ఇరుక్కున్నాడా ? ఇరికించారా ?

Sharing is Caring...

Aggression and troubles ……………………………..

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ను  అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును కోరారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి లేదా సీబీఐకి బదిలీ చేయాలని సమీర్ వాంఖడే కోర్టును అభ్యర్ధించారు.

ఈ అంశంపై కోర్టు విచారణ జరిపి వాఖండే పిటీషను కొట్టేసింది. ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్.. అతని  స్నేహితులు  పార్టీ లో ఉండగా డ్రగ్స్ సేవించారంటూ  సమీర్ వాంఖడే వారిని  అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దొరికిన వారికి బెయిల్ వచ్చే అవకాశం లేని విధంగా వీల్లేని కేసులు పెట్టారు. ఈ కేసులో నిందితులను చట్టానికి అప్పజెప్పి, నేర నిరూపణ చేయాల్సిన అధికారి వాంఖడే నేరారోపణలు ఎదుర్కొంటూ  చివరికి కోర్టును నాశ్రయించి  వార్తల్లో కెక్కారు.

సమీర్ వాంఖడే పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. దర్యాప్తులో విధానపరమైన అవకతవకలు, బలవంతపు వసూళ్లు కాకుండా వాంఖడే కొన్ని డాక్యుమెంట్స్  ఫోర్జరీ చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఆర్యన్‌ ను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని, ఇందులో రూ.8 కోట్లు సమీర్‌ వాంఖడే కి ఇవ్వాలని ప్రధాన ఆరోపణ.

దీనిపై స్పందించి మహారాష్ట్ర సర్కార్ నలుగురు ముంబై పోలీస్‌ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్‌ చేయకుండా.. రక్షణ కల్పించమని కోరుతూ సమీర్‌ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.ఇదిలా ఉంటే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడే కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలను బయటకు తీసుకువచ్చారు. 

సమీర్ ముస్లిం కానీ UPSCలో ఎస్సీ కోటా కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. వాంఖడే ఈ ఆరోపణను ఖండించారు.  తన తల్లి ముస్లిం అని, తన తండ్రి దళిత హిందువు అని జవాబు ఇచ్చారు. తాను ఎప్పుడూ ఇస్లాంలోకి మారలేదని పేర్కొన్నాడు. అయితే ఆరోపణలు అంతటితో ఆగలేదు. మంత్రి నవాబ్ మాలిక్‌ సమీర్ అతని సోదరిపై  మరికొన్ని ఆరోపణలు చేశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దాంతో సమీర్ సోదరి యాస్మిన్ మంత్రిపై ఫిర్యాదు చేస్తూ మహిళా కమిషన్ కు లేఖ రాసింది.  మరోపక్క ఆర్యన్ కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత సమీర్ దూకుడు తో వ్యవహరించి వార్తల్లో కెక్కడంతో ఎన్సీబీ వేటు వేసింది. వాంఖడే ఇకపై దర్యాప్తు అధికారిగా ఉండబోరని కూడా ప్రకటించింది.

నవాబ్ మాలిక్ రోజుకో  కొత్త ఆరోపణ చేస్తుండటం, వీటి వెనుక  ప్రభుత్వ పెద్దలు ఉండటంతో సమీర్ ఇబ్బందుల్లో పడ్డారు. బాలీవుడ్ ప్రముఖుల్ని టార్గెట్ చేయడంతో వారు సమీర్ పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం కూడా వారికి దన్నుగా నిలిచింది. మొత్తం మీద వాంఖడే వివాదాల్లో కూరుకుపోయాడు. ఇవాళో రేపో ఆర్యన్ ఎలాగోలా బయటపడతాడు .. కానీ సమీర్ వాఖండేనే చిక్కుల్లో పడ్డాడు.అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!