ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ !

Sharing is Caring...

Kontikarla Ramana …………………………………….Revenge stoty

పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రయాస తో కూడిన వ్యవహారం. ఏదో ఫిర్యాదు చేశామా… కేసు నమోదైందా… ఎఫ్ఐఆర్ బుక్ చేశామా… రిమాండ్ కు పంపామా అన్నదే కాదు… ప్రాసిక్యూషన్ లో ఆ ఆధారాలు నిలబడాలి. కోర్టులకు కావల్సింది ఆధారాలతో కూడిన సాక్ష్యాలే. అక్కడ మేనేజ్ చేయడం ఏమాత్రం నడువదు.

అదిగో అలాంటి పరిస్థితుల్లో దర్యాప్తు చేసే ఓ పోలీస్ ఆఫీసర్ కి… ఏకంగా తన కొడుకు మర్డర్ మిస్టరీనే ఇన్వెస్టిగేట్ చేయాల్సివస్తే ఎదుర్కొనే సవాల్ ను పట్టి చూపేదే హెవెన్ సినిమా. సొంతకొడుకు హత్యపై ఇన్వెస్టిగేషనంటే ఎంతో మోషనల్ అటాచ్ మెంట్ ఉంటుంది.. అలాంటి ఎమోషనల్ అటాచ్ మెంట్ ను ఎదుర్కొంటూ కేసును దర్యాప్తు చేసే క్రమంలో…  ఏదైనా తేడా రావచ్చు.

అది పోలీసుల ప్రాసిక్యూషన్ కు బూమరాంగ్ కావచ్చు. ఆ క్రమంలో అధికారినే మార్చేయవచ్చు. అలాంటి సందర్భంలో పీటర్ అనే అధికారి ఎలా దర్యాప్తు కొనసాగిస్తాడు… తాను ఫీల్డ్ లో లేనప్పుడు జరిగే దర్యాప్తుపై ఆయనకెంత నమ్మకముంటుంది.

విశ్వాసం సన్నగిల్లినప్పుడు ఆ అధికారి సమాంతరంగా తనకున్న గతం తాలూకు దర్యాప్తు అనుభవంతో కేసును ఎలా డీల్ చేస్తాడన్నదాన్ని  ఉత్కంఠభరితంగా  తెరపై  చూపించాడు  దర్శకుడు. పీటర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో  సూరజ్ భిన్న రకాల ఎమోషనల్ షేడ్స్ తో అంతే న్యాయం చేశాడు.

మొత్తంగా ఓ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా.. నిష్పాక్షికంగా, పారదర్శకంగా చేయాల్సిన దర్యాప్తుకు భిన్నంగా… ఓవైపు ప్రతీకారేచ్ఛ… ఇంకోవైపు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితిలో ఒకింత ఎమోషన్ ను చూపిస్తూనే ఈ కథనాన్ని నడిపించే యత్నం చేశాడు డైరెక్టర్ ఉన్ని గోవిందరాజ్.

తన తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను అందించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు గోవిందరాజ్. సినిమా అంతా సస్పెన్సు తో నడిపాడు. సూరజ్ పాత్రకు  ప్రాణం పోసాడు.

క్యాంపుకు వెళ్లిన ఎన్సీసీ క్యాడెట్స్ కుళ్లిపోయిన మృతదేహం కనుక్కున్నప్పట్నుంచీ… ఆ మర్డర్ వెనుకున్నది ఓ పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చన్న అనుమానాలతో ప్రారంభమయ్యే కథ ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంటుంది.

ఇప్పుడు దక్షిణాదిన మళయాళం, తెలుగు భాషలతో పాటు… ఇతర భాషల్లోనూ తన మెలోడియస్ స్టైల్ తో ఆకట్టుకుంటున్న గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. బీజీఎం  బాగుంది. వినోద్ ఇల్లంపల్లి సినిమాటోగ్రఫీ కూడా ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. 

అయితే మొదటి భాగం కొంత స్లో అనిపించినా … ఊహించని మలుపులు తిరుగుతూ కథ నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం కథనం స్పీడ్ గా నడుస్తుంది. హీరోయిన్ లేని సినిమా ఇది … మన తెలుగులో పీటర్ పాత్రకు జోడీగా ఒక నటిని పెట్టి … మూడు నాలుగు పాటలు పెట్టేవారు. ఈ సినిమాకు ప్రతీకారం అనేది కరెక్ట్ టైటిల్ .. కానీ హెవెన్ అని పెట్టారు. 
హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా క్రైం థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది.   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!