యాంటీబాడీ టెస్ట్ కోసం DRDO కొత్త కిట్ ..రూ.75 మాత్రమే!

Sharing is Caring...

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) తాజాగా కోవిడ్ యాంటీబాడీ డిటెక్షన్ కిట్ అభివృద్ధి చేసింది. ఇటీవలే 2-డీజీ పేరిట కరోనా ఔషధాన్ని తయారుచేసిన సంస్థ మరో ముందడుగు వేసి డిప్కొవన్ పేరిట టెస్టింగ్ కిట్ ను రూపొందించింది. బయట టెస్టులు పేరిట ప్రయివేట్ వ్యక్తులు దోచుకుంటున్న నేపథ్యంలో ఈ కిట్ ను DRDO తీసుకురావడం హర్షణీయం. కిట్ వెల 75 రూపాయలు మాత్రమే. సులభంగా ఇంటి దగ్గరే టెస్టు చేసుకోవచ్చు. టెస్ట్ ద్వారా శరీరంలోని యాంటీబాడీ లను సులభంగా గుర్తించవచ్చు. డిప్కోవన్ కిట్ 97 శాతం సున్నితత్వంతో కరోనా వైరస్ నిర్ధారణ  న్యూక్రియోకాప్సిడ్ ప్రొటీనులను గుర్తిస్తుందని DRDO చెబుతున్నది.

ఈ కిట్ కు 18 నెలల నిర్ణీత గడువు కూడా ఉంటుంది. ఢిల్లీ లోని ప్రధాన ఆసుపత్రుల్లో దీనిపై పరిశోధనలు నిర్వహించారు. DRDOకి చెందిన డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజి అండ్ అల్లైడ్ సైన్స్ స్(డిపాస్ )ఢిల్లీ కి చెందిన వాన్ గార్డ్ డయాగ్నిస్టిక్స్ ఈ డిప్కోవన్  కిట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాయి. 

ఈ డిప్కోవన్  పరీక్షల ద్వారా ఫలితాలు 75 నిమిషాల్లో తెలుస్తాయని DRDO అంటోంది. ఈ కిట్ కు ఏప్రిల్ లోనే ఐసీఎంఆర్ ఆమోదం లభించింది. ఈ నెలలోనే డీసీజీఐ ఇతర సంస్థల … కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం వాణిజ్య ఉత్పత్తి జరుగుతోంది. జూన్ లో మార్కెట్లోకి ప్రవేశపెడతారు. నెలకు సుమారు 500 కిట్లను తయారు చేస్తున్నారు. భవిష్యత్ లో వీటి సంఖ్య పెంచవచ్చు.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!