క్రియేటివిటీలో తల్లికి తగ్గ తనయ మేడా సింధూశ్రీ !

Sharing is Caring...

Amazing creativity……………………   

Subbu .. Rv……………………………… 

విజయవాడ అయ్యప్ప నగర్ గణేష్ వీధిలో నివసిస్తున్న మేడా సింధూశ్రీ తల్లి మేడా రజని క్వీన్ ఆఫ్ క్రాఫ్ట్స్ గా పేరుగాంచిన ప్రముఖ క్రియేటివ్ క్రాఫ్ట్స్ టీచర్. బాల్యం నుంచి తల్లి చేస్తున్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ చూసి ఇన్స్పిరేషన్ పొంది నాన్న మేడా సతీష్ ప్రోత్సాహం తో  పెయింటింగ్ లు వేయటం… పనికిరాని పేపర్లతో క్విల్లింగ్ వర్క్స్ చేయటం… తల్లిదండ్రుల సలహాలతో క్రియేటివ్ క్రాఫ్ట్ వర్క్స్  చేస్తూ తన ప్రతిభతో అధ్బుత కళాఖండాలను రూపొందిస్తూ వివిధ స్థాయి పోటీలూ ప్రదర్శన ల్లో పాల్గొంటూ బహుమతులతో పాటు పలువురు ప్రశంసలను పొందుతుంది మేడా సింధూశ్రీ.

చదువుకుంటూనే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకోవడం తన రెగ్యులర్ స్టడీస్ కి బాగా ఉపయోగపడుతుందని సైన్స్ బొమ్మలు వేయటానికి… రికార్డ్స్.. ప్రాజెక్టు వర్క్స్ చేయటానికి ఈ క్రియేటివ్ స్కిల్స్ చాలా దోహదం చేస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తుందీ సింధూశ్రీ.

తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువులు స్ఫూర్తి శ్రీనివాస్, ఎస్. పి.మల్లిక్ ల సలహాలతో వివిధ రకాల ఆర్ట్, క్రాఫ్ట్,  ఫోటోగ్రఫీ కాంటెస్ట్ లూ,ఎగ్జిబిషన్ లలో పాల్గొని ప్రశంసా పత్రాలను బహుమతులను పొంది తనతోటి విద్యార్థులకు స్ఫూర్తి గా నిలుస్తుంది సింధూశ్రీ.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన లోయర్ గ్రేడ్ పరీక్షల్లో పస్ట్ డివిజన్ లో పాసయ్యింది.తన కాళ్ళ మీద తాను స్వయంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో సింధూ ఆర్ట్స్ పేరు మీద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్డర్లు తీసుకుని..ఖాళీ సమయాల్లో చేసుకుంటూ తన  కాలేజీ ఫీజులు తానే  కట్టుకుంటూ పలువురికి ఆదర్శవంతంగా నిలుస్తుంది.

స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్,ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ..జాషువా సాంస్కృతిక వేదిక సంస్థ ల ప్రోత్సాహంతో ప్రపంచ మహిళా దినోత్సవం, ఉగాది వేడుకలు,ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం,దసరా సాంస్కృతికోత్సవాలు ఆర్ట్ ప్యారడైజ్ వంటి ఆర్ట్ ఈవెంట్స్ లో పాల్గొని ప్రసంసా పత్రాలను, బహుమతులను..అతిథుల ఆశీస్సులను పొందింది.

భవిష్యత్తులో వైద్యురాలిగా  స్థిర పడి ఉత్తమ చిత్రకారిణిగా ..పేరు గడించాలనే కృత నిశ్చయంతో ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తున్న యువ చిత్రకారిణి మేడా సింధూశ్రీ ప్రస్థానం నిజంగా స్ఫూర్తి దాయకం.

ఆర్ట్ అండ్ క్రియేటివ్ క్రాఫ్ట్ వర్క్స్ తో పాటు.. మండాల ఆర్ట్..ఫ్యాబ్రిక్ పెయింటింగ్.. గ్లాస్ పెయింటింగ్…. పెన్సిల్ పోట్రేట్… స్టిల్ లైఫ్ పెయింటింగ్ .. కొలాజ్ ఆర్ట్…. ల్యాండ్ స్కేప్ ఆర్ట్…. రియలస్టిక్ పెయింటింగులు చేయటమేంటే తనకు చాలా ఇష్టమనీ..తన మనసుకూ, మెదడుకు చక్కటి రిలాక్సేషన్ గా ఉంటుందని .. దాని వల్ల యాక్టవ్ గా ఉంటూ బాగా చదువుకోగలుగుతున్నానని  చెబుతున్న  మేడా సింధూశ్రీ భవిష్యత్తులో వైద్యురాలిగా, ఉత్తమ చిత్రకారిణి గా స్థిరపడాలని  కోరుకుంటోంది ..  ఆల్ ది బెస్ట్ చెబుదామా..

.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!