కృష్ణంరాజుకు స్టెప్స్ నేర్పిన కమల్ !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ……………………..

Dance movements …………………………………….

1972-73 ప్రాంతాల్లో … మ‌న ప్ర‌త్య‌గాత్మ గారి సోద‌రుడు హేమాంబ‌ర‌ధ‌ర‌రావు గారి ఇంటిదొంగలు సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. కృష్ణంరాజు హీరో. జ‌మున హీరోయిన్. ఇద్ద‌రి మీద కొండ‌మీద వెండివాన పాట…ఊటీ లో షూటింగ్ న‌డుస్తోంది…

తంగ‌ప్ప అనే నృత్య‌ద‌ర్శ‌కుడి ప‌ర్య‌వేక్ష‌ చిత్రీక‌ర‌ణలో న‌డుస్తోంది. తంగ‌ప్ప ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ఓ కుర్రాడు ప‌నిచేస్తున్నాడు. అత‌ను హీరోగారికి మూమెంట్స్ చూపిస్తున్నాడు. హీరో కృష్ణంరాజుకు వాటిని అందుకోవడం చాలా క‌ష్టంగా అనిపించింది. ఆ కుర్రాడు మెరుపులా చేసుకువెళ్లిపోతున్నాడు.

జ‌నం మ‌ధ్య న‌డుస్తున్న షూటింగు. ఆ కుర్రాడు చేస్తున్నాడు … హీరోగారి వ‌ల్ల కావ‌డం లేదు అని జ‌నం అనుకుంటారేమో అని హీరోగారికి అనుమానం. దీంతో … ఇలా లాభం లేద‌ని ఆ కుర్రాణ్ణి ప‌క్క‌కు తీసుకెళ్లి … నువ్వు డాన్స‌ర్ వి బాబూ నేను కాదు … కాబ‌ట్టి నేను నేర్చుకుని చేసేలా ఉండాలి మూమెంట్స్ … నువ్వు స్టైల్ మారుస్తావా … లేక మీ గురువుతో మొర‌పెట్టుకోనా అని అడిగారు.

ఆ కుర్రాడు త‌ల‌గోక్కుని స‌రే … అయితే అలాగే చేద్దాం…నో ప్రాబ్ల‌మ్ అని కృష్ణంరాజు గారికి క‌న్వినియంట్ గా ఉండేలా డాన్స్ మూమెంట్స్ చూపించి ఓకే చేయించాడు. ఆ కుర్రాడి పేరు క‌మ‌ల్ హ‌స‌న్. ఈ విష‌యాన్ని కృష్ణంరాజు  క‌మ‌ల్ హ‌స‌న్  ఇద్ద‌రూ వేరు వేరు సంద‌ర్భాల్లో చెప్పుకున్నారు.

ఇది కృష్ణంరాజుగారి వ‌ర్ష‌ను. కృష్ణంరాజుగారు నాకు వార్నింగ్ ఇచ్చారు అని క‌మ‌ల్ హ‌స‌న్ చెప్పారు. అంతే తేడా … మిగిలిన సీనంతా సేమ్ టూ సేమ్. అయితే తర్వాత కాలంలో ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలే కొనసాగాయి.

అప్పట్లోనే కమల్ ప్రతిభకు ముగ్దుడైన రెబల్ స్టార్.. “నువ్వు ఎప్పటికైనా గొప్ప స్థాయికి వెళ్తావురా” అనేవారట. ఆయన అన్నట్లుగానే కొంతకాలానికి కమల్ ఆలిండియా లెవెల్ హీరోగా ఎదిగారు. ‘ఇంటి దొంగలు’ సమయం నుంచే కృష్ణంరాజుని “అన్నగారు” అని పిలుస్తూ కమల్ ప్రత్యేక అభిమానం చూపించేవారట.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!