Competitive fight…………………………
రామాయణం సీరియల్ ఫేమ్ నటుడు అరుణ్ గోవిల్ యూపీ లోని మీరట్ లోకసభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి 10,585 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. అక్కడ సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సునీతా వర్మ గట్టి పోటీ ఇచ్చారు. అరుణ్ గోవిల్ కు 546,469 ఓట్లు పడగా .. సునీతా వర్మకు 5,35,884 ఓట్లు వచ్చాయి.
సాధారణ మెజారిటీ తో అరుణ్ గోవిల్ గెలిచారు. మూడో స్థానం లో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి కి 87,025 ఓట్లు వచ్చాయి. అరుణ్ గోవిల్ కున్న గ్లామర్ పెద్దగా పనిచేయలేదు. మీరట్ చారిత్రిక ప్రాధాన్యత ఉన్న నగరం. బీజేపీ కి కొంత పట్టు ఉన్న నియోజకవర్గం.1996,1998,2009,2014,2019..సంవత్సరాలలో జరిగిన లోకసభ ఎన్నికల్లో బీజీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు.
2009..నుంచి రాజేంద్ర అగర్వాల్ బీజేపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. అంతకుముందు 94..ఉపఎన్నికల్లో తర్వాత జరిగిన 96.98..ఎన్నికల్లో అమర్ పాల్ సింగ్ బీజేపీ తరపున వరుస విజయాలు సాధించారు.
99ఎన్నికల్లో మటుకు కాంగ్రెస్ విజయం సాధించింది. 2004..లో బహుజన సమాజ్ పార్టీ గెలిచింది. 1996..కంటే ముందు జనతాదళ్ ,జనతా పార్టీలు ..సంయుక్త సోషలిస్ట్ పార్టీ గెలిచాయి. కాంగ్రెస్ 1952,1957,1962..ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది.
గత 25 ఏళ్ళ కాలంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు.. ఒక్కో ఎన్నిక కు ఆ పార్టీ బలం క్షీణిస్తూ వచ్చింది .. 2014 లో ఇక్కడ నుంచి గ్లామర్ తార నగ్మా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆమెకు కేవలం 42,911 ఓట్లు వచ్చాయి. దారుణంగా ఓడిపోయారు. మళ్ళీ ఆమె ఇక్కడ పోటీ చేయ లేదు.2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి హరీంద్ర అగర్వాల్ కి 34,479 ఓట్లు వచ్చాయి.
అరుణ్ గోవిల్ మీరట్ కి చెందిన వాడే .. 1977 లో పహేలీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. సుమారు 25 సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేసాడు. కొంత గుర్తింపు సంపాదించాడు. 1987-88 సంవత్సరాలలో అరుణ్ గోవిల్ లైఫ్ టర్న్ అయింది .
రామాయణం సీరియల్ లో రాముడిగా నటించాడు. అంతకు ముందు ఒక సీరియల్ విక్రమ్ ఔర్ భేతాళ్ లో కూడా నటించాడు. ఇక రామాయణం సంగతి చెప్పనక్కర్లేదు . ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది. 2021లో అరుణ్ గోవిల్ బీజేపీ లో చేరారు. అనూహ్యం గా మీరట్ టిక్కెట్ ఆయనకు దక్కింది. అరుణ్ గోవిల్ భారీ విజయం సాధిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి కానీ అలా జరగలేదు.