Srisailam Tour Package ………………..
తెలంగాణ టూరిజం సంస్థ ‘శ్రీశైలం’ క్షేత్ర సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీ ని తీసుకువచ్చింది. ప్రతి రోజు ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంటుంది. రెండురోజుల పాటు సాగే ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది.
Day 1… టూర్ ఉదయం 8:30 గంటలకు టూరిస్ట్ భవన్ నుంచి మొదలవుతుంది.నాన్ ఏసీ బస్ CRO బషీర్‌బాగ్ వద్ద కాసేపు ఆగుతుంది.అక్కడ ప్రయాణికులు ఎక్కగానే బయలుదేరుతుంది. దారిలో భోజనం కోసం ఆగుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. పర్యాటకులు దారిలోనే సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు. అక్కడనుంచి నేరుగా హోటల్‌కు వెళతారు. దైవదర్శనం అదే రోజు సాయంకాలం లేదా రెండవ రోజు ఉదయం ఏర్పాటు చేస్తారు.
Day 2... ఉదయం హోటల్లో అల్పాహారం తర్వాత పర్యాటకులు రోప్‌వే (పాతాళ-గంగ), పాలధార, పంచధార, శిఖరం, , శ్రీశైలం డ్యామ్ ను సందర్శిస్తారు. తర్వాత లంచ్ ముగించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.
నోట్…. శ్రీ శైలం హోటల్లో ప్రత్యేక దుప్పట్లు ఇవ్వరు. కాబట్టి ఎవరి దుప్పట్లు వారే తీసుకు వెళ్ళాలి. శ్రీశైలంలో వసతి సౌకర్యం, నాన్-ఏసీ బస్సు ఛార్జీలు మాత్రమే ప్యాకేజి లో కవర్ అవుతాయి. భోజనం,ఆలయ దర్శన టిక్కెట్లు,ఇతర చోట్ల టిక్కెట్ల ఖర్చులను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.
ప్యాకేజి వివరాలు
Non AC Bus Package details
Non Ac Accommodation
Adult Rs.2000, Child Rs.1600 గా నిర్ణయించారు.
AC Bus Package details
Non Ac Accommodation
Adult Rs.2990, Child Rs. 2392గా నిర్ణయించారు.
తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.ఇతర వివరాలకు Toll Free: 180042546464 | Timings : 8:00 AM – 8:00 PM మధ్య సంప్రదించవచ్చు ..