This is one kind of crazy…………………………………..
సోషల్ మీడియాలో లేదా పబ్లిక్ లో పాపులర్ కావడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. ఇరాన్ కి చెందిన తబర్ మాత్రం దెయ్యం వేషాలు వేయడాన్ని ఎంచుకుంది. అందుకోసం చాలా కష్టపడింది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో… భయంకరమైన రూపంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మొత్తానికి ఫేమస్ అయ్యింది.
ఆమె అసలు రూపం ఎలా ఉంటుందో మొన్న మొన్నటి వరకు ఎవరికి తెలీదు. కొద్దీ రోజుల క్రితమే ఆమె తన ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టింది. తబర్ ఓ టీవీ ఛానెల్ ద్వారా తన అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది.
ఆ భయంకరమైన ముఖం కోసం తబర్ కొన్ని సర్జరీలు చేయించుకుంది. ఫలితంగా ఆమె రూపం వికృతంగా మారిందనే వార్తలు కూడా వచ్చాయి. 2017లో సర్జరీలు వికటించడంతో ఆమె మొహం దెయ్యంలా మారిందంటూ తబర్ గురించి మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి.అయితే తన రూపం ఏ మాత్రం మారలేదని తబర్ అంటోంది .
సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఫొటోల వెనుక.. ఫొటోషాప్ ఎడిటింగ్, కంప్యూటర్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెబుతోంది. ఆ తర్వాత ఆ ఫొటోలతోనే జాంబీ ఎంజెలీనా జోలిగా సోషల్ మీడియాలో తబర్ పేరు సంపాదించుకుంది.
తబర్ అసలు పేరు ఫతేమెహ్ కిష్వంద్. సుమారు 50 సర్జరీలు చేయించుకుంది.. అవి వికటించడంతో దెయ్యంలా మారినట్లు ఒక సందర్భంలో అబద్దం చెప్పింది. ఒక హీరోయిన్ గా కంటే.. ఇలా సర్జరీలు వికటించిన బాధితురాలిగా పేరు ఎక్కువే దక్కించుకోవచ్చు అనుకుంది. ఆ ఆలోచన కొంతమేర వర్కవుట్ అయింది.
ఇదిలావుంటే సహర్ తబర్.. 2019లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లింది. మోసం, దైవదూషణ నేరానికిగానూ ఆమెకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. హిజాబ్ ను అవమానించిన ఆరోపణలకుగానూ ఆమె ఈ శిక్ష పడింది. అయితే.. 14 నెలలకే ఆమెకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అందుకు కారణం.. 40 రోజులుకు పైగా అక్కడ మహిళా లోకం చేస్తున్న పోరాటం.
మహ్ సా అమినీ మృతి తర్వాత.. ఇరాన్లో ఉవ్వెత్తున్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. ఇదే అదనుగా సహర్ తబర్‌ను సైతం విడుదల చేయాలంటూ పలువురు సోషల్ మీడియాలో నినదించారు. మసిహ్ అలినెజద్ లాంటి ఉద్యమకారిణి సహా పలువురు సామాజిక వేత్తలు తబర్ విముక్తి కోసం పోరాడారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం తగ్గి.. తబర్ ను విడుదల చేసింది.