అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
చైనా దూకుడు కు చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధమౌతున్నదా ? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని అనిపిస్తుంది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో సైనికులకు 15 రోజుల యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు వెళ్లిన క్రమంలో ఈ సందేహాలు ఎవరికైనా వస్తాయి. దీనికి తోడు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మాటలు అలాగే …
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రభుత్వానికి గుదిబండగా మారింది. పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను అమ్ముదామంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సిబ్బందికి, పైలట్లకు వేతనాలు ,అలవెన్సులు ఇవ్వలేక సంస్థ నానా పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలోనే 2018 లోనే సిబ్బంది సమ్మెకు దిగుతామని హెచ్చరికలు కూడా జారీ చేసారు. 2015 …
విరూపాక్ష గుహ …….అరుణాచలం లో తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఒకప్పుడు గుహ లా ఉండే ఈ ప్రదేశం కాలక్రమేణా కొత్త రూపు సంతరించుకుంది. కొన్ని వందల ఏళ్ళక్రితం విరుపాక్ష ముని ఈ గుహలోనే దీర్ఘకాలం తపస్సు చేసారని అంటారు. అందువల్లనే ఆ గుహను విరూపాక్ష గుహగా పిలుస్తున్నారు. తదుపరి కాలంలో రమణ మహర్షి ఇక్కడకు వచ్చి .. …
గ్రహాంతర వాసుల గురించి మీడియాలో వస్తోన్న కథనాలను నమ్మాలా ? వద్దా ? అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా ?లేరా ? ఈ మిస్టరీ ఏమిటి అనే అంశంపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే కొందరు శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను బట్టి చూస్తే నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారనిపిస్తుంది. అంతుపట్టని రేడియో సిగ్నల్స్వ్యవహారం .. ఖగోళ మేధావి స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావుల హెచ్చరికలు.. మరోవైపు నాసా మౌనం ఇవన్నీ గ్రహాంతర వాసుల పట్ల విపరీతమైన …
పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ..రుహాల్లా జామ్. జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఇరాన్ ప్రభుత్వం అతగాడిని నిర్దాక్షిణ్యంగా ఉరి తీసింది. అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నది ప్రధాన అభియోగం. అమద్ న్యూస్ పేరిట అతను ఒక న్యూస్ ఛానల్ ను స్థాపించారు . ఇరాన్ సుప్రీంకోర్టు ఈ ఏడాది (2020)జూన్ లో మరణశిక్ష విధించగా,దాన్ని అమలు చేశారు. 2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్లో ప్రభుత్వానికి …
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో ఘాటైన విమర్శలు చేసారు. ఇప్పటికే స్వపక్షంలోని నేతలు విమర్శలు చేస్తుంటే … తట్టుకోలేక వాటికి సమాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్న సోనియా .. రాహుల్ గాంధీ లు ప్రణబ్ విమర్శలపై నోరెత్తలేని పరిస్థితిలో పడిపోయారు. దివంగత నేతపై విమర్శలు చేస్తే సబబుగా ఉండదు. అదొక కాంట్రవర్సీ గా మారే …
రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు? ప్రభుత్వం మొండిగా ఎందుకున్నది?ఒకటి కాదు, రెండు కాదు 17 రోజులుగా ఉద్యమం సాగుతున్నది.మరింత ఉధృతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది,అని ఆందోళన చేస్తున్న రైతుల వాదన. కాదు రైతుల వెనక స్వార్థ రాజకీయ శక్తులున్నాయి అని ప్రభుత్వ వాదన. రైతుల వెనక రాజకీయ శక్తులు ఉంటే ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు …
మనం సినిమాల్లో శ్రీకృష్ణుడిని మీసాలు లేనట్టే చూసాం. కృష్ణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, శోభన్ బాబు,కాంతారావు, తదితర నటులు కూడా మీసాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. చిత్రకారులు కూడా ఎక్కడా కృష్ణుడికి మీసాలు ఉన్నట్టు బొమ్మలు గీయ లేదు. ఎక్కడయినా ఉన్నా ఒకటి ఆరా మాత్రమే. దీన్ని బట్టి కృష్ణుడికి మీసాలు లేనట్టే భావిస్తాం. కానీ …
సినిమా తీయడం గొప్పకాదు…దాన్ని రిలీజు చేసుకోవడంలోనే ఉంది మజా. తీసిన సినిమాకు గుర్తింపు రావాలన్నా…కాసులు రాలాలన్నా ముందు అది థియేటర్లలోకి వెళ్లాలి. ఇలా తయారైన సినిమాలను జనాల దగ్గరకు చేర్చే వాడు పంపిణీదారుడు. విచిత్రమేమిటంటే…ఎవరో తీసిన సినిమాకు గుర్తింపు తీసుకొచ్చే ఈ పంపిణీ దారుల ముఖాలుగానీ పేర్లుగానీ ప్రేక్షకులకే కాదు ప్రపంచానికే తెలియవు. కానీ సినిమాకు వారు …
error: Content is protected !!