” షేర్ టిప్స్”.. అన్ని సేఫ్ కాదు !!

Sharing is Caring...

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తుంటారు. మన సెల్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు కూడా చేస్తుంటారు. ఆ షేర్  కొనండి. రెండు నెలల్లో ధర రెండింతలు పెరుగుతుంది అని చెబుతుంటారు. కొంతమంది నిజమే అనుకుని వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. తీరా కొంత కాలం ఆగి చూస్తే … ఉన్న ధర కూడా పడిపోతుంది.

షేర్ ధర అలా తగ్గడానికి కారణాలు బోలెడు వుంటాయి.తాత్కాలికం గా తగ్గిన తర్వాత పెరిగే అవకాశాలు వుంటాయి.అయితే షేర్ ఫండ మెంటల్ గా బలమైనదా కాదా అనేది కీలకం . అలా లేక పోతే ఇన్వెస్టర్లు నష్ట పోవాల్సి వుంటుంది . కొంత మంది సలహా దారులు  చెత్త షేర్లను కూడా సిఫారసు చేస్తుంటారు. ఉదాహరణకు ఓ పన్నెండ్ల క్రితం “వీర్ ఎనర్జీ ”  షేర్ ను కొనమని ఎంతో మంది సలహా దారులు ఇన్వెస్టర్లకు సిఫారసు చేశారు.

లక్షల మంది ఆ షేర్లను కొనుగోలు చేసి నష్ట పోయారు. షేర్ ధర పెరగక పోగా పూర్తిగా పతన మైంది.కొంత మంది స్వల్ప నష్టాలతో బయట పడగా, ఇంకొంత మంది ధర పెరుగుతుందని ఆశలు పెట్టుకొని నిండా మునిగి పోయారు.మార్కెట్ లో ఇలాంటి షేర్లు ఎన్నో వున్నాయి. అందుకే అన్ని టిప్స్ ను కూడా పూర్తిగా నమ్మడానికి వీలులేదు. టిప్స్ ను క్రాస్ చెక్ చేసుకుని మదుపు చేయడం అన్ని విధాల ఉత్తమం.

అప్పుడే కష్టార్జితం సేఫ్ గా వుంటుంది. ఫీజు తీసుకొని టిప్స్ ఇచ్చే సలహా దారులు  కొంత బాధ్యతతో వ్యవహరిస్తారు. ఫ్రీ టిప్స్ అంటూ కొద్ది మంది మాత్రమే తప్పుడు సలహాలతో ఇన్వెస్టర్లను నష్టాల బాట పట్టిస్తుంటారు అలాంటి సలహా దారుల పట్ల కొంత అప్రమత్తం గా వుండాలి. స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనే ముందు జాగ్రత్తలు తీసుకొనాలి.

అలాగే మీడియా లో వచ్చే సిఫారసులు కూడా అన్ని నమ్మదగిన స్థాయిలో ఉండవు. ఎవరు  ఏది చెప్పినా వెరీ ఫై లేదా క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. డబ్బులు వస్తాయంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు. ఇదే బలహీనతను బేస్ చేసుకుని మార్కెట్లో టిప్స్ సర్క్యులేట్ అవుతుంటాయి. అలాగే కంపెనీల గురించి సమాచారం చక్కర్లు గొడుతుంటుంది. వీటిలో కొన్ని నిజాలు ఉంటాయి. మరికొన్ని అవాస్తవాలు ఉంటాయి. ఏదైనా ధృవీకరించు కోనిదే సొమ్ము దేంట్లో మదుపు చేయకూడదు. 

చాలామంది ఇన్వెస్టర్లు స్వల్ప కాలం లో అధిక లాభాలు  ఆర్జించాలంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మంచి మార్గం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏమి తెలియక పోయినా మార్కెట్ లో షేర్లు కొని లాభాలు పొందిన వాళ్ళు కొద్దిమందే… చేతులు కాల్చుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే కొందరు బయటికి చెప్పుకుంటారు . కొందరు చెప్పుకోరు.. అంతే. 

నిజం చెప్పుకోవాలంటే  షేర్ల పై కొద్దో గొప్పో సంపాదించాలంటే  ఇన్వెస్టర్లు  కొంత మేరకైనా కసరత్తు చేయాలి. మార్కెట్ కి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.లేదా ఆ రంగం లో నిష్ణాతులైన వారి సలహాలు తీసుకోవాలి. అయితే ఎప్పుడైనా సొంతం గా తెలుసుకొని  షేర్లలో మదుపు చేయడం ఉత్తమం.

నోట్ ….. ఈ వ్యాసకర్త షేర్లను సిఫారస్ చేసినా నమ్మొద్దు .. క్రాస్ చెక్ చేసుకోండి. 

——–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!