కాలం కలసిరాని ముద్దుగుమ్మ !

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే ముద్దు గుమ్మ పేరు షెర్లిన్ చోప్రా. కొన్ని తెలుగు, తమిళం హిందీ చిత్రాలలో నటించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరోయిన్ గా రాణించ లేకపోయింది.పెద్దగా అవకాశాలు రాలేదు. చివరికి ప్రఖ్యాత ప్లేబోయ్ పత్రిక కవర్ పేజీపై నగ్నంగా దర్శనమిచ్చినప్పటికీ ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదు.

నిరంతరం బికినీ షూట్లతో కుర్రకారు మతి చెడేలా మ్యాగజైన్ కవర్ ఫోటోల కోసం ఫోజులు ఇచ్చినా తలరాత మారలేదు. ఆఫర్లు రాలేదు. షెర్లిన్ కి స్టార్ డమ్ అన్నది అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పటికీ షెర్లిన్ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అసలు ఎవరీ షెర్లిన్ చోప్రా అని వివరాలు సేకరిస్తే హైదరాబాదీ అని తేలింది.

తన అసలు పేరు మోనా చోప్రా.. సినీరంగంలో కొచ్చాక పేరు మార్చుకుంది. తండ్రి క్రిస్టియన్..తల్లి ముస్లిం. హైదరాబాద్ లోనే పెరిగింది. 1999లో ‘మిస్ ఆంధ్రా’ పోటీల్లో పాల్గొని టైటిల్ ని గెలుచుకుంది. తర్వాత ఫోటో షూట్‌లు, ర్యాంప్ వాక్‌ ల్లో పాల్గొనేది. మోడలింగ్ రంగంలో సంచలనం సృష్టించింది.

2002లో `వెండితెర` అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తమిళంలో `యూనివర్శిటీ` అనే చిత్రంలో నటించింది.2005 లో మిస్టరీ థ్రిల్లర్ ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ తో కొంత గుర్తింపు లభించింది.తర్వాత బాలీవుడ్‌లో కొన్నిచిత్రాల్లో నటించింది. 2013ల శృంగార-నాటకం ‘కామసూత్ర 3D’లో కామ దేవిగా ప్రధాన పాత్ర పోషించడానికి ఎంపికైంది.

అయితే మధ్యలోనే దర్శకుడు రూపేష్ పాల్తో గొడవలు జరిగాయి.. దాంతో ఆ సినిమా పూర్తి కాలేదు. ఆగష్టు 2016 లో ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. షెర్లిన్ చివరిసారిగా 2018లో ‘చమేలీ’ చిత్రంలో కనిపించింది.మొత్తం మీద 20 సినిమాల్లో చేసింది.

సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరించిన పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 లో షెర్లిన్ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. నటన కంటే ఎక్కువ గా ఎక్స్పోజింగ్ ను నమ్ముకున్నషెర్లిన్ బాలీవుడ్ లో తన ఉనికిని కాపాడుకునేందుకు ఎన్నోప్రయత్నాలు చేసింది. కానీ కాలం కలిసిరాలేదు.అనుకున్నది సాధించలేకపోయింది.

ప్రస్తుతం తన వయసు 38 ఏళ్ళు.అన్నట్టు ఆమధ్య శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పోర్నోగ్రఫీ కేసుకి సంబంధించి ముంబై పోలీసులు పిలిచి విచారించారు. ఎవరో అన్నట్టు సినిమాలో స్టార్ డమ్ అందుకోవడం అంత సులభంకాదు.దేనికైనా రాసి పెట్టి ఉండాలి.షెర్లిన్ చోప్రాకు అది రాసి ఉన్నదో ?లేదో? . సినిమా రంగంలో ఇలాంటి తారలు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!