అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
పై ఫొటోలో కనిపించే మహిళ పేరు …లతికా సుభాష్. కేరళ మహిళా కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షురాలు. పార్టీ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదని నిరసన తెలియజేస్తూ తిరువనంతపురం పార్టీ కార్యాలయం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పార్టీ లో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ 86 మందితో …
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి బీజేపీ టిక్కెట్ దక్కలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడిన మిదున్ చక్రవర్తికి నిరాశే మిగిలింది. మిథున్ ఇటీవలే బీజేపీలో చేరారు. మీడియా మిథున్ చక్రవర్తే కాబోయే సీఎం అభ్యర్థి అని ఊదరగొట్టింది.కానీ పార్టీ మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు. కొద్దీ రోజుల క్రితమే మిథున్ ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరారు. …
బీహార్ అసెంబ్లీ లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేసారు.కిక్ పంచ్ లతో ఎమ్మెల్యేలను కొట్టారు. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించే ‘‘బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’’ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.కొద్దీ రోజుల క్రితం అసెంబ్లీ సమావేశంలో విపక్ష ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు ఆ బిల్లు ప్రతులను …
రమణ కొంటికర్ల…………………………………. కులాల కుంపట్లలో చలి కాగేవాళ్లు… మతవిద్వేషాల మంటలతో చండప్రచండ సూర్యుడికే దడ పుట్టించే కలిమనుషుల రాజ్యంలో…ఒక్కసారి గా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికార్లను యాద్దెచ్చుకోవాల్సిన సమయమిది. వారే ఒకరు ఎస్. ఆర్. శంకరనైతే… ఇంకొకరు బస్తర్ హీరో బీ.డి. శర్మ. ఇద్దరూ పుట్టింది బ్రాహ్మణ కులమైనా… అభ్యుదయవాదులు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం …
మన దేశంలోని కొన్ని ఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతాఆలయం కూడా అలాంటిదే.ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారు. అగ్నిని నీటిగా స్వీకరిస్తారు. మంటలు అవే అంటుకుంటాయి. మరల అవే ఆరిపోతాయి. ఆరావళి పర్వతాల్లో ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ …
రాబోయే రోజుల్లో పది లక్షల గొంతుకలను తయారు చేస్తామంటున్న తీన్మార్ మల్లన్న నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇక్కడ మల్లన్న బరిలోకి దిగితే పోటీ రసవత్తరం గా మారుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రత్యర్థులకు దడ పుట్టించిన మల్లన్న తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో సాగర్ …
గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చా?లేదా ? అనే అంశాన్ని తేల్చేందుకు ఎయిమ్స్(రిషికేష్ ) శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఈ అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ అధ్యయనం కోసం మొత్తం 20 రోగులను ఎంపిక …
సిద్ధార్ధ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసుల న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు 3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన కేసు టేకప్ చేశారంటే విజయం గ్యారంటీ. అసైన్డ్ …
తెలంగాణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇపుడు అందరిని ఆకర్షిస్తున్నది తీన్మార్ మల్లన్న. ఒక యాంకర్ గా .. జర్నలిస్టుగా కొంత పాపులారిటీ ఉన్నప్పటికీ రెండో స్థానంలోకి దూసుకుపోయి అందరికి ముచ్చెమటలు పట్టిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఏదో పోటీ చేశాడులే .. పదో లేక పదిహేనో స్థానంలో ఉంటాడని లెక్కలేసుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అనూహ్యంగా ద్వితీయ స్థానంలో నిలిచి సంచలనం సృష్టిస్తున్నాడు. ఏ రాజకీయ …
error: Content is protected !!