ఈ నాయక్ మామూలోడు కాదు !

Sharing is Caring...

Daring Officer……………………. ………

ముంబాయిలో దయానాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరు వింటే చాలు నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అన్ని పోలీసు స్టేషన్లలో పనిచేయక పోయినా ఈ నాయక్ గురించి అందరికి తెలుసు. తన సర్వీసులో నాయక్ దాదాపు 83 మంది గ్యాంగస్టర్ బ్యాచ్ ను ఎన్కౌంటర్ చేసాడు. ఇతగాడు స్కెచ్ వేసాడంటే ఇక దానికి తిరుగుండదు. మాఫియా డాన్లకు కూడా నిద్ర లేకుండా చేసిన ఖ్యాతి నాయక్ ది.

1995 లో మహారాష్ట్ర పోలీస్ శాఖలో ట్రైనీ పోలీస్ గా శిక్షణలో చేరాడు. 96లో జుహు పోలీస్ స్టేషన్ కి పంపారు. ఇక అక్కడ నుంచి నాయక్ దూకుడు మొదలైంది. చోటారాజన్ గ్యాంగ్ సభ్యులను ఇద్దరిని లేపేసాడు. దాంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు.

నాయక్ ను  ఎన్కౌంటర్ స్క్వాడ్ కి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తూ తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. 2004 వరకు 83 మంది నేరస్థులను ఎన్కౌంటర్ చేశారు. మధ్యలో రెండు మూడు సార్లు గ్యాంగస్టర్ బ్యాచ్ నాయక్ పై అటాక్ కూడా చేసింది.

నాయక్ ఎక్కడా కుదురుగా ఉన్న దాఖలాలు లేవు.ఎక్కడా ఏడాదన్నర కంటే ఎక్కువ కాలం విధులు నిర్వహించలేదు.ఒకసారి ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ఇరుక్కున్నాడు. గుజరాత్ పోలీసులకు నేరచరిత ఉన్న ఒక ముస్లిం యువకుడిని నాయక్ అప్పగించాడని ఆరోపణ.

ఇది కోర్టు విచారణలో నిలబడలేదు. కేసును కోర్టు కొట్టేసింది. విచారణ పూర్తయ్యాక మళ్లీ విధుల్లో చేరాడు. నాయక్ పై అవినీతి ఆరోపణలు కూడా వచ్చేయి. ఆదాయం కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయనే ఆరోపణలు రాగా ఏసీబీ విచారణ ను ఎదుర్కొన్నాడు. 

మనీ లాండరింగ్ వ్యవహారాల్లో నాయక్ ప్రమేయం ఉందని ప్రధాన అభియోగం. ఒక ఐపీఎస్ అధికారి ఒత్తిడి మేరకు నాయక్ ను ఏసీబీ అరెస్ట్ చేయగా రెండు నెలలు జైలులో ఉన్నాడు. నాయక్‌కు స్విట్జర్లాండ్‌లో ఆస్తులు ఉన్నాయని, దుబాయ్‌లో హోటళ్లు ఉన్నాయని ఏసీబీ ఆరోపించింది. వీటిని నాయక్ ఖండించాడు. ఆ ఆరోపణలేవీ నిరూపణ కాలేదు.

ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ గా నాయక్ ప్రమోట్ అయ్యాడు. అప్పటినుంచి  లో ప్రొఫైల్ తో జాగ్రత్తగా ఉద్యోగం చేసాడు. ఆ సమయం లో నాగపూర్ బదిలీ చేశారు. అక్కడికి వెళ్లనని నాయక్ అడ్డం తిరిగాడు. డిపార్ట్మెంట్ బదిలీని రద్దు చేసింది. తర్వాత  కొన్నాళ్ళ పాటు సస్పెండ్ చేసింది. మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంది. తర్వాత బదిలీ చేసింది.

ఇలా రకరకాల ఇబ్బందులు నాయక్ ఎదుర్కొన్నాడు. మొన్నటి మేలో ఈయనను గోండియాకు బదిలీ చేశారు. ఉద్యోగం గొడవలు విషయం వదిలేస్తే నాయక్ కర్ణాటక కు చెందినవాడు. చిన్నతనంలో ముంబైకి వచ్చి ఒక హోటల్లో పని చేసాడు. ఆ హోటల్ బయట అరుగులపై  పడుకుని నిద్రపోయేవాడు.  వీధి లైటు కింద కూర్చోని చదువుకునేవాడు.

నానా కష్టాలు పడి అంధేరీలోని కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒక సందర్భంలో మాదకద్రవ్యాల విభాగానికి చెందిన కొంతమంది అధికారులను కలిశాడు. అపుడే అతనిలో పోలీస్ డిపార్టుమెంటు లో చేరాలన్న స్ఫూర్తి కలిగింది. అలా పోలీసుశాఖలో చేరాడు.

తన బాల్యాన్ని గుర్తుపెట్టుకుని తనలాగా చదువుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడకూడదని స్వగ్రామం ఎన్నేహోల్ లో తన తల్లి పేరుమీద  ఒక పాఠశాలను ప్రారంభించాడు. కోటి రూపాయల వ్యయంతో పెద్దఎత్తున నిర్మించాడు.

ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి స్టార్ హీరో అమితాబ్, నటుడు సునీల్ శెట్టి , కర్ణాటక నేత వీరప్పమొయిలీ వచ్చారు. ఈ పాఠశాలను ప్రభుత్వానికి అప్పగించాడు. ఎన్నేహోల్ ప్రజలు నాయక్ ను ఇప్పటికి హీరో లాగా అభిమానిస్తారు. ఇక నాయక్ జీవిత ఘటనల ఆధారంగా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. 

——–KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!