ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Crime action thriller ……………..

‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ (Inspector Avinash) బాలీవుడ్ ప్రముఖ నటుడు రణదీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన ఒక సూపర్ హిట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.ఈ సిరీస్ 1990ల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో 150కి పైగా ఎన్‌కౌంటర్లు చేసిన నిజ జీవిత సూపర్‌కాప్ ‘అవినాష్ మిశ్రా’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.

సీజన్ 1: యూపీలో మాఫియా, రౌడీయిజం, ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఆఫీసర్ అవినాష్ మిశ్రా చేసిన పోరాటాన్ని ఇందులో చూపించారు. సీజన్ 2: ఈ సరికొత్త సీజన్‌లో అవినాష్ మిశ్రా ఒక ప్రమాదకరమైన అంతర్జాతీయ ఆయుధ ముఠాను (Arms Cartel) పట్టుకోవడానికి ప్రాణాలను పణంగా పెడతాడు. రాజకీయ కుట్రలు, ద్రోహాల మధ్య తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడనేది సీజన్ 2 కథ.
 
రణదీప్ హుడా (అవినాష్ మిశ్రాగా), అమిత్ సియాల్, షాలిన్ భానోత్,  రజనీష్ దుగ్గల్ కీలక పాత్రల్లో నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో ‘దేవి’ (హిజ్రా/ట్రాన్స్‌జెండర్) పాత్రను ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ పోషించారు.

తెలుగు ప్రేక్షకులకు ‘రక్త చరిత్ర’ (బుక్కా రెడ్డి పాత్ర), ‘గబ్బర్ సింగ్’ (విలన్ సిద్ధప్ప నాయుడు పాత్ర) సినిమాల ద్వారా సుపరిచితుడైన అభిమన్యు సింగ్ ఈ సిరీస్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న అత్యంత కఠినమైన ట్రాన్స్‌జెండర్ విలన్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

అవినాష్ మిశ్రా భార్య ‘పూనమ్ మిశ్రా’ పాత్రను బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ ఊర్వశి రౌతేలా పోషించారు.ఎప్పుడూ ప్రాణాల మీదకు తెచ్చుకునే ఒక పోలీస్ ఆఫీసర్ భార్యగా.. భయం, నిశ్శబ్దం, ధైర్యాన్ని ప్రదర్శించే ఒక బలమైన మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. 

దర్శకుడు నీరజ్ పాఠక్  ఈ సిరీస్‌ను గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు.యూపీలోని పాత భవనాలు, నదీ తీరాలు,  ఎన్‌కౌంటర్ జరిగే లొకేషన్లను డ్రోన్ (Aerial shots) ద్వారా వైడ్‌గా చూపించిన విధానం ఈ సిరీస్‌కు ఒక సినిమా స్థాయి గ్రాండ్‌నెస్ తెచ్చింది.

రాత్రి వేళల్లో జరిగే యాక్షన్ సీన్స్, చీకటి గదుల్లో మాఫియా ప్లానింగ్స్ కోసం వాడిన డార్క్-లైటింగ్ థీమ్ క్రైమ్ మూడ్‌ను పర్‌ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ఇన్‌స్పెక్టర్ అవినాష్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు, అలాగే ఎన్‌కౌంటర్ సీన్స్ జరుగుతున్నప్పుడు వచ్చే ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్లో రోమాంచితమైన ఫీలింగ్‌ను కలిగిస్తుంది.

రణదీప్ హుడా పాత్రలో జీవించాడు. తన పవర్‌ఫుల్ నటన,డైలాగ్ డెలివరీతో ఇన్‌స్పెక్టర్ పాత్రకు ప్రాణం పోశారు. . రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలు, పోలీస్ ఎన్‌కౌంటర్ బ్యాక్‌డ్రాప్ కథలను ఇష్టపడేవారికి ఇది ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్.

90వ దశకం నాటి లక్నో, అయోధ్య ప్రాంతాలను, అక్కడి గ్యాంగ్‌స్టర్ల భయానక వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు.ఎపిసోడ్‌ల వారీగా నేరస్థులను ఏరిపారేసే స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) యాక్షన్ సీన్లను ఎలివేట్ చేసింది.

అక్కడక్కడ హీరో నేరుగా కెమెరా వైపు చూస్తూ ప్రేక్షకుడితో మాట్లాడే విధానం కొందరికి కథా ప్రవాహాన్ని డిస్టర్బ్ చేసినట్లు అనిపిస్తుంది.కొందరికి నచ్చుతుంది కూడా.ఎనిమిది ఎపిసోడ్లు పూర్తి కాగానే కథ ఒక స్పష్టమైన ముగింపు లేకుండా, సీజన్ 2కు లీడ్ ఇస్తూ అకస్మాత్తుగా ఆగిపోతుంది.మితిమీరిన బూతులు లేకుండా, ఇంటెన్స్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి సీజన్ 1 బాగా నచ్చుతుంది.

సీజన్ 1 మొత్తం 8 ఎపిసోడ్‌లుగా సాగుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో ఒక ప్రత్యేకమైన నేరస్థుడిని టార్గెట్ చేశారు. దాదాపుగా అన్నిఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతాయి. అయోధ్య బాంబ్ హంట్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక నిజ  సంఘటన ఆధారంగా ఈ ఎపిసోడ్ తెరకెక్కింది.

అయోధ్యలో పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబును వెతికి పట్టుకుని, దాన్ని డిఫ్యూజ్ చేయడానికి అవినాష్ బృందం చేసే ఉత్కంఠభరితమైన పోరాటం సిరీస్‌లోనే బెస్ట్ థ్రిల్లింగ్ ఎపిసోడ్‌గా నిలుస్తుంది. నిజమైన లొకేషన్లలో షూట్ చేయడం వల్ల ఇది చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది.

తాండవ్  ఎపిసోడ్ ను ఆసక్తికరంగా తెర కెక్కించారు, ఇందులో అవినాష్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, అతని తండ్రితో ఉండే రిలేషన్, ఒక దారుణమైన రేప్ కేసుకు సంబంధించి నేరస్థులను అవినాష్ ఎన్‌కౌంటర్ చేసే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  

రాజకీయ నాయకుడు షేక్ (అమిత్ సియాల్) కుట్రలు, యూపీ డీజీపీ సామర్ ప్రతాప్ (జాకీర్ హుస్సేన్) వ్యూహాల మధ్య డ్రామా పీక్స్‌కు చేరుతుంది. అవినాష్‌ను ఇరికించడానికి శత్రువులు వేసే ప్లాన్, ఈ ఎపిసోడ్‌లోని క్లైమాక్స్ యాక్షన్ సీన్లు తదుపరి సీజన్ చూడాలనే క్యూరియాసిటీని పెంచుతాయి.

ఈ సిరీస్ రెండు సీజన్లు ప్రస్తుతం JioHotstar లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా 7 భాషల్లో అందుబాటులో ఉంది.సీజన్ 2లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!