Omlet man of India……………………………….
గుడ్డు లేకుండానే ఆమ్లెట్ సాధ్యమేనా ? అంటే సాధ్యమే అని నిరూపించాడు కేరళకు చెందిన అర్జున్.కేరళలోని రామనట్టుకర నివాసి అర్జున్ ‘గుడ్లు’ లేకుండా ఫాస్ట్‌గా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపించాడు. దీనికి సంబంధించిన ఇన్‌స్టెంట్ పౌడర్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు. రకరకాల ప్రయోగాలు చేసి పౌడర్ తయారు చేసి విజయం సాధించాడు.
ఆ పౌడర్‌కి సంబంధించిన చిన్న ప్యాకెట్ ధర రూ. 5 మాత్రమే.5 రూపాయలకే ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు..ఐదు రూపాయల నుంచి వివిధ ధరలలో పౌడర్ లభిస్తుంది. ఈ పౌడర్ నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందట.
అర్జున్ తన కూతురు కోసం ఆమ్లెట్ త్వరగా ఎలా తయారు చేయడం ఎలా అని ఆలోచించాడు.ఆ క్రమం లోనే మూడు సంవత్సరాలుగా రకరకాల ప్రయోగాలు చేసాడు. అవి ఫలించాయి. దీంతో అర్జున్
‘ఆమ్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా గుర్తింపు పొందాడు.
అంతటితో ఆగకుండా అర్జున్. 2 కోట్లతో కొండోట్టి వజ్హయూర్‌లో ‘ధన్స్ డ్యూరబుల్’ అనే పేరుతో ఓ కంపెనీని కూడా పెట్టి..సేల్స్ ప్రారంభించాడు. అంతేకాదు కిడ్స్ ఆమ్లెట్ , ఎగ్ బుర్జి, వైట్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, స్వీట్ ఆమ్లెట్,బార్ స్నాక్ వంటి కొత్త ఫ్లేవర్స్‌లో మరిన్ని వెరైటీలను కస్టమర్‌లకు పరిచయం చేయనున్నాడు.
బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, యూకే, కువైట్ వంటి దేశాలకు కూడా తన ప్రొడక్ట్‌లను మార్కెట్ చేసుకుంటున్నాడు. అర్జున్ 2021లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ పౌడర్‌ను మరింతగా ఉత్పత్తి చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేసాడు. సుమారు ఏడుగురు మహిళలతో సహ 12 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు.ఆన్‌లైన్‌లో కూడా అమ్మకాలు మొదలెట్టి మార్కెట్‌ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాడు అర్జున్ నాయర్.

