చైనాలో మిస్టీరియస్‌ న్యూమోనియా కలకలం!

Sharing is Caring...

Mysterious Viral…………………

కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నాయి.చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారులే స్వయంగా మీడియా మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.దీంతో ఒక్కసారిగా అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్‌ఫ్లుఎంజా లాంటి వైరల్‌ వ్యాధి వ్యాప్తిలో ఉంది. ఈ వైరల్ పిల్లలకే  ఎక్కువగా సోకుతోంది.  చైనాలో ఆస్పత్రులన్నీ ఈ వ్యాధి బారిన పడిన పిల్లలతోనే నిండిపోతున్నాయి.  అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.  పిల్లలతోనే ఆస్పత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

కరోనా ఆంక్షలను తొలగించిన దరిమిలా ఈ  శ్వాసకోశ వ్యాధులు పెరిగాయని సమాచారం. ఈ శ్వాసకోశ వ్యాధులు తీవ్రం కాకుండా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ను కోరింది. కోవిడ్‌-19 రూపాంతరం సార్క్‌ కోవిడ్‌-2.. ఇన్‌ఫ్లుఎంజా, మైక్రోప్లాస్మా న్యుమోనియా వంటి వ్యాధులు రావచ్చని గతంలోనే  డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

ప్రస్తుతం  చైనా పిల్లల్లో అలాంటి వ్యాధుల సంక్రమణే ఎక్కువగా ఉందని అంటున్నారు. కరోనా పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకోస్తోంది ఎవరికైనా. ముఖ్యంగా కరోనా పుట్టినిల్లు  చైనా సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న దేశం అది. తాజాగా మళ్లీ కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు గురించి వస్తోన్న వార్తలు జనాల్లో గుబులు రేపుతున్నాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!