డాక్యుమెంటరీగా ‘షీనా బోరా’ హత్యకేసు!

Sharing is Caring...

Story of murder mystery ……………………..

తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  షీనా బోరా హత్య కేసును  డాక్యుమెంటరీ గా రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ  నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ డాక్యుమెంటరీ  ఫిబ్రవరి 24 నుంచి  స్ట్రీమింగ్ కానుంది.  ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ప్రదర్శితం కానుంది . 

2015లో వెలుగు చూసిన  షీనా బోరా హత్య కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. షీనా హత్య ఘటన 2012లో జరిగింది. షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ,  డ్రైవర్‌ శ్యాంవర్‌ రాయ్‌, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాలతో కలిసి కారులో షీనా గొంతుకోసి చంపారని ప్రధాన ఆరోపణ. 

ఈ కేసులో ప్రధాన నిందితురాలైన  ఇంద్రాణి ముఖర్జీ ని ముంబైలోని బైకుల్లా మహిళా జైలుకు పంపారు. సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఆరున్నరేళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపిన ఇంద్రాణి 2022 మే నెలలో జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.

ఇక ఈ హత్య కేసు మిస్టరీల పుట్ట. దర్యాప్తులో విస్తుపోయే సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులకు మొదట్లో క్లూ దొరకక గందరగోళంలో పడ్డారు. ఇంద్రాణీ మొదటి మొగుడికి విడాకులు ఇచ్చి కుమార్తె షీనా,కుమారుడు మైఖేల్ ను తల్లితండ్రుల వద్ద ఉంచి సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.

కొన్నాళ్ల తర్వాత  అతని నుంచి కూడా దూరమై పీటర్‌ ముఖర్జియాను మూడో పెళ్లి చేసుకుంది. పీటర్ స్టార్ టీవీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కొన్నాళ్ళు పని చేశారు. టెలివిజన్ ఛానల్ ESPN స్టార్ స్పోర్ట్స్ ,స్టార్ న్యూస్.. కేబుల్ టెలివిజన్ సర్వీస్ ఆపరేటర్ హాత్వే డైరెక్టర్ గా కూడా పనిచేశారు. 

కాలక్రమంలో  షీనా అసలు విషయం తెలుసుకొని తల్లిని కలవడానికి ముంబయి వెళ్లింది.. అక్కడ పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్ తో షీనా కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మెల్లగా ప్రేమకు దారితీసింది.ఈ విషయంలో తల్లీ కూతుళ్ళ మధ్య  గొడవలు జరిగాయి.

షీనా తల్లి మాటలు వినలేదు. పైగా తన గురించి అందరికి చెబుతానని బెదిరించింది.  దీంతో ఇంద్రాణీ షీనా ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇంద్రాణి షీనాను తన చెల్లెలుగా పీటర్ కు పరిచయం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి 

ఈ క్రమంలోనే  తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌తో కలిసి కూతురు హత్య కు పాల్పడిందని అభియోగం. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌.. పీటర్‌ని కూడా అరెస్టు చేశారు. జైల్లో ఉండగానే ఇంద్రాణీ  పీటర్ లు విడిపోయారు. అధికారికంగా 2019లో విడాకులు తీసుకున్నారు. సంజీవ్ ఖన్నా, డ్రైవర్ లు నేరం అంగీకరించగా.. ఇంద్రాణి ఒప్పుకోలేదు.

ఆసక్తికరమైన ఈ కథలో అనేక మలుపులున్నాయి. ఇదిలా ఉంటే ఇంద్రాణి .. Un broken ..Untold story పేరిట  ఒక పుస్తకం రాశారు. అందులో తాను ఏ తప్పు చేయలేదని .. షీనా అంటే తనకెంతో ప్రేమని రాసుకున్నారు. షీనా ఇప్పటికి బతికే ఉందని.. అమెరికాలో ఉందని ఇంద్రాణి భావిస్తోంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!