ఇదొక సైకలాజికల్,క్రైమ్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Psychological, crime thriller…..

‘అసుర్’ (Asur)  వెబ్ సిరీస్ సైకలాజికల్, క్రైమ్ మైథలాజికల్ థ్రిల్లర్.. హిందూ పురాణాలు .. ఆధునిక ఫోరెన్సిక్ సైన్స్‌ను మిక్స్ చేస్తూ తీసిన ఈ సిరీస్ క్రైమ్ ,సస్పెన్స్ చిత్రాలను చూసే వారికి నచ్చుతుంది. రెండు సీజన్ల తెలుగు వెర్షన్స్ ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఉన్నాయి.

కథ ఏమిటంటే ?

కథ అంతా శుభ్ జోషి అనే ఒక అత్యంత తెలివైన సైకో సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతను చిన్నప్పటి నుండి తనను తాను ఈ కలియుగాన్ని అంతం చేయడానికి వచ్చిన ‘కలి రాక్షసుడిగా’ (అసురుడిగా) భావిస్తూ ఉంటాడు. సమాజంలో మంచిని అంతం చేసి, అందరిలోని చెడును (Dark Side) నిద్రలేపడమే అతని లక్ష్యం.

ఈ క్రమంలో అతను వరుసగా దారుణమైన హత్యలు చేస్తూ, సిబిఐ  ఫోరెన్సిక్ నిపుణులైన ధనంజయ్ రాజ్‌పుత్ (అర్షద్ వార్సి), నిఖిల్ నాయర్ (బరున్ సోబ్తీ)లకు సవాల్ విసురుతాడు. ఆ అసురుడిని పట్టుకోవడానికి వీరు చేసిన మైండ్ గేమ్స్, పరిశోధనలే ఈ సిరీస్ కథ.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కు భారతీయ పురాణాలు, వేదాలు, భగవద్గీత శ్లోకాలను ముడిపెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. CBI సీనియర్ ఆఫీసర్‌గా అర్షద్ వార్సి, ఎమోషనల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌గా బరున్ సోబ్తీ బాగా నటించారు. విలన్ (శుభ్) పాత్ర డిజైన్ చేసిన తీరు బాగుంది.

చిన్నప్పటి శుభ్ జోషి పాత్రలో బాలనటుడు విశేష్ బన్సల్ అద్భుతంగా నటించి మెప్పించాడు.పెద్దయిన తర్వాత శుభ్ జోషి గా అభిషేక్ చౌహాన్ నటించాడు.. పాత్ర ధారులంతా చక్కగా నటించారు.కొన్ని ఎపిసోడ్స్  ముగిసేటప్పుడు వచ్చే ట్విస్ట్‌లు తర్వాతి ఎపిసోడ్ చూడాలనే ఉత్సుకతను కలిగిస్తాయి.

ముఖ్యంగా సీజన్ 1 క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది.రెండో సీజన్‌లో పురాణాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్ ఫేక్, హ్యాకింగ్ వంటి ఆధునిక డిజిటల్ క్రైమ్స్ యాడ్ చేశారు.కొన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్ సీన్లు చాలా వివరంగా చూపించడం వల్ల కథ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. చాలా చోట్ల లాజిక్ లోపాలు ఉన్నాయి.

సీజన్ 2 లో హ్యాకింగ్, సాంకేతికతకు సంబంధించిన కొన్ని సీన్లు కాస్త అతిగా, నమ్మశక్యం కాని విధంగా అనిపిస్తాయి.సిరీస్ అంతా చాలా సీరియస్‌గా, రక్తం, హత్యలు,కాస్త భయానక వాతావరణంతో సాగుతుంది. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇది అంతగా సెట్ అవ్వదు. సిరీస్ కి IMDb రేటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి .

ఎపిసోడ్ 1 (The Dead Can Talk): కథ ప్రారంభమయ్యే విధానం ఇది. వారణాసి నేపథ్యంలో ఒక పూజారి హత్య, ఆపై ముసుగు వేసుకున్న సీరియల్ కిల్లర్ ఎంట్రీతో సిరీస్ చాలా పవర్‌ఫుల్‌గా స్టార్ట్ అవుతుంది.
ఎపిసోడ్ 2 (Rabbit Hole): సిబిఐ ఆఫీసర్ ధనంజయ్ రాజ్‌పుత్ (అర్షద్ వార్సి) భార్య దారుణంగా హత్యకు గురికావడం, ఆ నింద అతనిపైనే పడి అరెస్ట్ అవ్వడం వంటి ట్విస్ట్‌లు ఇందులో ఉంటాయి.

ఎపిసోడ్ 5 & 6  విలన్ ‘శుభ్’ చేతిలో నిఖిల్ నాయర్ (బరున్ సోబ్తీ) చిక్కడం, తన కుటుంబ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక బిలియనీర్‌ను చంపాల్సి రావడం వంటి సీన్లు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను ఇస్తాయి

సీజన్ 2 లో
ఎపిసోడ్ 1 (The Dance of Death): మొదటి సీజన్ ముగిసిన తీవ్రమైన విషాదం నుండి పాత్రలు ఎలా కోలుకున్నాయో చూపిస్తూ, విలన్ తన సరికొత్త డిజిటల్ దాడులను ప్రారంభించే ఎపిసోడ్ ఇది. 
ఎపిసోడ్ 4 (Designing the Future): ఈ ఎపిసోడ్‌లో విలన్ ‘శుభ్’  గతాన్ని, అతని చిన్ననాటి మూలాలను వెలికితీసే సీన్లు, సిబిఐ టీమ్‌లో ఉన్న ఒక నమ్మకద్రోహి గురించిన నిజాలు బయటపడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 

ఇవి సిరీస్ మొత్తానికి హైలైట్ ఎపిసోడ్లు.  AI సాయంతో విలన్ దేశవ్యాప్తంగా ప్రజల ప్రాణాలతో ఎలా మైండ్ గేమ్ ఆడాడు, చివరకు మంచి గెలిచిందా లేదా చెడు గెలిచిందా అనేది  క్లయిమాక్స్.  ‘అసుర్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయినప్పటికీ ఇందులో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. 

కథలో విలన్ ‘శుభ్’ పాత్రకు విపరీతమైన ‘ప్లాట్ ఆర్మర్’ (Plot Armor) ఇచ్చారు. అతను ఎప్పుడు ఏం చేసినా సిబిఐ కంటే పది అడుగులు ముందే ఉంటాడు. సిబిఐ, యాంటీ టెర్రర్ ఫోర్స్ (ATF) లాంటి పెద్ద సంస్థలు ఉన్నప్పటికీ, ఒకే ఒక్క సైకో కిల్లర్ దేశాన్ని మొత్తం శాసిస్తుంటే వారు చాలా చోట్ల చేష్టలుడిగి చూస్తుండి పోతారు.

ఈ చిన్న చిన్న లాజిక్ లోపాలను, సాగదీతను పక్కన పెడితే, కథలోని కొత్తదనం కోసం, నటీనటుల పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ కోసం ‘అసుర్’ను  ఒకసారి చూడవచ్చు.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!