కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
తైవాన్ పార్లమెంట్ రణరంగం గా మారింది. సభ్యులు పరస్పరం దాడులకు దిగారు. అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులకు దిగారు. దీంతో సభలో కొంత …
హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రధానంగా బీజేపీ-ఎంఐఎం పార్టీల నేతల ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. నేతలు పదునైన విమర్శలు కలకలం రేపుతున్నాయి. ముందెన్నడూ ఈ రీతిలో ప్రచారం జరగలేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ విమర్శలు .. వాగ్గానాల జోరు కూడా …
‘పయ్యావుల కేశవ్’ కు చురుకైన నాయకుడని పేరుంది . కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు. ఆ మద్య బీజేపీ లో చేరబోయి మళ్ళీ వెనుకడుగు వేశారని కూడా అంటారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కేశవ్ ఒకరు. 2019లో వైసీపీ గాలులు వీచినప్పటికీ తట్టుకుని ఉరవకొండ …
ఉన్నట్లుండి పొద్దున్నే వర్షం మొదలైంది. రైతు బజారు నుంచి వస్తుండగా ఊహించని వాన ఊపందుకుంది. కనీసం గొడుగైనా చేతిలో లేకపోవడంతో గబాలున ఎదురుగా కనిపించిన ఆటో స్టాండు దగ్గరకు పరుగెత్తాను. వరుసగా పదికి పైగా ఆటోలు పార్క్ చేసున్నాయి. అందరు ఆటో డ్రైవర్లూ కలిపి రెండు ఆటోల్లో సర్దుకుని మాటా మంతీ ఆడుతున్నారు. సరిగ్గా వారి …
అహ్మద్ పటేల్ ..కాంగ్రెస్ నేతల్లో ఆయన తెలియని వారుండరు. అందరూ ఆయనను అహ్మద్ భాయి అని పిలుస్తారు. ఇందిరా, రాజీవ్,సోనియా,రాహుల్ గాంధీ లకు ఆయనే సలహాదారుడిగా పనిచేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ఆయన వ్యూహాలే పార్టీ ని ముందుకు నడిపించాయి. గుజరాత్ కి చెందిన అహ్మద్ పటేల్ గాంధీ …
తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఎపుడు జరిగేది అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి.వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2021 ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరగవచ్చుఅంటున్నారు.ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ …
విల్‌ఫుల్ డిఫాల్టర్ల (ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేసిన వారు)పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఈ నాటివి కావు. ఎవరు ఎన్ని విమర్శించినా ప్రభుత్వ తీరులో, అధికార యంత్రాంగం లో మార్పు లేదు. తీసుకున్న అప్పులు తిరిగి తీర్చలేకపోయినందుకు న్యాయమైన కారణాలుంటే పోనీలే అనుకోవచ్చు. కానీ విల్‌ఫుల్ డిఫాల్టర్లపై మాత్రం కఠిన చర్యలు …
పై ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖుని పేరు S.M.గణపతి స్థపతి.ఈ అమర శిల్పి గురించి ఈ తరం వారిలో చాలామందికి తెల్సి ఉండక పోవచ్చు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న కళాకారుల విగ్రహాలు, హుస్సేన్‌సాగర్ లోని బుద్ధవిగ్రహన్ని రూపొందించింది ఈ ప్రముఖుడే. కఠిన శిలలను సైతం ఆకర్షణీయమైన రూప లావణ్యంతో అద్భుత కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో గణపతి స్థపతికి తిరుగులేదు. …
అట్లాంటిక్ సముద్రంలోనే మూడేళ్లుగా గిరగిరా తిరుగుతున్న మంచుకొండ దగ్గరలోని ఒక దీవిని ఢీకొట్టే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మంచుకొండ ప్రయాణిస్తున్న మార్గాన్ని అంచనా వేసిన పరిశోధకులు అది ఖచ్చితంగా జార్జియా ద్వీపం వైపు దూసుకెళ్తున్నదని అంటున్నారు. ఆ మంచుకొండను A 68 A పేరుతో పిలుస్తున్నారు. ఈ మంచు పర్వతం చాలాకాలం క్రితం దక్షిణ ధృవంలోని అంటార్కిటికా మంచుఖండం నుంచి వేరయింది. ఒకప్పుడు అది ఇపుడున్న సైజు కంటే పెద్దగా ఉండేది. కాలక్రమంలో ఈ మంచుకొండ …
error: Content is protected !!