుపరి 2012 లో కొన్ని మార్పులు కూడా చేశారు. 

కాపీరైట్, మేధో సంపత్తి చట్టం యొక్క ఒక రూపం , కవిత్వం, నవలలు, చలనచిత్రాలు, పాటలు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్,  ఆర్కిటెక్చర్ వంటి సాహిత్య, నాటకీయ, సంగీత, కళాత్మక రచనలతో సహా రచయిత అసలైన రచనలను రక్షిస్తుంది. (Act is available in internet pls refer)

ఇక నయనతార బయోగ్రఫీ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ విషయానికి వస్తే…. నయనతార తన డైరెక్టర్  విఘ్నేష్ శివన్ ని 2022 లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి ముందే తన పెళ్ళి వేడుకను ఏదైనా చానల్ కి ఓటీటీ కి అమ్మాలని  కూడా అనుకున్నారు. తన PRO publicist company సూచన మేరకు ఈ వేడుకకు అన్ని సినిమారంగాల నుండి అతిరథులు ను గెస్ట్ లు పిలవాలని నిర్ణయించారు.

సహజంగానే పెళ్ళి అనగానే అందరూ హాజరవుతారు. అందునా లేకలేక జరిగే వేడుక ఆయే…. !
ఈ వేడుకను exclusive గా కొనుగోలు చేయడానికి నెట్‌ఫ్లిక్స్ ముందుకొచ్చింది. దాదాపు పాతిక కోట్లకు ఒప్పందం కూడా జరిగింది. నెట్‌ఫ్లిక్స్ రంగంలోకి రాగానే గెస్ట్ లిస్ట్ ని అదే నిర్ణయించింది. బాలీవుడ్ నుండి షారుఖ్ మొదలు సౌత్‌ దిగ్గజాలు రజనీ,  మమ్ముట్టి , మోహన్‌లాల్, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోలతో లిస్ట్ తయారు చేసారు.

అంతా అనుకున్నట్లుగానే సాగిపోతోంది. పెళ్ళి జరిగిన రెండుమూడు వారాల్లోనే ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చెయ్యాలని డిసైడ్ చేసారు కూడా…. అందుకు తగినట్లుగానే టీజర్స్, ట్రయిలర్స్, ఫ్లయర్స్ పోస్టర్స్ అన్నీ రెడీ అయ్యాయి.

జూన్ 9 2022 లో వెడ్డింగ్ జరిగింది. ఆ ఈవెంట్ కు సంబంధించిన ఎలాంటి వీడియోలను క్లిప్ లను ఏ శాటిలైట్ ఛానల్ కు గానీ యూట్యూబ్ చానెల్స్ కు గాని రిలీజ్ చేయలేదు. కేవలం ఫోటోలను మాత్రమే ఇచ్చారు. ఈలోగా జులైలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చెయ్యాలి అని ఫిక్స్ అయిన  సందర్భంగా ట్రైలర్లను విడుదలచేసింది నెట్‌ఫ్లిక్స్. 

దానిలో ధనుష్ ప్రొడ్యూసర్ గా విఘ్నేష్ శివన్ డైరెక్టర్ గా నయనతార విజయ్ సేతుపతి జంట గా తీసిన నానుమ్ రౌడీ దాన్ (నేను రౌడీనే) సినిమాలోని పాటలను, బిహైండ్ ద సీన్స్ – మేకింగ్ వీడియో లు కూడా కలిపి ఆ ట్రైలర్ లో  ఉండటం ధనుష్ దృష్టికి వచ్చింది.దానికి స్పందించిన ధనుష్ తాను నిర్మించిన సినిమా తాలుకా వీడియోలను వాడుకున్నందుకు గాను కాపీరైట్ చట్టాన్ని ఆశ్రయించి లీగల్ నోటీసులు ఇచ్చారు. దీంతో  ఆ డాక్యుమెంటరీ రిలీజ్ ఆగిపోయింది.

అప్పటికే అంతా తయారైపోయి ఈ సదరు డాక్యుమెంటరీ ఓనరైన నెట్‌ఫ్లిక్స్ ఆయా వీడియోలను తొలగించడానికి ఏమాత్రంగా సుముఖంగా లేదు.  అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్నిఆపేసింది.కాలం చకచకా గడిచిపోయింది. ధనుష్ మాత్రం ససేమిరా అన్నాడు. అంటాడు …. ఖచ్చితంగా… అది ఒక వ్యాపారం !

నయనతార నెట్‌ఫ్లిక్స్ కి ఉచితంగా ఇవ్వలేదుగా…! ఆమె సొమ్ము చేసుకుంది. ఏళ్ళు గడిచాయి…. నయనతార పిల్లల్ని కనిపించుకుంది. నెట్‌ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం తాలూకా తలనొప్పి పోలేదు. చేసేది లేక ఆ డాక్యుమెంటరీ ని తన బయోగ్రఫీ పిక్చర్ గా రూపొందించి ప్రసారం చెయ్యాలని నిర్ణయించారు. ఆ దిశగా వర్క్ జరిగింది. పిల్లల ఫుటేజ్ కూడా జోడించారు. పెళ్ళి వేడుక వీడియో కాస్త బయోపిక్ ఐ కూర్చుంది.

నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ బయోపిక్ ను రిలీజ్ చెయ్యాలని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.  సదరు ట్రైలర్లు కూడా విడుదల చేసింది…. అదిగో… అక్కడే మళ్ళీ దొరికిపోయింది. ధనుష్ లీగల్ టీం మళ్ళీ నయనతారకు నెట్‌ఫ్లిక్స్ కు నోటీసులు ఫ్రెష్ గా పంపించారు. నెట్‌ఫ్లిక్స్ వెంటనే ప్రసారం ఆపేసింది… ఈ గోలేంటి అని జుట్టు పీక్కుంది.

అసలు అందులో అంత ఘోరంగా ఏముంది…?! అబ్బే ఏం లేదు… నానుమ్‌ రౌడీ మూవీలో సెట్స్ లో తీసిన జస్ట్ మూడు సెకన్ల between the scenes/ behind the scenes ఫుటేజీని వాడారు. కాపీరైట్ చట్టం ప్రకారం సినిమాకు సంబంధించిన ఫుటేజీ .. మ్యూజిక్ సైట్స్ పై ప్రొడ్యూసర్ కే పూర్తి హక్కులు. అది మూడు సెక్షన్లైనా మూడు నిమిషాలైనా మూడు గంటలైనా….!

గత్యంతరం లేక ఆ భాగాన్ని తొలగించి ప్రసారం చేసారు, లేకుంటే ఈ సారి పిల్లల పంచెల ఫంక్షన్ కూడా కలిపి ప్రసారం చేయాల్సి వచ్చేది. ఇదిలా ఉండగా బాగా పాతబడిపోయిన ఆ డాక్యుమెంటరీ పైన ప్రేక్షకులకు ఎటువంటి ఆసక్తి ఉండదు అని గ్రహించిన ఆమె వెంటనే ఏదైనా సెన్సేషనల్ గా చేసి జనాల్లో Buzz తీసుకురావాలి అని ప్లాన్ చేసింది.

ఒకపక్క  నెట్‌ఫ్లిక్స్ వత్తిడి , ఒక పక్క పగ మరో పక్క ధనుష్ చేతిలో ఓటమి తో రగిలిపోతున్న నయనతార ‘బహిరంగ లేఖ’ రూపంలో ధనుష్ పై దుమ్మెత్తి పోసి అక్కసు తీర్చుకుంది. నిజానికి across the table సెటిల్  అయిపోయే విషయాన్ని పంతంతో పెద్దది చేసింది. జరిగింది ఏదో జరిగిపోయింది దాని నుండి కూడా డబ్బు సంపాదించేద్దాం అని కాంట్రవర్సీ కి తెరలేపింది….

మూడుపేజీల బహిరంగ లేఖలో ధనుష్ కారెక్టర్ అసాసినేట్  చేస్తూ వీడియో కాపీరైట్ విషయం కాకుండా ఏవేవో రాసింది. పాయింట్ ను చర్చించకుండా పక్కదారిపట్టించాలని చూసింది.  ఈ విషయం పైన పరువునష్టం దావా వెయ్యడానికి ధనుష్ కి అవకాశం మాత్రమే కాదు హక్కు కూడా ఉంది. ధనుష్ ఏమి చేస్తాడో చూద్దాం.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!