అహం తోనే ఆర్టీసీ సేవలకు బ్రేక్ ?

Sharing is Caring...

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులు ఆగిపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుంటున్నారు.  దాదాపు మూడు నెలలుగా ఆర్టీసీ బస్ సర్వీసుల విషయంలో ఇరు ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ పురోగతి శూన్యం. 

అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే తెలంగాణా ప్రభుత్వం బస్సులను షేర్ చేసుకుందాం అంటుంది. అంటే మార్కాపురం డిపో నుంచి నాలుగు బస్సులు హైదరాబాద్ కి వస్తే రెండు నీవి, రెండు నావి అనేట్టు ఉండాలి అంటాడు. అదెలా కుదురుతుంది? డిపో మొత్తం నాచేతిలో ఉంటే ఇక్కడ నుంచి ఎంత మంది ప్రయాణీకులు ఉన్నారో అంత మందికి ఎన్ని బస్సులు అవసరమో అన్ని వేయగలుగుతా. తెలంగాణా నుంచి బస్సులు ఎప్పుడు వస్తాయో తెలీదు, వాళ్ళ డ్రైవర్లు నా డ్రైవర్ల మాదిరి చెప్పింది వింటారో లేదో తెలీదు. వినకపోతే, వాళ్ళు సమయానికి రాకపోతే నా డిపో నుంచి ప్రయాణీకులకు ఏ సమాధానం చెప్పాలి? అలాగే కొన్ని రూట్లలో ఏపీ బస్సులు తగ్గించుకోవాలంటోంది.

కానీ ఆంధ్రా ప్రభుత్వం ఏమంటుందంటే నేను ఎన్ని కిలోమీటర్లు తిప్పుతానో అన్ని కిలోమీటర్లు నువ్వు కూడా తిప్పుకో. నేను లక్ష కిలోమీటర్లు తిప్పితే నువ్వు కూడా ఆంధ్రాలో లక్ష తిప్పుకో, నాకు అభ్యంతరం లేదు అంటాడు. కాకపోతే తెలంగాణ ఆర్టీసీ సమస్య ఏమంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఒక బస్సు పెడితే గరిష్ట టికెట్లు విజయవాడ దాకానో, మహా అయితే రాజమండ్రి దాకానో బుక్ అవుతాయి. వైజాగ్ దాకా ప్రయాణించే వారు ఇద్దరో ముగ్గురో ఉంటారు. వాళ్ళ కోసం వైజాగ్ దాకా అన్ని కిలోమీటర్లు బస్ నడపాలి.  అర్ధ రాత్రి మధ్యలో ఎక్కేవాళ్ళు ఒకళ్ళో, ఇద్దరో ఉంటారు. హైదరాబాద్ నుంచి టికెట్లు బుక్ చేసుకునే  ప్రతిఒక్కరు  వైజాగ్ దాకా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి అని ఉండదు. అలా సాఫ్ట్వేర్ update చేస్తే మంచిదే.

అప్ప్పుడు కొన్నింటిని వైజాగ్ బస్సులు అని designate చేసి వాటిని వైజాగ్ వరకు non stop గా నడపొచ్చు .కానీ ప్రతీ రోజూ వైజాగ్ కి బస్సు నిండేంత మంది ఉంటారా? ఉండరు కాబట్టి అలా కుదరదు. ఆంధ్రా ప్రభుత్వం తిప్పినన్ని కిలోమీటర్లు తెలంగాణా ప్రభుత్వం తిప్పలేదు. దాన్ని అంగీకరించి స్వీకరించాలి. ప్రత్యామ్నాయాలు ఉంటే ఆలోచించుకోవాలి. అంతే గానీ అసలు నడవద్దు అంటే ఎలాఇప్పటికీ ఎవరన్నా ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకుందామంటే అలవాటు ప్రకారం apsrtc online booking అనే కొడతాడు గూగుల్ లో. లేకపోతే అప్పటికే download చేసుకున్న apsrtc app వాడతాడు.

tsrtc ఉన్నా కూడా అది వాడడు. Apsrtc లో టికెట్లు లేకపోతే అప్పుడు tsrtc కి వెళతాడు. ఇక్కడ చిన్న లాజిక్. హైదరాబాద్ కి ఆంధ్రా నుంచి వచ్చేవాళ్లే ఎక్కువ. సాధారణంగానే వాళ్ళ ఆదాయం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ విషయంలో రాద్దాంతం అవసరం లేదు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రముఖ నగరాలకు బస్సులు తిప్పచ్చు. అదీ ఐరావత్, పుష్పక్ లాంటి బస్సుల మాదిరి క్వాలిటీ పెంచి. అక్కడ ఆంధ్రా వాళ్ళు పోటీకి రావడం లేదు కదా.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్న విషయంలో జగన్ పై కోపం  ఉంటే ఉండోచ్చు .. కానీ దానికి సేవలకు ముడిపెట్టడం బాగాలేదని కార్మికవర్గాలు అనుకుంటున్నాయి .. ఆంధ్రా ఆర్టీసీకి ఆదాయం ఎక్కువ కాబట్టి వాళ్ళు చేయగలిగారు, ఇక్కడ ఆదాయం లేదు … నిజమే అలాంటప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలు చూడాలి. ఆమాటకొస్తే అసలు  ప్రజారవాణా వ్యవస్థను నడిపేటప్పుడు ఆదాయం  గురించి ఆలోచనే చేయకూడదు.

మొత్తం మీద ఈ పేచీ వల్ల నష్టపోతుంది ఎవరు? ఆంధ్రాలో బస్సులు నడిచినా, నడవకపోయినా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి ప్రతీ నెలా జీతాలు అందుతాయి. డ్రైవర్లను కలెక్టర్లకో, ఇంకో ఆఫీసర్లకో డ్రైవర్లుగా పంపించవచ్చు. కండక్టర్లను clerical work కి ఉపయోగించవచ్చు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నా వారి జీతాలు వారికి వస్తాయి. తెలంగాణాలో అలా కాదు కదా. నో వర్క్, నో పే అంటే వాళ్ళు ఎలా బతకాలి?

ఆదాయ మార్గాలు పెంచుకునే ఆలోచనలు చేయాలి గానీ ఇలా అంతర్రాష్ట్ర బస్సులు నడవకుండా స్థంభించి పోతే  లక్షల లీటర్ల డీజిల్ వినియోగం లేక కోట్ల రూపాయల ఆదాయం పోతుంది. వీటికంటే ఉద్యోగుల, వారి కుటుంబాల జీవితాలు ముఖ్యం. దానికోసం ఆలోచించాలి. ఆంధ్రాలో అన్ని ఊర్లకు ఒక్క లోపం కూడా లేని బస్సులు వేయండి. మేము వాటినే ఎక్కుతాం. మాకేమీ ఆంధ్రా బస్సులే ఎక్కాలని లేదు. ఏది  బాగుంటే అది ఎక్కుతాం. ఈ ప్రతిష్ఠంభన వల్ల ప్రైవేట్ బస్సుల ఓనర్లు బాగుపడుతున్నారు.

——————-   Ravikanth Reddy M  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!