Rare creatures.........................
చూడటానికి బల్లి లా కనిపించే ఈ జీవి బల్లి కాదు దాని పేరు ఓల్మ్. ఈ జీవికి కళ్ళు లేవు.. కానీ ఈ జీవి వందేళ్లు ఏళ్లు బతికేస్తుంది. ఈ జీవులు నీటి అడుగున పూర్తి చీకటిలో జీవించగలవు, అక్కడ వేటాడే జంతువులు ఉండవు. చాలా సంవత్సరాలు ఆహారం లేకుండా ఇవి ఉండగలవు.
నిజానికి, ఓల్మ్‌లు వాటి జీవక్రియను కూడా మందగించేలా చేయగలవు. అవి ఒక సారి ఏదైనా తిని దశాబ్దం పాటు జీవిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఓల్మ్ లు మధ్య ఐరోపాలోని భూగర్భ గుహలలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని చాలా పేర్లతో పిలుస్తారు.
ఈ ఓల్మ్ ను ప్రోటీయస్ ఆంగ్వినాస్.. ఓల్మ్ ప్రోటీయస్, కేవ్ సాలమండర్, వైట్ సాలమండర్ అని పిలుస్తారు. స్లోవేనియాలో దీనిని “మోసిరిల్” అని పిలుస్తారు. ఈ జీవిని “ఓవెజా రిబికా” అని “మానవ చేప” అని కూడా అంటారు. .ఇవి భూగర్భ గుహలలో మాత్రమే నివసిస్తాయి. ఓల్మ్ లు పూర్తిగా జలచరాలు. ఇవి లోతైన భూగర్భ సరస్సులు, గుహలలో ఉండే కొలనులలో మాత్రమే కనిపిస్తాయి.
ఈ జీవులు తమ జీవితమంతా పూర్తి చీకటిలో గడుపుతాయి.. ఓల్మ్ లు తెల్లటి-గులాబీ రంగులో కనిపిస్తాయి. వీటి పొత్తికడుపుపై చర్మం ద్వారా అంతర్గత అవయవాలను కూడా చూడవచ్చు.ఈ ఓల్మ్ ల కళ్ళు పెరగవు, అవి చర్మం పొరతో కప్పబడి ఉంటాయి. ఓల్మ్ లు దృష్టి కంటే ఇతర చురుకైన ఇంద్రియాలపై ఆధారపడి సంచరిస్తాయి.
ఓల్మ్ తల ముందు భాగంలో సున్నితమైన కెమో-, మెకానో, ఎలక్ట్రో రిసెప్టర్లు ఉంటాయి, నావిగేట్ చేయడానికి, ఎరను కనుగొనడానికి వాటిని ఉపయోగిస్తాయి . ఇవి వాసన, వినికిడి శక్తి కలిగి ఉంటాయి..ఓల్మ్ లు చిన్న పళ్లు.. చిన్న నోరు కలిగి ఉంటాయి.
ఇవి పురుగుల లార్వా, చిన్న పీతలు, నత్తలను తింటాయి. . ఓల్మ్ లు ఎక్కువ కాలం జీవించిన ఉభయచర జాతులు. ఓల్మ్స్ కనీసం 50 సంవత్సరాలు పైన జీవించగలవు. ఒక అధ్యయనం ప్రకారం ఇవి గరిష్టంగా 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించాయని పరిశోధకులు అంటున్నారు. ఓల్మ్స్ 8 నుంచి 12 అంగుళాల కన్నా పొడవు పెరగవు.