గురుగ్రహానికి అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉందా ?

Sharing is Caring...

పులి ఓబుల్ రెడ్డి………………………. The planet Brahaspati is called guru… Why?

సూర్య మండలం లోని గ్రహాలను మనం వివరించేప్పుడు బృహస్పతి గ్రహాన్ని,  గురువు / గురుడు అంటున్నాం… ఎందుచేత?
సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత  : 2

My Very Educated Mother Just Served Us Nine Pickles. ఈ వాక్యంలోని పదాల మొదటి అక్షరాల ద్వారా మన సౌరమండలంలోనీ గ్రహాలను వాటి వరుస క్రమంలో గుర్తుపెట్టుకొనే ఒక సులభ సూత్రం. ప్లూటో ఇప్పుడు గ్రహం కాదనుకోండి. International Astronomical Union (IAU) 2006లో దానిని dwarf planet గా down grade చేసింది. కారణం, దానికి ఒక స్థిరమైన కక్ష్య లేకపోవడమే.

వీటినే మన భారతీయులు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని….  అని అలా వరుసగా పిలుస్తారు. ఈ బృ‌హస్పతి (Jupiter) గ్రహాన్ని గురువు / గురుడు అని కూడా పిలుస్తారు. ఎందుకలా?  దేవతలకు గురువు కాబట్టి ‘గురుడు’ అందామా , అంటే ఆయనని మించిన గురువులు మన పురాణేతిహాసాల్లో కోకొల్లలు.

పెద్దగ్రహం కాబట్టి అలా అన్నారని అనుకుందామా అంటే… నిజానికి   Jupiter తో పాటు Saturn, Uranus, Neptune లు కూడా భూమి కన్నా పెద్దవే. ఈ నాల్గింటినీ gas giants అంటారు. అంటే అవి నాలుగూ వాయువులతో ఏర్పడినవే, వాటిలో మనం కాలు పెట్టే ఘన ఉపరితలం లేదు. మరి సహేతుకమైన కారణం ఏమై ఉంటుంది?

‘గురువు’ కి ఉన్న అనేక  అద్భుత  లక్షణాలలో ప్రధానమైనది… శిష్యుడిని చెడు నుండి కాపాడటం, తద్వారా అతన్ని సంస్కరించి సమాజంలో ఒక ఉన్నత వ్యక్తిగా నిలపడం.

గురువు , భూమి కన్నా 11రెట్లు (చుట్టుకొలత) పెద్దది. కానీ దాని ఆకర్షణ శక్తి అంతకు ఎన్నో రెట్లు అపారమైనది. అది ఏ స్థాయిలో ఉంటుందంటే…  దానికున్న 63 ఉపగ్రహాలలో (ప్రస్తుతానికి కనిపెట్టబడ్డ సంఖ్య)  ఒకటైన ‘Io’ ( ఐఓ లేదా ఇయో)  మీద…  మన భూమి మీద సముద్రాలలో అలలు ఎలా వస్తాయో, అలా ఉపరితల అలలు వస్తాయి.

అంటే ఆ ఉపగ్రహం మీది నేల 100మీ. ఎత్తు వరకూ ఎగిసి, విరిగి పడిపోతూ ఉంటుంది. ఈ ఉపగ్రహం మీదే సౌరకుటుంబంలోనే అత్యంత పెద్దదైన 180కి.మీ వెడల్పైన లావా సరస్సు ఉంది. దాని పేరు ‘Loki Patera’.  ఈ పేరు ఎక్కడో విన్నట్లు మీకు అనిపిస్తోంది కదా…  అవును, మీ అంచనా సబబే. మార్వెల్ స్టూడియో వారి ‘Thor’ సవతి తమ్ముడే ఈ ‘Loki’. ఈ కథంతా ‘Norse mythology’ ( స్కాండినేవియా … ప్రస్తుత నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు)  నుండి సంగ్రహించబడినదే.

అసలు అంత శక్తి బృహస్పతికి రావడానికి అసలు కారణం దాని అతి తక్కువ భ్రమణ కాలం. అంత పెద్ద గ్రహమైనప్పటికీ అది తన చుట్టూ తాను తిరగడానికి సుమారుగా కేవలం 10 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఈ ఆలోచన ఎందుకు సబబైనదంటే… మొత్తం విశ్వంలోనే అత్యంత వేగమైన భ్రమణం కలిగిన న్యూట్రాన్ నక్షత్రాలు ఒక సెకనుకు 500 సార్లు పైనే తమ చుట్టూ తాము తిరుగుతాయి.

ఈ న్యూట్రాన్ నక్షత్రం మీది ఒక టీ స్పూన్ పరిమాణంలోని పదార్థాన్ని భూమి మీదకు తేగలిగితే, దాని బరువు పది లక్షల టన్నుల బరువు ఉంటుంది. అలాంటి అపారమైన శక్తి గల బృహస్పతి అనేక చిన్న ఉల్కల నుండి పెద్ద ఆస్టరాయిడ్స్ వరకూ తన వైపు బలంగా ఆకర్షిస్తూ ఉంటుంది. దీని వల్ల భూమికి కలిగే లాభం ఏమిటి?

ప్రతి రోజూ భూమిపై 2కోట్ల ఉల్కలు పడుతూ ఉంటాయి. వాటిలో రెండో, మూడో భూమిని చేరుతూ ఉంటాయి. ( Meteors కి Meteorites కి తేడా ఏమంటే…  చిన్నపాటి ఉల్కలన్నింటినీ Meteors లేదా Shooting Stars అంటారు. ఒకవేళ అవి భూవాతావరణంలో లోకి చొచ్చుకుపోయి భూమిని చేరగలిగితే, వాటిని Meteorites అంటారు. మనం ఆ రెండింటినీ ఉల్కలనే సంబోధిస్తాం.) ఇంతా చేసి భూమి యొక్క వాతావరణ పొర ఆపిల్ కాయ తొక్క అంత మందం మాత్రమే ఉంటుంది.

ఒకవేళ గురుగ్రహానికి అంత అద్భుతమైన ఆకర్షణ శక్తే లేకపోతే భూమి పైకి వచ్చే ఉల్కల సంఖ్య ఇంతకు 10,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక ఆస్టరాయిడ్ల సంగతి సరేసరి ( అసలు ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ Mars, Jupiter కి మధ్యే ఎందుకుందో మరో పోస్ట్ లో వివరిస్తాను). అందుకనే,  ప్రస్తుత ఖగోళ శాస్త్రవేత్తలు గురుగ్రహాన్ని ‘huge vacuum cleaner’ అని పిలుస్తారు.

దీన్ని మన పురాతన ఖగోళ శాస్త్రజ్ఞులు ఏనాడో గుర్తించారు కాబట్టే బృహస్పతికి గురు స్థానం కల్పించారు లేదా గురువు అని సంబోధించారు.

చెణుకులు :
1) గురుగ్రహం ‘ఆకర్షణ శక్తి’ భూమి కన్నా 14రెట్లు శక్తిమంతమైనది. 20,000 రెట్లు బలమైనది.
2) గురుగ్రహం పూర్తిగా వాయువులతో నిండినప్పటికీ సౌరమండలంలోని అన్ని గ్రహాలనూ కలిపి మించిన ద్రవ్యరాశి కలిగి ఉంది.
3) గురుగ్రహంపై అత్యంత పెద్ద తుఫాన్ (The great red spot)ని మన మానవాళి గత 650 సంవత్సరాలుగా గమనిస్తోంది. ఆ తుఫాన్ కేంద్రం మన భూమి కన్నా పెద్దది.
4) గురుగ్రహం యొక్క ఉపగ్రహం అయిన Ganymede, సౌరకుటుంబంలోనే అతి పెద్ద ఉపగ్రహం. ఇది బుధ గ్రహం కన్నా పెద్దది.
5) గురుగ్రహం యొక్క ఉపగ్రహాలలో ఒకటైన ‘యూరోపా’ మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఆ మంచు కింద భూమి పై కన్నా ఎక్కువ నీరు ఉండే అవకాశం ఉందని, ఆ ఉపగ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!