ఒక ఉగ్రవాది ప్రేమకథ !!

Sharing is Caring...

 Action thriller ……

‘రాంగీ’ (Raangi). ఇది 2022 నాటి సినిమా. ప్రముఖ నటి త్రిష ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి కథ అందించగా, ఎం. శరవణన్ దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ‘రాంగీ’ పేరుతోనే డబ్ అయిన ఈ చిత్రం ఒక విభిన్నమైన గ్లోబల్ టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కింది. 

కథాంశం

శివంగి (త్రిష) చెన్నైలోని ఒక ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌లో పని చేసే జర్నలిస్ట్.తన మేనకోడలు సుస్మిత (అనశ్వర రాజన్) పేరుతో ఎవరో ఒక ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిలతో చాట్ చేస్తున్నట్లు గమనిస్తుంది. ఆ అకౌంట్‌ను ఎవరు వాడుతున్నారో కనిపెట్టే క్రమంలో,శివంగి స్వయంగా ఆ అకౌంట్ నుండి అవతలి వ్యక్తితో చాటింగ్ చేయడం ప్రారంభిస్తుంది.

అయితే ఆమె ఊహించని విధంగా, అవతలి వైపు చాట్ చేస్తున్న వ్యక్తి లిబియాకు చెందిన ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడు ఆలీమ్ (బెక్జోడ్ అబ్దుమాలికోవ్). ఒక సాధారణ ఆన్‌లైన్ చాటింగ్ కాస్తా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ (FBI) వరకు వెళ్తుంది. ఆ తర్వాత, శివంగి  ఆమె మేనకోడలు అంతర్జాతీయ కుట్రలో ఎలా చిక్కుకున్నారు?

ఉగ్రవాది ఆలీమ్‌తో శివంగి కి  ఏర్పడిన ఎమోషనల్ బాండింగ్ ఏంటి? శివంగి,ఆమె మేనకోడలు కుట్ర నుండి ఎలా బయట పడ్డారు? అనేదే ఈ సినిమా కథ. 

బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో త్రిష ఈ సినిమాను పూర్తిగా తానై నడిపించారు. శివంగి పాత్రలో త్రిష ఒదిగిపోయింది. జర్నలిస్ట్‌గా ఆమె చూపిన పట్టుదల, యాక్షన్ సీన్స్‌లో ఆమె చేసిన స్టంట్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సోషల్ మీడియా వల్ల నేటి యువత ఎలాంటి ప్రమాదాల్లో పడుతున్నారు అనే పాయింట్‌తో కథను మొదలుపెట్టిన విధానం, ఫస్ట్ హాఫ్‌లోని సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగుంటాయి. ఉగ్రవాదిగా నటించిన బెక్జోడ్ అబ్దుమాలికోవ్ బాగా చేసాడు.ఇతర నటీ నటులంతా చక్కగా నటించారు.

భారతదేశంలో ఉన్న హీరోయిన్, లిబియాలో ఉన్న ఉగ్రవాది మధ్య జరిగే చాటింగ్ సీన్లు, వారి మధ్య ఏర్పడే వింతైన బంధాన్ని విభిన్నంగా చూపించారు. కథ చెన్నై నుండి అంతర్జాతీయ స్థాయికి (లిబియా) మారిన తర్వాత లాజిక్స్ పూర్తిగా పక్కనబెట్టేశారు. ఒక జర్నలిస్ట్ నేరుగా విదేశీ ఉగ్రవాదులతో, ఎఫ్‌బీఐ (FBI) తో అంత ఈజీగా డీల్ చేయడం నమ్మశక్యంగా అనిపించదు. సినిమా ముగింపు చాలా గందరగోళంగా ఉంటుంది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ క్లారిటీ లోపించింది. 

తన మేనకోడలి పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్‌ను త్రిష కనిపెట్టే సీన్, ఆ తర్వాత తనే స్వయంగా చాటింగ్ చేస్తూ అవతలి వ్యక్తి లిబియా ఉగ్రవాది ఆలీమ్ అని తెలుసుకునే  సీన్లు చాలా ఆసక్తికరంగా సాగుతాయి.చెన్నైలో ఉన్న జర్నలిస్ట్ త్రిషకు, లిబియాలో ఉన్న ఉగ్రవాదికి మధ్య సోషల్ మీడియా యాప్ ద్వారా జరిగే చాటింగ్,  వీడియో కాల్స్ సీన్లు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఒక తీవ్రవాది మనస్తత్వాన్ని మార్చడానికి ఆమె చేసే సంభాషణలు ఆకట్టుకుంటాయి.ఒక సాధారణ ఆన్‌లైన్ చాటింగ్ కాస్తా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (FBI) నిఘా నీడలోకి వెళ్లడం, విదేశీ అధికారులు హీరోయిన్‌ను ట్రాక్ చేసే గ్లోబల్ ఇన్వెస్టిగేషన్ సీన్లు థ్రిల్ ఇస్తాయి. సినిమా సెకండ్ హాఫ్‌లో కథ ఉగ్రవాద శిబిరాల వైపు మారినప్పుడు వచ్చే విజువల్స్, అక్కడ త్రిష తన మేనకోడలిని కాపాడుకోవడానికి చేసే సర్వైవల్ పోరాటం విజువల్‌గా బాగుంటుంది.

సినిమాలో హీరోయిన్ (త్రిష) పాత్ర చేసే కొన్ని పనులు, చెప్పే డైలాగులు వివాదాస్పదంగా అనిపిస్తాయి. ఫేస్ బుక్ లో అమ్మాయి ప్రొఫైల్ కనిపిస్తే తప్పుగా ఆలోచించే మగాళ్ళు ఎందరో ఉన్నారంటూ మగరాయుళ్లకు లెక్చర్ ఇచ్చిన శివంగి ఉగ్రవాదితో చేయడమనేది ఎంత వరకు కరెక్ట్ ? అనే సందేహం కలుగుతుంది. కానీ ఆమె చేయకపోతే కథే లేదు. కథలో యువ ఉగ్రవాది (ఆలీమ్) పాత్రను, అతను చేసే హింసాత్మక ఘటనలను కూడా సమర్థించేలా స్క్రీన్ ప్లే రాయడం విమర్శలకు దారితీసింది. 

చెన్నైలో ఉన్న జర్నలిస్ట్‌కు, విదేశాల్లో ఉన్న ఉగ్రవాదికి మధ్య నడిచే ఎమోషనల్ బాండింగ్, వారి మధ్య చూపించిన విచిత్రమైన ఆకర్షణ సహజంగా అనిపించదు. ఇంటర్నేషనల్ లెవెల్ క్రైమ్ థ్రిల్లర్ అని మొదలుపెట్టి, ముగింపు వచ్చేసరికి కథ గాడి తప్పి చాలా గందరగోళంగా, సాగదీతగా ముగుస్తుంది. లాజిక్ గురించి ఆలోచించకుండా ఉంటే ..సినిమా బాగానే ఉందనిపిస్తుంది.  

ఈ సినిమాకు కెమెరామెన్‌గా వ్యవహరించిన శక్తివేల్ వర్క్ చాలా రిచ్‌గా ఉంటుంది. కథ చెన్నైలో మొదలై ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్, లిబియా వంటి విదేశీ ప్రాంతాలకు మారుతుంది. ఆయా లొకేషన్ల డిఫరెన్స్‌ను బాగా చూపించారు.హీరోయిన్, ఉగ్రవాది ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసుకునే సీన్లలో మొబైల్ స్క్రీన్స్, వీడియో కాల్స్, లొకేషన్ ట్రాకింగ్ ఎలిమెంట్స్‌ను కెమెరా ఫ్రేమింగ్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.

ఈ సినిమాకు సి. సత్య సంగీతాన్ని అందించారు. యాక్షన్ బ్లాక్స్, ఎఫ్‌బీఐ (FBI) ఇన్వెస్టిగేషన్ సీన్లలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. 

మొత్తంగా చెప్పాలంటే, ‘రాంగీ’ సినిమాలో సంగీతం సపోర్టింగ్‌గా ఉన్నప్పటికీ, కెమెరా పనితనం మాత్రం గ్లోబల్ థ్రిల్లర్‌కు సరిపోయే హై-క్వాలిటీ విజువల్స్‌ను అందించింది. ఈ సినిమా  నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు వెర్షన్ లో ఉంది ..ఆసక్తి  ఉన్నవారు చూడవచ్చు. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!