ఆ ఏనుగుల డెత్ మిస్టరీ ఏమిటో ?

Sharing is Caring...

Death mystery of elephants ………………………………..ఒకేసారి 18 ఏనుగులు చనిపోయిన ఘటన అస్సాం లో కలకలం సృష్టించింది. వారం క్రితం కుండోలి రిజర్వ్ అటవీ ప్రాంతం వైపు వెళ్లిన స్థానికులకు ఒక చోట 14 ఏనుగులు .. అక్కడికి దగ్గరలో మరోచోట 4 ఏనుగుల మృత కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు ఫారెస్ట్ రేంజర్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చూసి పై అధికారులకు తెలియ జేశారు. వీటిని ఎవరైనా చంపారా ? ఏదైనా ప్రమాదం జరిగిందా ? మరెవరైనా విషప్రయోగం చేశారా ? అన్న సందేహాలు అధికారులకు కలిగాయి. విషయం ఏమిటన్నది తేల్చడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ డెత్ మిస్టరీ గురించి దర్యాప్తు చేస్తున్నది. అధికారులు వచ్చి చూసిన దరిమిలా ఏనుగుల కళేబరాలను జంతు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం కమిటీ దర్యాప్తు చేస్తున్నది. మరి కొద్దీ రోజుల్లో కారణాలేమిటో కమిటీ ప్రకటించే అవకాశాలున్నాయి.

అదలావుంటే  ప్రాధమికంగా అక్కడ కనిపించిన ఆధారాలను బట్టి ఆ ఏనుగులు పిడుగుపాటు కారణంగా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అడవిలో కొన్ని చోట్ల చెట్లు కాలిపోయి ఉన్నాయట. కొందరు వైద్య నిపుణులు పిడుగుపాటు మూలంగా ఏనుగులు చనిపోవడానికి అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు.సాధారణంగా ఏనుగులు,జిరాఫీలు వంటి ఎత్తైన జంతువులు ఖాళీ ప్రదేశాల్లో ఉన్నపుడు వాటిపై పిడుగు పడే అవకాశం ఉందట. ఇలా పడటాన్ని డైరెక్ట్ ఫ్లాష్ అంటారట. అలాగే జంతువులకు సమీపంలో పొడవైన చెట్లు ఉంటే వాటిపై కూడా పిడుగు పడవచ్చు అంటున్నారు. అలా చెట్లపై పడిన ప్రభావం తో సమీపంలో ఉన్న జంతువులూ చనిపోవచ్చు. పిడుగు పడిన ప్రాంతంలో విద్యుత్ ప్రసారం జరిగి .. ఆ విద్యుత్ తాకిడికి కూడా జంతువులు చనిపోతాయని చెబుతున్నారు. ఇలా జరగడాన్ని స్టెప్ పొటెన్షియల్ అంటారట.ఇలా మనుష్యులు కూడా చనిపోయిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పోస్ట్ మార్టం చేసిన నిపుణులు కూడా పిడుగుపాటు వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారట.

అయితే ఇవేవి నమ్మదగినవి కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకేసారి 18 ఏనుగుల మృతికి పిడుగుపాటు  కారణం ఎలా అవుతుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. విష ప్రయోగం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగా 2016 లో నార్వేలో జింకల మరణాలు కూడా ఇదే తరహాలో జరిగాయి. 2007 లో పశ్చిమ బెంగాల్లోని బక్సా టైగర్ రిజర్వు లో 5 ఏనుగులు పిడుగుపాటుతో మరణించాయి. దేశంలో మొత్తం 30 వేల ఏనుగులు ఉండగా … అస్సాం అడవుల్లో  సుమారు ఆరువేల ఏనుగులు ఉన్నాయని అంచనా.   
  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!