ఈ కింద పేర్కొన్న కంపెనీలు కరోనా కాలంలో మంచి పనితీరును ప్రదర్శించాయి. ఈ షేర్లలో గతంలో మదుపు చేసిన వారు లాభాల స్వీకరించడానికి ఇది సరైన సమయం… ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
పూనవాలా ఫిన్‌కార్ప్. రూ. 197
ఈ కంపెనీ షేర్ ధర ఈ సంవత్సర కాలంలో 375 శాతం మేరకు పెరిగింది. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు అదర్ పూనావాలా… నష్టాల్లో ఉన్న మాగ్మా ఫిన్ కార్ప్ సంస్థను చేజిక్కించుకున్నారు. ఆపరేషన్స్‌ను స్ట్రీమ్‌లైన్ చేసి కంపెనీని మళ్ళీ గాడిలో పెట్టారు. ఈ క్రమంలో… కంపెనీ లాభాలు వృద్ధి చెందాయి. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 14,177 కోట్లకు పెరిగింది.
సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం రూ.393. 43 వద్ద నిలిచింది. సెప్టెంబర్ 2020 తో పోలిస్తే ఆదాయం 488.50 కోట్ల నుంచి 19.46 శాతం తగ్గింది.అయితే అదే సమయంలో నికర లాభం 19. 71 కోట్ల నుంచి 275. 68 శాతం వృద్ధితో 74. 03 కోట్లకు పెరిగింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ.197 కాగా కనిష్ట ధర రూ. 39 మాత్రమే.
డిసెంబర్లో షేర్ ధర 218 వరకు వెళ్ళింది. మార్కెట్ ఒడిదుడుకుల్లో ధర ప్రస్తుతం కొంత తగ్గింది. అతి తక్కువ ధరల్లో ఈ షేర్లు కొన్న వారు అమ్మేసుకుని లాభాలు స్వీకరించవచ్చు. కనీసం పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు. ఈ దశలో ఇన్వెస్ట్మెంట్ కొంత రిస్క్ తో కూడిన వ్యవహారం.మార్కెట్ పెరుగుతున్నప్పుడు లాభాలు స్వీకరిస్తే మంచిది. ధర తగ్గినపుడు అప్పటి పరిస్థితులను బట్టి కొనుగోలు చేయండి.
సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్.. రూ.178
ఈ ఏడాదిలో కంపెనీ పని తీరు బాగా మెరుగు పడింది. కంపెనీ షేర్ ధర 313 శాతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 21,014 కోట్లుగా ఉంది. కంపెనీ మార్చి 2021 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 2525 కోట్ల అమ్మకాలపై రూ. 208 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
నష్టాల్లో ఉన్న ఈ కంపెనీని నవంబర్ 2020 లో తమిళనాడుకు చెందిన మురుగప్ప గ్రూప్ టేకోవర్ చేసింది. కొత్తగా డైరెక్టర్లను కూడా నియమించింది. అవసరమైన పెట్టుబడులు సమకూర్చి పనితీరును మెరుగు పర్చింది. సెప్టెంబర్ 21 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు రూ. 1351 కాగా 93 కోట్ల లాభాలను ఆర్జించింది.
నష్టాల్లో ఉన్న కంపెనీ ప్రస్తుతం లాభాల బాటలో పడింది. ఈ కంపెనీ ని తొలుత Crompton Greavs ప్రమోట్ చేసింది. కంపెనీ విద్యుత్ ఉత్పత్తి ..పంపిణీ … అందుకు అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలను ఉత్పత్తి చేస్తోంది.ప్రస్తుతం కంపెనీ షేర్లు రూ.178 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
52 వారాల గరిష్ట ధర రూ. 191 కాగా .. కనిష్ట ధర రూ. 38 మాత్రమే. అతి తక్కువ ధరల్లో ఈ షేర్లను కొన్నవారు ప్రస్తుత ధర వద్ద లాభాలు స్వీకరించవచ్చు. పాక్షిక లాభాలనైనా స్వీకరించడం మంచి వ్యూహం. ప్రస్తుత దశలో కొత్తగా ఇన్వెస్ట్ చేయడం కంటే ధర తగ్గినపుడు కొనుగోలు చేయడం మంచిది. మార్కెట్ ట్రెండ్ ను బట్టి కొనుగోళ్లు చేయవచ్చు. కొంత రిస్క్ ఉంటుంది.