‘ గోల్డ్ స్కీమ్స్’ కు ఆకర్షితులైతే అంతే సంగతులు!!

Sharing is Caring...

Most of the companies that cheat ……………

బులియన్ మార్కెట్లో  రకరకాల ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్స్ వస్తుంటాయి. చిన్న మొత్తాలలో అది కూడా వాయిదాలలో మదుపు చేసి కాలపరిమితి తర్వాత ‘బంగారాన్ని సొంతం చేస్కోండి’ అంటూ బంగారు దుకాణదారులు చెబుతుంటారు. పెద్ద ఎత్తున పత్రికల్లో, ఛానల్స్ లో పబ్లిసిటీ కూడా చేస్తుంటారు.

వారి మాటల  ఉచ్చులో పడ్డామంటే చేతులు కాలే ప్రమాదం ఉంది. ఎందుకంటె ఈ స్కీమ్స్ వేటికి కూడా రిజర్వ్ బ్యాంకు అనుమతి లేదు. ఈ బంగారు దుకాణాలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలుగా కూడా గుర్తింపు పొందలేదు. అయినప్పటికీ వీరంతా ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు పలు స్కీమ్స్ ప్రవేశపెట్టి వాయిదాల పద్దతిలో సొమ్ములు వసూలు చేస్తుంటారు.

ఇలాంటి సంస్థల పట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. అందరూ కాకపోయినా కొంతమంది మోసం చేసే అవకాశం ఉంది. ఇన్వెసర్లకు ఎలాంటి రక్షణ ఉండదు. చాలా పెద్ద కంపెనీలు కూడా ఉత్తమమైన గోల్డ్ సేవింగ్ స్కీమ్స్‌ అంటూ ప్రచారం చేస్తుంటాయి. రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చుఅని ప్రకటిస్తుంటాయి. 

స్కీమ్ కాలపరిమితి 11 నెలలు ఉంటుంది. ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకొని స్కీమ్ ఓపెన్ చేయవచ్చుఅని చెబుతుంటారు.  ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. గోల్డ్ వ్యాల్యూ ఆధారిత స్కీమ్, గోల్డ్ వెయిట్ ఆధారిత స్కీమ్ లు ఉన్నాయి. 

 గోల్డ్ వ్యాల్యూ ఆప్షన్‌లో ఆ రోజు బంగారం ధర ఎలా ఉందో దాని ప్రకారం నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించాలి. గోల్డ్ వెయిట్ ఆప్షన్‌లో బంగారం బరువు ఆధారంగా నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించాలి. అదే మీరు నెలకు 1 గ్రాము బంగారం కొనుగోలు చేయాలని భావిస్తే అప్పుడు మీరు నెలకు ఒక గ్రాము బంగారం ధర ఎంత ఉందో అంత చెల్లించాలి.

కొన్ని గోల్డ్ స్కీమ్స్ లో  10 నెలలు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించాలి. 10 నెలల తర్వాత సంస్థ మీకు తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌పై 55 శాతం నుంచి 75 శాతం మధ్యలో డిస్కౌంట్ ఇస్తుంది. ఈ స్కీమ్‌లో రూ.1,000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ ప్రారంభ తేదీ నుంచి 421 రోజులు ఉంటుంది అలాగే కొన్ని పెద్ద కంపేనీలు ఆన్‌లైన్ జువెలరీ కొనుగోలు ప్లాన్‌ను అమలు చేస్తున్నాయి.

ఈ ఆన్‌లైన్ స్కీమ్స్ లో  రూ.1,000, రూ.2,000, రూ.5,000, రూ.10,000 రూపంలో ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లించొచ్చు. వీటిల్లో నచ్చిన మొత్తాన్ని ఎంచుకొని చెల్లించొచ్చు. ఈ స్కీమ్ 12 నెలలు ఉంటుంది.

స్కీమ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కంపెనీ అందించే స్కీమ్ ప్రమోషన్ డిస్కౌంట్ పొందొచ్చు. స్కీమ్ డబ్బులతో సంస్థ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో బంగారం కొనొచ్చు. లేదంటే సంస్థ షోరూమ్‌కు వెళ్లి నచ్చిన నగలను కొనొచ్చు.

మరి కొన్ని సంస్థలు ఈజీ గోల్డ్ పర్చేజ్ ప్లాన్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీమ్ 360 రోజులు ఉంటుంది. నెలకు రూ.1,000 నుంచి లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. మనకు నచ్చిన ఇన్‌స్టాల్‌మెంట్ ఎంచుకొని స్కీమ్‌ను ప్రారంభించొచ్చు. సంస్థ ఆన్‌లైస్ స్టోర్ లేదా షోరూమ్‌లకు వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

చివరి ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్కీమ్ గడువు తీరకముందే బంగారం కొనేందుకు వీలుండదు.ఇలా పలు ఆకర్షణీయమైన స్కీమ్స్ ద్వారా బంగారు అమ్మకాలకు సంస్థలు ప్రయత్నిస్తుంటాయి.

ఈ స్కీమ్స్ కి రిజర్వ్ బ్యాంక్ అనుమతి అయితే లేదు. సంస్థ  ఏదైనా ఒడిదుడుకులకు లోనైతే ఇన్వెస్టర్ల చెల్లించిన సొమ్ముకు గ్యారంటీ ఏమి ఉండదు. కాబట్టి ఇన్వెస్టర్లు బంగారం కొనదలచుకుంటే ఒకేసారి కొనుక్కోవడం ఉత్తమం. అంతే వాయిదాల పద్ధతిలో వెళ్తే నష్టపోయే ప్రమాదం ఉంది. 

—- KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!