Vissanna Vedam …………………………………
గుండమ్మ కథ సినిమాలో ఓ పాట ఉంది. ‘లేచింది మహిళా లోకం’ అని .. ఈ పాట చాలా పాపులర్ సాంగ్. ఈ పాటలోనే “ఎపుడో చెప్పెను వేమన గారు,అపుడే చెప్పెను బ్రహ్మం గారు,
ఇప్పుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మ .. విస్సన్న చెప్పిన వేదం కూడా”అని ఘంటసాల గారు పాడారు.
వేమన ఎవరో మనందరికి తెలుసు.
అలాగే కాలజ్ఞానం చెప్పిన పోతులూరి వీర బ్రహ్మం గారి గురించి కూడా తెలుసు.
కాని ఈ ‘విస్సన్న’ ఎవరో ఎవరికి తెలీదు. కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు. ఆయన చెప్పిన వేదం కూడా తెలియదు.చెప్పేవారు లేక ఆయన కూడా ఓ మహానుభావుడు అయి ఉంటాడని సరిపెట్టు కున్నాం.
కానీ ఆయన కూడా ఓ చారిత్రక పురుషుడే! ఆయన పేరు ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రులు. విస్సన్న గా పేరు పొందిన ఆయన వేదం చెప్పలేదు కానీ ఏ విషయంలో నైనా అద్భుతంగా వాదన చేసే వారట. వాదనలో ఆయన్ని ఓడించే వాడు ఆరోజుల్లో ఎవరూ ఉండేవారు కాదట. వాదనలకు ఆ విస్సన్న ఎంతో ప్రసిద్ధి. ఏ విషయం లోనైన ఆయన నిర్ణయాన్ని కాదన గలిగే వారు లేక పోవడం వల్ల ఆయన వాక్కే వేద వాక్కు అయింది.
ఈ విస్సన్న గారిది గోదావరి జిల్లా. ఈయన మహా పండితుడు బులుసు అచ్చయ్య గారి శిష్యుడు. అటువంటి వారి శిష్యుడైన విశ్వపతి శాస్త్రులు కూడా మహా పండితుడే కాక వాదనలో కూడా మహా దిట్ట.అందువల్ల ఏ సంవాదంలో నైనా ఆయన మాటే చెల్లి … చివరకు విస్సన్న చెప్పిందే వేదం అనే మాటగా అని స్థిరపడింది.
దాన్నే పింగళి నాగేంద్ర రావు మాస్టారు పాటలో ప్రయోగించారు. బహుశా పింగళి వారికి ఈ విస్సన్న పంతులు గారు వ్యక్తిగతంగా తెలిసి ఉండొచ్చు. ఇక ఈ విషయం అసలు రచయిత పేరు లేకుండానే వాట్సాప్ గ్రూపుల్లో .. పేస్బుక్ గ్రూపుల్లో తిరిగింది. ఇంకా ఏదైనా సమాచారం తెలిస్తే పంపించండి ప్లీజ్.
కర్టసీ ….. మూల రచయిత Gopala Krishna Rao Pantula ..