ఈ శ్వ రం ………………………………..
ఇప్పటివరకూ మిగతామతాలవారికి పెద్దగా పరిచయం అవ్వని ముస్లిం సంస్కృతిని చాలా దగ్గరగా చూపిస్తుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి, విధివంచిత ముస్లింల జీవితాలు ఎలా గడుస్తుంటాయో సజీవంగా చూపించింది. చేపలవేటకు పోయిన తండ్రి మరణించడం,తల్లి మానసిక స్థితిలో మార్పు వచ్చి పిచ్ఛిప్రవర్తతో ఉండిపోవడం,తండ్రి సంవత్సరీకాన్ని ఘనంగా జరిపే ఉద్దేశంతో తమ్ముడు సంపాదనకోసం ఎక్కడికో వెళ్లిపోవడం, కొడుకు ఒడుగుల ఫంక్షన్ జరుగుతుండగా తమ్ముడు టెర్రరిస్టులలో కలిసాడనే అభియోగంమీద కుటుంబ సమేతంగా విచారణకు పోవలసి రావడం, భర్త నుండి తలాక్ తీసుకోవలసి రావడం, తల్లితోపాటు ఊరొదిలి ఒక మసీదులో తలదాచుకోవడం… ఈ పరిణామాల అనంతరం కథ మొత్తం మారిపోయి చిక్కబడుతుంది. అవన్నీ తెరపై చూస్తేనే బాగుంటుంది.
తండ్రి తమ్ముడూ తల్లీ దూరమై సమాజం నుండి వెలివేయబడిన పరిస్థితులనుండి తన ఆలోచనల రూటు మార్చుకుని తండ్రికి సంవత్సరీకం మటన్ బిర్యానీతో ఘనంగా నిర్వహించాలన్న తల్లి ఆఖరి కోరిక తీర్చడానికి తను ఏంచేసిందీ.. స్త్రీగా సహజసిద్ధమైన తన సెక్స్ కోరికలను తృప్తి పరుచుకుంటూనే సంపాదించుకోగల వృత్తిని ఎంచుకుని డబ్బు సంపాదించి వృత్తిని వదిలేసి తన జీవితాన్ని అథోగతిపాలు చేయడంలో పాల్పంచుకున్న శత్రువులందరినీ ఇఫ్తార్ విందుకి ఆహ్వానించి తల్లి కోరికతోపాటు తన పగనుకూడా ఎలా తీర్చుకుందీ అనేదే ఈ బిర్యానీ యొక్క అసలు కథ.
క్లైమాక్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా కాసేపు మైండ్ ఆబ్సెంట్ అయిపోవడం ఖాయం. ముఖ్యంగా ఆఖరి సీన్. ఈ సినిమా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. మరెన్నోరివార్డ్ లను సొంతం చేసుకుంది. కేరళ లో కొన్ని చోట్ల సినిమా ప్రదర్శనకు అంతరాయాలు కలిగాయి. దర్శకుడు సాజిన్ బాబు గతంలో ఆన్ టు ది డెస్క్, ఆయాల్ శశి వంటి చిత్రాలు తీసి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బిర్యానీ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. బిర్యానీ సినిమా ప్రస్తుతం టెలిగ్రామ్ లో, కేవ్ యాప్ లో ఉంది.