IRCTC Special Tour Package…………………………..
తమిళనాడులో ఎన్నో పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర 9 రోజుల పాటు సాగుతుంది.
జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర రైలు ప్రయాణం ద్వారా చేయాలి.ఈ యాత్ర మార్చి 21 తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై) జ్యోతిర్లింగ క్షేత్రం గా భాసిల్లుతున్న రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు వంటి దివ్య క్షేత్రాలను సందర్శిస్తారు.
ఈ ప్రత్యేక రైలు Bhongir, Jangaon, Kazipet, Warangal, Mahbubabad, Dornakal Jn., Khammam, Madhira, Vijayawada, Tenali, Chirala, Ongole, Kavali, Nellore, Gudur, Renigunta మీదుగా వెళుతుంది. ముందుగా ప్యాకేజీ తీసుకున్న యాత్రీకులు వారి సమీపంలోని స్టేషన్లలో రైలు ఎక్కే.. దిగే సదుపాయం ఉంది.
ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర మొత్తం 8 రాత్రులు… 9 రోజుల పాటు సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా యాత్రీకులకు అన్ని సౌకర్యాలు IRCTC కల్పిస్తుంది. రైలు, రోడ్డు రవాణాతో సహా, వసతి సౌకర్యం, ఉదయం టీ, అల్పాహారం, లంచ్ , డిన్నర్ లను అందిస్తుంది. అంతేకాదు పర్యాటకుల భద్రతలో భాగంగా రైలులో అన్ని కోచ్‌లలో సిసి టీవి కెమెరాలను అమరుస్తారు.
ప్రయాణ భీమా సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా IRCTC టూర్ మేనేజర్‌ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర 21.03.2025 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 12:00 గంటలకు మొదలవుతుంది. యాత్ర ముగించుకుని ప్రత్యేక రైలు 29-3-25 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. మార్గ మధ్యంలో దిగే వారు దిగవచ్చు.
ప్యాకేజీలో టికెట్స్ ధరలు….. స్లీపర్ కోచ్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ . 14250.. థర్డ్ ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ . 21.880… సెకండ్ ఏసీ ఒక్కొక్కరికి రూ . 28440.. ఇతర వివరాలకు IRCTC వెబ్ సైట్ చూడండి. ఇతర వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించండి 040-27702407 / 9701360701