రామజన్మభూమి వివాదం పరిష్కారమై మందిర నిర్మాణం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కృష్ణ జన్మభూమి కోసం న్యాయపోరాటం మొదలైంది. మధుర కోర్టులో ఈమేరకు శ్రీకృష్ణ విరాజ్మాన్ సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. మధురలోని షాహీ ఈద్గా మసీదు ను తొలగించి 13. 37 ఎకరాల స్థలాన్ని కృష్ణమందిరం కోసం కేటాయించాలని శ్రీకృష్ణ విరాజ్మన్ డిమాండ్ చేస్తోంది . ఈద్గా మసీదు ఉన్న ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం ఉందని విరాజ్మాన్ వాదన. అయోధ్య విజయం స్ఫూర్తి తో ఈ పిటీషన్ దాఖలు చేసినట్టు విరాజ్మన్ ప్రతినిధులు చెబుతున్నారు.
1658 నుంచి 1707 వరకు భారత్ దేశాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పెద్ద సంఖ్యలో హిందూ మత ప్రదేశాలు ,దేవాలయాలు కూల్చి వేయాలని ఆదేశాలు జారీచేశారని విరాజ్మన్ అంటోంది. అలా కూలిపోయిన వాటిలో కత్రా కేశవదేవ్ వద్ద నున్న శ్రీకృష్ణ జన్మ స్థానం కూడా ఉందని … అప్పట్లో ఔరంగజేబు సైన్యం కేశవదేవ్ గుడిని పాక్షికంగా పడగొట్టిందని పిటీషన్ లో విరాజ్మన్ పేర్కొన్నది. ఆ తర్వాత అక్కడ మసీదు నిర్మించి ఈద్గా మసీదు గా పేరు పెట్టారని విరాజ్మన్ వాదిస్తోంది. దీన్ని సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు , మసీదు ట్రస్ట్ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నాయని పిటీషన్ లో చెప్పారు. తమకు ఎలాంటి హక్కులు లేకపోయినా మసీదు ట్రస్ట్ 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ తో అక్రమంగా రాజీ కుదుర్చుకుందని పిటీషనర్లు ఆరోపిస్తున్నారు. తద్వారా న్యాయస్థానాలను ,భక్తులను మోసగించారని విరాజ్మన్ చెబుతోంది. అప్పట్లో రాజీ కుదిరిన క్రమంలోనే ఈ ఈద్గా మసీదును నిర్మించారని అంటున్నారు.
అప్పటి రాజీ ఒప్పందం చెల్లదని … హిందూ చట్టం ప్రకారం అప్పగించిన దేవాలయ భూమి దేవతల ఆస్తిగా కొనసాగుతుందని… దాన్ని ఎవరూ మార్చలేరని .. దాన్ని ఎపుడైనా తిరిగి పొందే హక్కు యజమానులకు ఉంటుందని విరాజ్మన్ వాదన. ఆ సంస్థ యాజమాన్య హక్కులున్న ఆధారాలతో మధుర కోర్టులో పిటీషన్ వేసింది. ఔరంగజేబు కాలం నుంచి ఆ ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు .. అక్రమ నిర్మాణాల గురించి పిటీషన్లో ప్రస్తావించింది. ఈ ప్రాంతాన్ని తమకు వెంటనే అప్పగించాలని విరాజ్మన్ కోర్టును అభ్యర్ధించింది.
కాగా రామజన్మభూమి తర్వాత మధుర , కాశీలలో ఉన్నఅక్రమ నిర్మాణాల విషయం పరిశీలించాల్సిన అవసరం ఉందని కొద్దిరోజుల క్రితం బీజేపీ నేత వినయ కటియార్ అన్నారు. ఇవన్నీ పార్టీ ఎజండా అంశాలే అని వినయ్ స్పష్టం చేశారు. ఆర్ ఎస్ ఎస్ మాత్రం అయోధ్యను మిగిలిన ప్రదేశాలకు ముడిపెట్టొద్దని అంటోంది. విరాజ్మన్ దాఖలు చేసిన పిటీషన్ అసంబద్ధమైనదని షాహి ఈద్గా కి చెందిన హాజీ మెహబూబ్ విమర్శించారు. రామ్ మందిర్ ,బాబ్రీ కేసు మినహా ఎక్కడా మరో కేసు వేయకూడదని సుప్రీం కోర్టు చెప్పిందని అంటున్నారు. కోర్టు కేసు విషయాలు ఆలా ఉంటే ప్రస్తుతం ఉన్న కేశవదాస్ ఆలయం దాల్మియా ,బిర్లా ల ఆర్ధిక సహాయంతో నిర్మించారు. 1953 లో నిర్మాణం మొదలై 82 నాటికి పూర్తి అయింది. అసలు గుడిని ఔరంగజేబు సైన్యం కూల్చివేసిందని ఆరోపణ. ఇక దాని పక్కనే షాహీ ఈద్గాను 1949 లో నిర్మించారు.
శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ తో సంబంధంలేని వ్యక్తులు కొంతమంది విరాళాలు వసూలు చేసారని గత ఆగస్టులో పోలీసులు కేసు నమోదు చేశారు.
బీహార్ ఎన్నికల వేళ కృష్ణ జన్మ భూమి వివాదం తెరపైకి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం.
Jeevan Kiran plan 870………………………………………….. ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) కొత్త టర్మ్ పాలసీని ప్రారంభించింది. ఈ ప్లాన్ పేరు జీవన్ కిరణ్ (Jeevan Kiran plan870)ఇది నాన్ లింక్డ్, నాన్ … Read More
యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు బెల్ బాటమ్ సినిమా నచ్చుతుంది. 1980 దశకంలో జరిగిన విమాన హైజాక్ ఘటనలను ఆధారం గా చేసుకుని ఈ సినిమా తీశారు. ప్రధాని ఇందిర హయాంలో … Read More
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన నుంచి దూరమై అపుడే నాలుగేళ్లు అవుతోంది . ఈ సందర్భంగా బాలు స్మృతులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. చిన్నతనం లో పై ఫోటోలో కనబడే ఇంట్లో … Read More