ఆ చిరునవ్వు వెనుక వేదన !

Sharing is Caring...

A mesmerizing voice………………….

చిత్ర …  సంగీత ప్రపంచంలో ఆమె స్వర శిఖరం.. మనసుకు ప్రశాంతత కావాలంటే సంగీతం వినాల్సిందే. అందులోనూ ఆమె స్వరం ఒత్తిడిని దూరం చేసి బాధను తగ్గించి ప్రేమను పంచుతుంది. అద్భుతమైన గాత్రంతో వేలాది మంది హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలమే.

ప్రేమ, కరుణ, ఇలా ఏ సన్నివేశానికైనా తగిన విధంగా పాడ గల శక్తి ఆమె గళానికి ఉంది.  ప్రేమ పాటలు, భక్తి పాటలు, అమ్మ ప్రేమను తెలిపే సంగీతం ఇలా ఏదైన సరే చిత్ర తన గళంతో ప్రజలను ఓలలాడించారు. సౌత్ టూ నార్త్ చాలా భాషల్లో  దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడారు.సంగీత ప్రియుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. 

సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో చిత్ర సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మధురమైన ఆమె గాత్రం సంగీత ప్రియులను కన్నీళ్లు పెట్టిస్తుంది.. నవ్విస్తుంది.. అలరిస్తుంది. సంప్రదాయ చీరకట్టు, బొట్టుతో ఎంతో హుందాగా.. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపిస్తారు సింగర్ చిత్ర. కానీ ఆ స్వచ్చమైన చిరునవ్వు వెనక చెప్పలేనంత విషాదం దాగుంది.

చిత్ర జీవితంలో ఎప్పటికీ చెరగని దుఃఖం.. తన కూతురు నందన దూరమవడం. చిత్ర.. విజయ్ శంకర్ అనే ఇంజనీర్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన చాలా సంవత్సరాలకు 18 డిసెంబర్ 2002లో నందన అనే అమ్మాయి జన్మించింది.

కానీ ఆ చిన్నారి డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడేది. తొమ్మిదేళ్ల వయసులో 2011లో ఓ కచేరి కోసం చిత్ర వెళ్లగా అదే సమయంలో నందన స్విమ్మింగ్ పూల్లో పడి కన్నుమూసింది. కూతురిని తలుచుకుంటూ చిత్ర తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఆ బాధ లోలోపలే ఉండిపోయింది. కానీ ఆమెకు సంగీతం ఊరటనిచ్చింది.

ఆ దుర్ఘటన జరిగాక ఆమె మాములు మనిషి కావడానికి చాలా సమయం పట్టింది.. .. సంగీతాన్ని విడిచిపెట్టాలనుకుంది.   కానీ కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఇప్పటికీ ఈ స్థాయిలో నిలబడ్డానని గతంలో చాలా సార్లు చిత్ర చెప్పుకొచ్చింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!