మోహిత్ శర్మ కథేనా ఆ పాత్రకు ప్రేరణ ?

Sharing is Caring...

Are they inspired? …………….

ధురంధర్ లో రణవీర్ పోషించిన పాత్రకు ప్రేరణ మోహిత్ శర్మ కథే అని సోషల్ మీడియాలో కథనాలు మళ్ళీ ప్రచారం లో కొచ్చాయి. అయితే ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ‘ధురంధర్’ (Dhuraఅయితే, సినిమాలోని కొన్ని సంఘటనలు, పాత్రల స్వభావం ఆయన జీవితానికి దగ్గరగా ఉండటంతో ఈ చర్చ మొదలైంది. 

‘ధురంధర్.. సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు, అది తమ కుమారుడి జీవిత చరిత్రలా ఉందని భావించిన మేజర్ మోహిత్ శర్మ తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా తమ కుమారుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమా ఒక కల్పిత స్పై థ్రిల్లర్ అని, ఇది మేజర్ మోహిత్ శర్మ జీవితంపై ఆధారపడి తీసింది కాదని  ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో ఆయన బయోపిక్ తీయాల్సి వస్తే కుటుంబ సభ్యుల అనుమతితోనే తీస్తామని అప్పట్లో ఆయన వివరణ ఇచ్చారు.

పోలికలు

మేజర్ మోహిత్ శర్మ 2004లో ‘ఇఫ్తికార్ భట్’ అనే పేరుతో అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఉగ్రవాదుల స్థావరాల్లోకి చొరబడ్డారు. సినిమాలో రణవీర్ సింగ్ పాత్ర కూడా గూఢచారిగా ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే క్రమంలో కనిపిస్తుంది. ఈ అండర్ కవర్ మిషన్ల మధ్య ఉన్న పోలికల వల్లే ప్రేక్షకులు ఇది ఆయన కథే అని భావిస్తున్నారు. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.  

మేజర్ మోహిత్ శర్మ భారత సైన్యంలో అత్యంత సాహసవంతుడైన అధికారిగా పేరుగాంచారు.ఆయన 1978, జనవరి 13న హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించారు.1999లో హైదరాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుండి ఉత్తీర్ణత సాధించి, ‘మద్రాస్ రెజిమెంట్’లో చేరారు. ఆ తర్వాత అత్యంత కఠినమైన 1 పారా (స్పెషల్ ఫోర్సెస్) విభాగానికి ఎంపికయ్యారు.

2004లో కాశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాలను కనిపెట్టడానికి తన పేరును ‘ఇఫ్తికార్ భట్’ గా మార్చుకుని, గడ్డం పెంచి ఉగ్రవాదుల గుంపులో కలిసిపోయారు. వారి నమ్మకాన్ని గెలుచుకుని, సరైన సమయం చూసి ఇద్దరు కీలక ఉగ్రవాదులను హతమార్చి సురక్షితంగా తిరిగి వచ్చారు.

2009, మార్చి 21న కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హఫ్తృదా అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన వీరోచితంగా పోరాడారు. తీవ్రంగా గాయపడినప్పటికీ, తన సహచరులను రక్షిస్తూ నలుగురు ఉగ్రవాదులను చంపారు. ఆ పోరాటంలోనే ఆయన వీరమరణం పొందారు.

ఆయన ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలకు గాను భారత ప్రభుత్వం మరణానంతరం అత్యున్నత శాంతి సమయ శౌర్య పురస్కారమైన **’అశోక చక్ర’**తో గౌరవించింది. అంతకుముందే ఆయనకు ‘సేన మెడల్’ కూడా లభించింది.

ఆయనను సైన్యంలో తోటి అధికారులు “మైక్” అని పిలిచేవారు. గిటార్ వాయించడంలో మౌత్ ఆర్గాన్ వాయించడంలో ఆయనకు మంచి ప్రవేశం ఉండేది.మార్చి 21 మేజర్ మోహిత్ శర్మ వర్ధంతి కావడంతో సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెట్టారు.

‘ధురంధర్’  సినిమా ఈయన జీవితం ఆధారంగా తీశారని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయమై మళ్ళీ చర్చ మొదలైంది.ఒక వేళ నిజంగా ప్రేరణ పొందినా విషయం చెబితే పారితోషకం తదితర వ్యవహారాలు వస్తాయని యూనిట్ కాదని చెప్పి ఉండొచ్చు. గతంలో ఇలాంటి వి చాలానే జరిగాయి.       

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!