దక్షిణాది ఒకప్పుడు శృంగార తారలకు ప్రసిద్ధి. నాలుగు భాషల్లో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన డాన్సర్స్ చాలామందే ఉన్నారు. అలాగే తమ అందచందాలు ప్రదర్శించడానికి ఇష్టపడని నాట్యతారలు ఉన్నారు. ఈ రెండు కేటగిరీలలో కూడా సౌత్ ఇండియా ఏమాత్రం నార్త్ ఇండియాకు ఏమాత్రం తీసిపోదు. ఒకనాడు దక్షిణాదిని ఏలిన శృంగార తారలు గురించి తెలుసుకుందాం.
విజయలలిత.…… మొదట్లో శృంగార నాట్యతార గా ఎన్నో సినిమాల్లో నటించిన విజయలలిత .. వ్యాంప్ పాత్రలు చేశారు. ఆ తర్వాత రౌడీ రాణి, రివాల్వర్ రాణి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రధాన పాత్రలు చేసి పాపులర్ అయ్యారు. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా చేశారు. ఈమె తెలుగు, తమిళం, హిందీ, మలయాళం చిత్రాలలో కూడా నటించింది. ప్రముఖ నటి విజయశాంతి కి పిన్ని అవుతుంది. అలాగే ప్రఖ్యాత నటి విజయ నిర్మల కు బంధువు అవుతారు. దాదాపు 700 సినిమాల్లో చేశారు.
జ్యోతిలక్ష్మి … బ్లాక్ అండ్ వైట్ … ఈస్ట్‌మన్ కలర్ సినిమాల్లో నటించి శృంగార తార గా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎక్స్ పోజింగ్ జ్యోతిలక్ష్మి తో తారా స్థాయికి చేరుకుంది. జ్యోతి లక్ష్మి 300 కి పైగా సినిమాల్లో నటించింది. నాలుగు దక్షిణాది భాషల్లో తన ఉనికిని చాటుకుంది. ఆమెకు అప్పట్లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శిక్షణ పొందిన నృత్యకారిణి అయినప్పటికీ సాంప్రదాయ నాట్యాల కంటే ఐటెం సాంగ్స్ లోనే ఎక్కువగా నటించారు. ఈమె కూడా కొన్ని సాధారణ పాత్రలు .. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు. ఈమె నటించిన కొన్ని వందల పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి.
జయమాలిని .… ఈమె జ్యోతి లక్ష్మి సొంత చెల్లెలే. వీరిద్దరూ కూడా కలసి నటించిన చిత్రాలున్నాయి. జయమాలినిలో సెక్స్ అప్పీల్ ఎక్కువ. ఆమె తన సమ్మోహన రూపంతో ఐటెం సాంగ్స్ కు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అప్పట్లో రోజుకు లక్ష రూపాయల పారితోషకం తీసుకుందని అంటారు. సినిమాలో జయమాలిని ఉందంటే జనాలు ఎగబడేవారు. జయమాలిని 500 కి పైగా సినిమాల్లో నటించింది.
అనురాధ… ఈమె అసలు పేరు సులోచన. జ్యోతి లక్ష్మి .. జయమాలిని లకు పోటీగా రంగప్రవేశం చేసింది. అనురాధ ఎక్కువగా ఐటెమ్ సాంగ్స్ చేసింది. ఈమె కూడా దక్షిణాది సినిమాల్లో పాపులర్ డాన్సర్. కొన్ని హిందీ .. ఒరియా చిత్రాలలో కూడా చేసింది. కొన్ని సాధారణ పాత్రలు చేసింది. 1985లో పెళ్ళిచేసుకుని మెల్లగా సినీరంగానికి దూరమయింది.
సిల్క్ స్మిత.… అసలు పేరు విజయలక్ష్మి .. ఆంధ్రా అమ్మాయి. సిల్క్ జీవితం సినిమా కథకు తక్కువ ఏమీ కాదు. సినిమా కూడా తీశారు. ఇప్పటి వరకు సిల్క్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరో తారకు లేరు. ఇప్పటికి ఆమె అభిమానులున్నారు. అత్యధిక పారితోషకం తీసుకున్న ఐటెం భామ కూడా ఈమె అని చెప్పుకోవచ్చు. స్మిత డాన్స్ లేనిదే ఆరోజుల్లో సినిమాలు వచ్చేవి కావు. కొన్ని సపోర్టింగ్స్ రోల్స్ కూడా చేసింది. ఈమె వచ్చాక జ్యోతి లక్ష్మి,జయమాలిని తదితర శృంగార తారల హవా తగ్గింది. సిల్క్ స్మిత 36 సంవత్సరాల వయస్సులో మరణించింది.
డిస్కో శాంతి….. అసలు పేరు శాంతకుమారి .. డిస్కో శాంతిగా ప్రఖ్యాతి గాంచారు. ఐటమ్ డ్యాన్సర్ మాత్రమే కాదు. ఎన్నో సినిమాల్లో శృంగార పాత్రలు కూడా పోషించింది. కథానాయికగా కెరీర్ ప్రారంభించిన శాంతి ఐటెం సాంగ్స్‌లో బాగా పాపులర్ అయ్యారు. నటుడు శ్రీహరిని పెళ్లాడిన తర్వాత ఆమె డ్యాన్స్‌కి దూరమైంది. ఆమె చెల్లెలు లలిత కుమారినే నటుడు ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత ఈ జంట విడిపోయారు. డిస్కో శాంతి తండ్రి కూడా తమిళ నటుడే. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా నటించారు. సుమారు 500 కి పైగా సినిమాల్లో నటించారు.
అభినయశ్రీ .. శృంగార తార అనురాధ కుమార్తె . నటిగా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ.. ఐటెమ్ సాంగ్స్ తో పాపులారిటీ సంపాదించింది. కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది.తర్వాత కాలంలో ఐటెమ్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ముమైత్ ఖాన్. ప్రతి స్టార్ హీరో కూడా తమ సినిమాల్లో ఈమె పాటను పెట్టాలని నిర్మాతలకు సూచించే వారు. ముమైత్ కూడా కొద్ది కాలం పాటు ప్రధాన పాత్రల్లో నటించింది. అలాగే ముంతాజ్ .. అల్ఫోన్సా వంటి తారలు కూడా దక్షిణాదిన శృంగార తారలు గా రాణించారు.
——–KNM