తక్కువ ఖర్చుతో నేపాల్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా ?

Sharing is Caring...

Attractive package………………………

IRCTC  రాయల్ నేపాల్ టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో నేపాల్ ను చూసి వచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు.  పర్యాటక కేంద్రం గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా  మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు.

ఈ IRCTC  ప్యాకేజీ టూర్  6 రోజులు, 5 రాత్రులు సాగుతుంది. ఈ ప్యాకేజీ’ ఆగస్టు 23 న ప్రారంభమవుతుంది.హైదరాబాద్ నుండి బయలు దేరి ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు విమానంలో చేరతారు. అక్కడ టూర్ ఆపరేటర్  పికప్ చేసుకొని రోడ్డు మార్గంలో నేపాల్‌‌ లోని లుంబినీకి తీసుకువెళతారు. సమయాన్నిబట్టి లుంబినీలో ఉన్న మాయాదేవి ఆలయం, ఇతర దేవాలయాలను చూపిస్తారు. ఆ రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

మరుసటి రోజు ఉదయం లుంబినీ నుండి బయలుదేరి పోఖరాకు చేరతారు.అక్కడ ప్రపంచ శాంతి ప్రదేశం పగోడా, ఫెవా సరస్సును  చూపుతారు. రాత్రికి పోఖరలోనే బస చేస్తారు. మూడో రోజు ఉదయం అద్భుతమైన సూర్యోదయాన్ని చూసేందుకు  సారంగ్‌కోట్ వ్యూ పాయింట్‌కు తీసుకువెళతారు.  తర్వాత  బింధ్యాబాసిని మందిర్, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలను చూపిస్తారు.ఆ రాత్రికి పోఖరలోనే బస చేస్తారు. నాలుగో రోజు ఖాట్మండుకు బయలు దేరుతారు.

వెళ్లేదారిలో మనకామ్నా ఆలయం చూపిస్తారు. రాత్రికి  ఖాట్మండుకు చేరుకుంటారు. ఐదో రోజు ఉదయం పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలెస్, స్వయంభునాథ్ టెంపుల్ ను సందర్శిస్తారు. ప్రతి చోటా గైడ్ దగ్గరే ఉండి ఆ ప్రదేశం ప్రాధాన్యతలను వివరిస్తారు. లాస్ట్ డే   బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఖాట్మండు విమానాశ్రయంలో వదులుతారు. అక్కడి నుండి దిల్లీ చేరుకొని, ఆపై హైదరాబాద్‌కు వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. ఈ ప్యాకేజీలో భాగంగా 3 స్టార్ హోటల్‌లో వసతి సదుపాయం  కల్పిస్తారు. ఛార్జీల వివరాలు: ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి మీరు ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే.. రూ. 55630 /-, ఇద్దరు వ్యక్తులకు రూ. 46550  ముగ్గురికి రూ 45250 / చెల్లించాలి. ఇతర వివరాలకు  IRCTC   వెబ్సైటు ను చూడండి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!