ఎవరీ కన్నాభిరాన్ ?

Sharing is Caring...

సుమ పమిడిఘంటం…………………………………….. 

Lawyer who worked for the poor………………..

కె.జి.కన్నాభిరాన్ గురించి ఈతరం పాఠకులకు అంతగా తెలియదు. చాలామంది పాత తరం వారు కూడా ఆయన ఎక్కువగా నక్సలైట్ల కేసులు వాదించే వారు కాబట్టి ఆయన కూడా నక్సలైట్ అనుకునే వారు. ఇక అసలు విషయంలో కెళితే ఆయన గొప్ప న్యాయవాది… అంతకంటే గొప్ప మానవతా వాది.

ఆయన పేరు ఉచ్ఛరించడం లో, రాయడం లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవారు. పెద్ద పత్రికలు కూడా కన్న బీరన్ అని రాసిన సందర్భాలున్నాయి. సరే పేరు ఎలా రాసినా ఆయన గురించి పత్రికలు గొప్పగానే చెప్పాయి. 

కన్నాభిరాన్ తమిళ అయ్యంగార్. ఆయన పూర్వీకులు, బంధువులు నెల్లూరులో ఉండేవారు. ఆయన తండ్రి డా. కె. జి. అయ్యంగార్ కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్ (ప్రస్తుత గాంధీహాస్పిటల్ )హైదరాబాద్ లో నేత్ర వైద్యులుగా చేశారు. వీరు బ్రాహ్మణులని పచ్చియప్పాస్ కాలేజీలో BA సీటు ఇవ్వలేదు. అప్పుడు మద్రాస్ లో రామస్వామి నాయకర్ నేతృత్వంలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడుస్తున్నది.

ఇంటర్ నుంచి యం.ఏ, తర్వాత లా మద్రాసులోనే చదివారు. ఆ తరువాత పి.వి. రాజమన్నారు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. మద్రాసు హైకోర్టు బ్రిటిష్ చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ఏర్పడిన హైకోర్టులలోఒకటి. అనంతరం హైదరాబాద్  కొచ్చి వకీలు గా స్థిరపడ్డారు. కన్నబిరాన్ డిక్టేట్ చేసిన ఆత్మకథ నుంచీ వారి గురించి తెలుసుకుందాం. కన్నాభిరాన్  రెండు సార్లు  IAS పరీక్ష పాసయినప్పటికీ ..ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యారు.

ఒక న్యాయవాది తను చేపడుతున్న కేసులో  న్యాయాన్యాయాల గురించి ఆలోచించకూడదు. కేసును కక్షిదారుడి కోణంలోనే చూడాలనే వారు. న్యాయవాదికి పేరు ప్రఖ్యాతులు పెరిగేకొద్దీ సొంత ప్రపంచం కుదించుకుని కక్షిదారుల ప్రపంచం పెరిగి పోతుందనేది ఆయన అభిప్రాయం.కన్నాభిరాన్  చాలాకాలం పౌరహక్కుల సంఘం అధ్యక్షుడుగా చేశారు.

ఈయన వాదించిన కేసులు ఎక్కువగా నక్సలైట్ల వే కావటంతో  ఆయనను కూడ నక్సలైట్ గా జమేశారు కానీ తను నక్సలైట్ కాదని … నక్సలైట్ మార్గం సరికాదనీ అనేకమార్లు చెప్పారు. ఆయన డబ్బు ప్రధానంగా ఏకేసునూ వాదించలేదు. కన్నాభిరాన్ మరణశిక్షలకు ప్రధానంగా వ్యతిరేకి. నూరు శాతం ప్రజాస్వామ్య వాది.

‘రిట్జ్’ హోటల్ లాంటి వ్యాపారసంస్థలకు ఆయన న్యాయ సలహాదారుగా పనిచేశారు. పెద్ద వ్యాపార సంస్థల వద్ద కూడా ఫీజు న్యాయంగానే పుచ్చుకునేవారు. వీరి సర్వీస్ లో అంత ఫీజియ్యి అని అడగటం ఎవ్వరెరుగరు. కన్నాభిరాన్ కు  జయప్రకాష్ నారాయణ, మొరార్జీ, అరుణ్ శౌరి, తార్కుండే ఫెర్నాండెజ్ ఇలా ఎంతోమంది గొప్పవారితో పరిచయం వుంది.

తరిమెల నాగిరెడ్డి, సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య వీరింటికి తరచు వచ్చేవారు. పేదల లాయర్ గా పేరు పొందారు. న్యాయ సహాయం అవసరపడే వారికి… అతను వీరప్పనయినా వీధిలోతిరిగే వాడు అయినా వారి కేసు చేపట్టాలనే తత్వం ఆయనది.

హీరోషిమా, నాగసాకి బాంబుదాడు ల్లో  6,50,000 మంది చనిపోయారు. ఆ బాంబు వేసిన అతనికి తను చేస్తున్నది ఏమిటో తెలియదు. ఆ మహా విధ్వంసం తెలిశాక మతి చలించిగా  పిచ్చాస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత రామకృష్ణ మిషన్ లో చేరి ఆధ్యాత్మిక చింతన కెళ్ళాడు.

భారత నేర శిక్షాస్మృతి ప్రకారం ఒక వ్యక్తికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తే హైకోర్టులో ఇరువురు న్యాయమూర్తులు గల బెంచీ నిర్ధారిస్తే సరిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత దాస్తోవిస్కీ కి జార్ చక్రవర్తి మరణ దండన విధించాడు. మనసు మార్చుకుని జార్ శిక్ష రద్దు చేశారు. చంపబడటానికి సిద్ధపడ్డ వ్యక్తి కి క్షమాభిక్ష దొరికి జీవితం కొనసాగితే ఎలావుంటుందీ అని కథాంశంతో దాస్తోవిస్కీ ‘ఇడియట్’ అనే అద్భుతమైన నవల రాశారు.

ఈశాన్య రాష్ట్రాల్లో, గుజరాత్, కాశ్మీర్, LTTE, వీరప్పన్, బాంబు పేలుళ్లు న్యాయం కాదనుకున్నా హింసను చాలా గట్టిగా ఎదిరిస్తాడు అని  చెబుతుంది ఆయన భార్య వసంత కన్నబిరాన్. సామాన్య లక్షణాలు పోగొట్టుకోకుండా అసామాన్యమైన జీవితాన్నిగడిపిన అదృష్టవంతుడు అంటారు ఆయన భార్య. జీవితాన్ని ప్రేమించేవాడిని ‌మృత్యువు ద్వేషిస్తుంది.

కన్నాభిరాన్ వాదించిన కేసుల్లో ఎన్నోఎన్‌కౌంటర్ కేసులున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం, తరిమెల్ల నాగిరెడ్డి, సికింద్రాబాదు, రామ నగర్ కేసులు ప్రధానమైనవి. 2010 లో కన్నాభిరాన్ కన్నుమూసారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!