Mani Bhushan…..
ట్రంప్ టూరులో వెళ్లిన అమెరికన్ జర్నలిస్టులకు… చైనావాళ్లు పూలార్లేసి పీటేసి ఫలారమెట్టి అడిగినకాడికి తీసుకెళ్లి ఫుటోవులు గుంజుతుంటే ఊర్కొంటారని; ఒక్కోడు ఒక్కో ఆర్ట్ సినిమా తీసి ప్రపంచానికి చైనా real-time picture చూపిద్దామని ఆశ పడితే… చైనా కట్టడి చేసిందట!
చేయదా మరి! అది చైనా! ట్రంప్, షీ జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో, అమెరికన్ ప్రెస్ పూల్ (జర్నలిస్టుల బృందం) ను చైనా భద్రతా సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. వైట్ హౌస్ మహిళా సిబ్బంది ఒకరు కిందపడిపోయి గాయపడ్డారు. చైనా మీడియా ప్రతినిధులు సైతం అమెరికన్ మీడియాను పక్కకు నెట్టేయడం వివాదానికి దారితీసింది.
పర్యటన ముగించుకుని తిరిగొచ్చే సమయంలో చైనా అధికారులు అమెరికన్ జర్నలిస్టులను అధ్యక్షుడి అధికారిక కాన్వాయ్ (Motorcade) వాహనాల్లోకి ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. వాళ్ళ పాలసీ వాళ్ళకుంటుంది మరి.
అది అమెరికా కాదు, మీడియా స్వతంత్రతకు రాజ్యాంగబద్దమైన హక్కును కల్పించడానికి. అది People’s Republic of China (PRC).అమెరికా రాజ్యాంగపు తొలి సవరణ (1791)లోనే స్వతంత్ర పత్రికా రంగానికి వీలు కల్పించారు. ‘ప్రజలకు తెలుసుకునే హక్కు (right to know)’ అవసరాన్ని గుర్తించారు.
తాజాగా వచ్చిన బ్లాగర్లు, ఈ–పేపర్, వెబ్సైట్ తదితర సొంత పబ్లిషర్లు సైతం ఈ స్వేచ్ఛను అనుభవించవచ్చు.
అలాగే, మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వాతంత్య్రం, హక్కులకు హామీ వంటివి రాజ్యాంగంలోనే కల్పించడానికి అది Republic of India కాదు… అది People’s Republic of China (PRC).ఈ విషయంలో చైనా ఒక్కటే కాదు, రష్యా, ఉత్తర కొరియా, క్యూబా వంటి కమ్యూనిస్ట్ దేశాలన్నీ anti-media లేదా సంపూర్ణ సెన్సార్షిప్ కలిగిన కఠిన వైఖరితోనే ఉంటాయి.
భారత దేశంలోనూ, అమెరికాలోనూ ఆవగింజంత ఇన్ఫర్మేషన్ దొరికితే, ఆనపకాయంత సాగదీసి రోజంతో షో నడిపించవచ్చు. కమ్యూనిస్ట్ దేశాల్లో అలా సాగదు.కమ్యూనిస్ట్ పాలకులు మీడియాకి, తద్వారా వార్తా ప్రసారానికి ఏ మేరకు అవకాశం ఇవ్వాలో ఆ మేరకే అవకాశం ఇస్తారు.వాళ్లు పెట్టింది తినాలి, చెప్పింది రాసుకోవాలి, ఇచ్చిన క్లిప్పునే ప్లే చేసుకోవాలి.
అమెరికా, భారత దేశాల్లో మీడియా పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించినా… ప్రభుత్వం కల్పించుకుని చేపట్టే చర్యలు, నిషేధాలు లేకపోలేదు. కాకపోతే, చైనా తదితర ప్రగతిశీల (?) దేశాలలో మాదిరిగా ఉక్కు తెరలు ఉండవ్.
Reporters Without Borders (RSF) World Press Freedom Index ప్రకారంగా… చైనా 178వ స్థానంలో ఉంది. ఆ ఇండెక్స్ని 180 దేశాలలో ప్రెస్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రూపొందించారు. అంటే, చైనా దాదాపు అట్టడుగున ఉంది. చైనా సరసన రష్యా (172వ ర్యాంక్), ఉత్తర కొరియా (179), ఎరిత్రియా (180 స్థానాల్లో ఉన్నాయి. క్యూబా వీటికంటే కొంత మెరుగ్గా, ఇండియా (157) కంటే తక్కువగా 160వ ర్యాంకులో ఉంది. అయినప్పటికీ, క్యూబాలో ఏం జరుగుతోందో ఇప్పటికీ ప్రపంచానికి పూర్తిగా తెలియదు.
భారత దేశంలోనూ, అమెరికాలోనూ ఆవగింజంత ఇన్ఫర్మేషన్ దొరికితే, ఆనపకాయంత సాగదీసి రోజంతో షో నడిపించవచ్చు. కమ్యూనిస్ట్ దేశాల్లో అలా సాగదు.

