దెయ్యంతో ఇంటర్వ్యూ 1

Sharing is Caring...

హుర్రే …. వందో దెయ్యం కథ పూర్తి చేశా.
అసలు ఇన్ని దెయ్యం కథలు రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
కానీ ఒక దెయ్యాన్ని అయినా ఇంటర్వ్యూ చేసిఉంటే సూపర్ గా ఉండేది.
దేశమంతా మన పేరు మారుమ్రోగి పోయేది. ప్చ్.

ఒక్క దెయ్యం అయినా కనబడి ఛస్తే కదా.
ఊరి చివరి పాడుబడ్డ ఇంట్లో కెళ్ళి చూస్తే ?
ఇదివరకు ఒక సారి చూసిన సంగతి గుర్తుకొచ్చింది.
అక్కడ కూడా దెయ్యాలు ఈ మధ్య ఉంటున్నట్టు లేవు.

అన్ని కట్టకట్టుకుని సిటీలకు వెళ్లాయి కాబోలు.
మరెలా దెయ్యాన్ని పట్టుకునేది? ఎలా? అనుకుంటున్నంత లోనే సెల్ ఫోన్ రింగ్ అయింది.
ఫోన్ తీసుకుని ‘హలొ’ అన్నాను.
‘మూర్తి గారేనా ? ‘ఎవరిదో ఆడగొంతు.
‘అవును …. మీరు ?’

‘మీరు దెయ్యాన్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు కదా. ‘
‘అవును.’
‘అయితే ఈ రాత్రికి ఊరి చివర ఉన్న చింతచెట్టు దగ్గరకు రండి.’
‘ఇంతకూ మీరెవరు ?’
‘నేను కూడా దెయ్యాన్నే.’ ఆ మాట వినగానే గుండె ఒక్క క్షణం ఆగింది.

‘నిజంగా దెయ్యమేనా ? నన్ను ఆట పట్టిస్తున్నారా ?’ అడిగాను కొంచెం ధైర్యం తెచ్చుకుని.
అటు నుంచి కిలకిలా నవ్వింది దెయ్యం. ఆ నవ్వు మనుష్యులను మెస్మరైజ్ చేసేలా ఉంది.
‘మీ నవ్వు బాగుంది.’ అన్నాను.
‘థాంక్యూ … ఇంతకూ వస్తున్నారా ?’

‘తప్పకుండా వస్తాను … అన్నట్టు మీ పేరేంటో ?’
‘ప్రియంవద’
‘వౌ . లవ్లీ నేమ్ ‘ అన్నానో లేదో ఫోన్ కట్ అయింది.
ఈ దెయ్యాలకు మన మనసులో ఏముందో కూడా తెలిసి పోతుంది కాబోలు.
లేకపోతే దెయ్యాన్నిఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నసంగతి దెయ్యానికి ఎలా తెలిసింది ?
అలా అనుకున్నానో లేదో ఇలా ఫోన్ వచ్చింది.

‘ఒరేయ్ మూర్తి .. నువ్వు లక్కీ ఫెలోవి రా. ‘ నన్ను నేను అభినందించుకున్నా.
అంతలోనే మనసేదో కీడు శంకించింది.
అవును … దెయ్యాలు ఇపుడు సెల్ ఫోన్లు కూడా వాడుతున్నాయా ? చాలా అప్డేట్ అయినట్టున్నాయి.
రాత్రి పూట రమ్మని పిలుస్తోంది. వెళితే దెయ్యాలు వేయించుకు తినవు కదా.
ఈ దెయ్యాలను నమ్మడానికి లేదు. సినిమాల్లో అమాయకులను కూడా చంపేస్తుంటాయ్.
వెళితే నిజంగా ఇంటర్వ్యూ ఇస్తాయా ?

వెళ్లకపోతే ఛాన్స్ మిస్ అవుతానేమో ?
ఎవరినైనా సలహా అడిగితే ? పిచ్చోడిని చూసినట్టు చూస్తారేమో ?
ఒక గంట సేపు తర్జన భర్జన పడి మొత్తానికి వెళ్ళడానికే నిర్ణయించుకున్నా.
ఎందుకైనా మంచిదని నోట్ బుక్ లో ఏయే ప్రశ్నలు అడగాలో రాసి పెట్టుకున్నాను.

టైమ్ చూస్తే అపుడే సాయంకాలం అయిదు అయింది.
మరో మూడు గంటలు కాలక్షేపం చేయాలి అనుకుంటూ టీవీ పెట్టాను.
ఏదో డెడ్ బర్డ్స్ అని ఘోస్ట్ మూవీ వస్తోంది.
>>>>>>>>>>>>>>
ఆ దెయ్యం చెప్పిన చింత చెట్టు ఊరి చివరిన ఉంది.
అంత పెద్ద చెట్టు ఆ చుట్టు పక్కల ఊళ్లలో కూడా లేదు.
చెట్టుని ఆనుకునే పెద్ద చెరువు… అందులో దూకి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారట.
వాళ్లంతా దెయ్యాలై ఆ చింతచెట్టు పై కాపురం చేస్తున్నారని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటుంటారు.

కొంతమందికి అక్కడ దెయ్యాలు కనిపించాయని కూడా అంటారు
రాత్రిళ్ళు ఆ చింత చెట్టు దరి దాపులకు ఎవరూ వెళ్లరు.
ఆ చెట్టు ఎపుడు పుట్టిందో ఎవరికి తెలియదు. కాపు కూడా కాయడం లేదు.
రాత్రి ఎనిమిది అవుతుండగా చిన్నగా ఆ చెట్టు దగ్గరకు చేరాను.

సిగరెట్ వెలిగించుకుని చెట్టు చుట్టూ తిరిగి చూసాను.
అక్కడెవరూ కనిపించలేదు.
డిసెంబర్ నెల కావడంతో చలి ఎక్కువగా ఉంది.
గాలికి చింత చెట్టు కొమ్మలు కదులుతుంటే వాటిపై దెయ్యాలు కూర్చుని ఊగుతున్నట్టు ఉంది.
అంతలో ఎవరో వెనుకనుంచి నా చొక్కా పట్టుకుని లాగినట్టు అనిపించింది.
భయంతో ఒక్కసారిగా గుండె జల్లు మంది. చేతిలో సిగరెట్ జారి కింద పడింది.
అంతలోనే ……
>>>>>>>>>>>>>>>>
(మిగతా కథ రెండో పార్ట్ లో)

PL.Read it also ………………………...దెయ్యంతో ఇంటర్వ్యూ 2

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!