ఒక మోస్తరు హారర్ థ్రిల్లర్‌ !!

Sharing is Caring...

Not very impressive……..

‘మాన్షన్ 24’ వెబ్ సిరీస్ ఒక మోస్తరు హారర్ థ్రిల్లర్‌గా నిలిచింది. జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఒక పాత భవనం చుట్టూ కథ తిరుగుతుంది.

కథ ఏమిటంటే ?

అమృత (వరలక్ష్మి శరత్‌కుమార్) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆమె తండ్రి కాళిదాసు (సత్యరాజ్), ఒక పురావస్తు శాస్త్రవేత్త. విలువైన వస్తువుతో కనిపించకుండా పోవడంతో అతనిపై దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. తన తండ్రి నిర్దోషి అని నిరూపించడానికి అమృత ఒక మాన్షన్‌కు వెళ్తుంది.

అక్కడ వాచ్‌మెన్ (రావు రమేష్) ఆమెకు ఆ భవనంలోని వివిధ గదుల్లో జరిగిన భయంకరమైన కథలే ఈ సిరీస్.పాడుపడిన భవనం, అందులో ఆత్మలు వంటి అంశాలు కొత్తగా ఏమీ అనిపించవు. క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది, ముగింపు ఊహకు అందేలా ఉంది..కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అవ్వడం, కొన్ని హారర్ సీన్లు భయపెట్టేలా లేకపోవడం మైనస్ పాయింట్.

ఆరు ఎపిసోడ్స్ లో అన్నీ వీక్షకులను ఆకట్టుకునేలా లేవు. మూడు ఎపిసోడ్స్ ను చూడవచ్చు.
ఎపిసోడ్ 1 (రూమ్ నెం. 504): ఇది సిరీస్‌కు ఒక మంచి ఆరంభాన్ని ఇస్తుంది. ఒక నవలా రచయిత ఎదుర్కొనే భయానక పరిస్థితుల చుట్టూ తిరిగే ఈ కథ, హారర్ ఎలిమెంట్స్ పరంగా మిగిలిన ఎపిసోడ్ల కంటే కొంత నయమనిపిస్తుంది.

ఎపిసోడ్ 4 (రూమ్ నెం. 409): ఒక క్లాసికల్ డాన్సర్ చుట్టూ తిరిగే ఈ కథలోని విజువల్స్, ఆమె ఎదుర్కొనే వింత సంఘటనలు కొంతవరకు థ్రిల్లింగ్‌గా ఉంటాయి.ఎపిసోడ్ 6 (రూమ్ నెం. 24): ఇది సిరీస్‌లో అత్యుత్తమ రేటింగ్ పొందిన ఎపిసోడ్. కథలోని అసలు మిస్టరీ, అమృత తండ్రి ఏమయ్యాడు అనే విషయాలు ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌లోనే రివీల్ అవుతాయి. సస్పెన్స్ పరంగా కొంత మెరుగ్గా ఉంటుంది.

గదుల్లో లైట్లు ఆన్ అండ్ ఆఫ్ కావడం,తలుపులు తెరుచుకునే శబ్దాలు, గజ్జెల మోత, ముఖానికి తెల్లటి రంగు పులుముకుని కనిపించే దెయ్యాలు ఈ సిరీస్ లోనూ కనిపిస్తాయి. మనుషులను ముక్కలుగా నరికి ఆనందం పొందే సైకో ఎపిసోడ్ మరీ అధ్వానంగా ఉంది. మొత్తం మీద చెప్పుకోవాలంటే అంత గొప్పగా లేదు.

చివరి ఎపిసోడ్ కూడా రొటీన్ గానే ఉంది.ముగింపు ను ప్రేక్షకుడు ఊహించే విధంగా ఉంటుంది. సిరీస్ లో వరలక్ష్మి ,రావు రమేష్, సత్యరాజ్, రాజీవ్ కనకాల వంటి నటులను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. వరలక్ష్మి తన పాత్రలో ఒదిగిపోయింది. రావు రమేష్ తన డైలాగ్ డెలివరీతో కథను రక్తికట్టించే ప్రయత్నం చేశారు.భవనం సెట్టింగ్, లైటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హారర్ మూడ్‌ను తీసుకురావడానికి దోహదపడ్డాయి.

ప్రతి కథను సూటిగానే చెప్పారు కానీ కొన్ని కథలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. వికాస్ సంగీతం ఈ సిరీస్ కు ప్లస్అయింది. సినిమాటోగ్రాఫర్ బి. రాజశేఖర్ ప్రతి సీన్ ను బాగా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.ఓంకార్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. కథలపై మరింత కసరత్తు చేసి ఉండాల్సింది..

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!