కైలాస పర్వతం మానవ నిర్మితమేనా ?

Sharing is Caring...

Mount Kailash……………………………………. 

కైలాస పర్వతంపై మహాశివుడు కొలువుంటాడని హిందువులు అంతా భావిస్తారు. కానీ  కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్‌ ఈ.ఆర్‌.ముల్దేశేవా అధ్వర్యంలోని పరిశోధకుల బ‌ృందం కొన్నేళ్ళనుంచి వాదిస్తోంది.

1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద ఈ టీం విశేషమైన పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి కైలాస పర్వతం పిరమిడ్‌ ఆకారంలో మానవులు నిర్మించిన అత్యద్భుతమైన భారీ కట్టడమని కొన్నాళ్ల క్రితం చెప్పారు. కేవలం కైలాస పర్వతం మాత్రమే కాదని, దాని చుట్టూ వందకు పైగా పిరమిడ్‌ ఆక‌ృతులు కూడా ఉన్నాయని, వాటిని కూడా మానవులే నిర్మించారని అభిప్రాయ పడ్డారు. 

అయితే ఈ పిరమిడ్లను మన కన్నా ఎంతో అడ్వాన్స్‌ గా ఉన్నవాళ్లు నిర్మించి ఉంటారని అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు.  కైలాష్ పర్వతం పరిపూర్ణ ఆకృతి ప్రపంచంలోని ఇతర శిఖరాల కంటే భిన్నంగా ఉంటుంది. ఏ కోణంలో చూసినా ఇది సహజ పర్వతంలా కనిపించదు. కైలాష్ పర్వతం అన్ని పారానార్మల్ కార్యకలాపాలకు కేంద్రమని కూడా  ఆ టీమ్ అప్పట్లో చెప్పుకొచ్చింది.

కైలాస పర్వతాన్ని కేంద్రంగా చేసుకొని చుట్టూ ఓ పద్ధతి ప్రకారం వందకు పైగా పిరమిడ్లను నిర్మించారని టీమ్ వివరించింది. అయితే ఈఆర్‌.ముల్దేశేవా టీమ్ వాదనను చైనా శాస్త్రవేత్తలు, భారతీయ ఆధ్యాత్మికవేత్తలు ఖండించారు. ఈఆర్‌.ముల్దేశేవా వాదనతో ఏకీభవించడం లేదని ప్రకటించారు.ఇది సహజంగా ఏర్పడిన పర్వతమని చైనా శాస్త్రవేత్తలు వాదించారు. అది దేవుని లీల అని భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!