సంజయ్ గాంధీకి ఓ కూతురుందా ?

Sharing is Caring...

Who is this priya …………………………………………

కొన్నేళ్ల క్రితం (2017) ప్రియా సింగ్ పాల్ అనే ఆవిడ తాను సంజయ్ గాంధీ కుమార్తెను అంటూ వార్తల్లోకెక్కారు. ఇందూ సర్కార్ అనే సినిమా విడుదల కాకుండా ఆపాలని .. ఆ సినిమాలో ఇందిరా.. . సంజయ్ గాంధీల పాత్రలను సరైన రీతిలో చిత్రీకరించలేదని ప్రియా సింగ్ ఆరోపణలు చేశారు. నిర్మాత దర్శకులకు లీగల్ నోటీసులు జారీ చేసారు.

ఆమె ఆ ప్రకటన చేసిన సందర్భంగా చాలామందికి సందేహాలు కలిగాయి. సమాజానికి తెలిసి సంజయ్ గాంధీ కి అధికారికంగా ఒకరే కొడుకు.( ఆయన పేరు వరుణ్ గాంధీ. ప్రస్తుత బీజేపీ ఎంపీ కూడా.) మరి ఈవిడ ఎక్కడ నుంచి వచ్చారని చాలామంది చెవులు కొరుకున్నారు.  

సంజయ్ గాంధీ కి మేనకా గాంధీ తో పెళ్ళికాకముందు తాను 1968లో పుట్టానని ప్రియా అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.  తనను చిన్నప్పుడే 1974లో షీలాసింగ్- బల్వంద్‌ పాల్‌ దంపతులు దత్తత తీసుకున్నారని ప్రియా వివరించారు. పెళ్లికాక ముందు సంజయ్‌కు జన్మించిన కూతురినని … ఈ విషయాన్ని తన పెంపుడు తల్లిదండ్రులు చెప్పినట్టు ఆమె చెప్పుకొచ్చారు.

తాను సంచలనం కోసం ఈ మాటలు చెప్పడం లేదని వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ గానీ, గాంధీ కుటుంబం గానీ అసలు స్పందించలేదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడైన సంజయ్ గాంధీ.. మేనకా గాంధీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

సంజయ్ గాంధీ ఇందిరా గాంధీ రెండో కుమారుడు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రానని చెప్పడంతో ఇందిర తన వారసుడిగా సంజయ్ ను ఎంచుకున్నారు. ఇందిరా గాంధీ తర్వాత ఆయనే అధికార పగ్గాలు చేపడతారని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే 1980 లో సంజయ్ విమాన ప్రమాదంలో చనిపోయారు.

ఇందూ సర్కార్ సినిమా నిర్మాతలు స్పందించకపోవడంతో ప్రియా బాంబే హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, సంజయ్ గాంధీ వంశంతో ఉన్న అనుబంధానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించడంలో ప్రియా సింగ్ పాల్ విఫలమవడంతో బాంబే హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. విడుదలకు కేవలం రెండు రోజుల ముందు ఇది జరిగింది. తర్వాత  సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీం కూడా సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో సినిమా విడుదల అయింది.

ప్రియా డీఎన్ ఏ పరీక్షలకు కూడా సిద్ధమైంది. కానీ ఎందుకో పరీక్షలు జరగలేదు. తల్లి ఎవరో సాక్ష్యాలు చూపలేకపోయింది.  తర్వాత ఆమె కూడా సైలెంట్ అయిపొయింది. ప్రియా సింగ్ పాల్ న్యూఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్ సమయంలో  జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ హెడ్ కన్సల్టెంట్ గా పనిచేశారు.

ఆమె 1990లో మిరాండా హౌస్ నుండి పట్టభద్రురాలయ్యారు. న్యూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం లో  మీడియా స్టడీస్‌లో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో ఎమర్జింగ్ లీడర్స్ అండ్ గవర్నెన్స్ ప్రోగ్రామ్‌లో కూడా కొంతకాలం పని చేశారు. ఆమె భర్త  విదేశాల్లో వ్యాపారం చేస్తుంటాడు. 

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!