హత్రాస్ దుర్ఘటన తో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ఆ నియోజక వర్గ గౌరవ ఎంపీ గురించిన కథనమే ఇది.
పై ఫొటోలో కింద కూర్చుని టీ తాగుతున్న వ్యక్తి పేరు Diler Shri Rajveer..ఈయన, ఉత్తరప్రదేశ్ లో కుల కామోన్మాదుల క్రూరత్వానికి బలైన మనీషా స్వస్థలం Hathras (హత్రాస్) లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన అధికార BJP పార్టీ MP.
హత్రస్ SC రిజర్వుడు నియోజకవర్గం కాబట్టి ఈయన ఒక SC, చనిపోయిన మనీషా కూడా ఒక SC.
ఈయన పేరుకి MP అయినా ఈయన నియోజక వర్గంలో ఈయన పరిస్థితి ఏంటంటే ఒక MP గా అగ్రవర్ణాలు ఉన్న ఏ ప్రాంతానికి వెళ్లినా ఈయన tea disposable glass లో తాగాల్సిందే (ఈ ఫొటోలో కుర్చీలో కూర్చున్న వాడి చేతిలో కప్పు, ఈయన చేతిలో disposable glass చూడండి)…అలాగే అగ్రవర్ణాలు ఉన్న ప్రాంతాలలో ఈయన కూర్చోడానికి కుర్చీ ఇవ్వరు…కారులో వెళ్లినా కింద కూర్చొవాల్సిందే…ఈ ఫోటో అటువంటి సందర్భంలో తీసిందే…
మనీషా సంఘటన గురించి ఈయన మాట్లాడుతూ…
“గత రెండు రోజులుగా నేను వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ కుటుంబం తో ఉన్నాను… మనీషా అంత్యక్రియలు జరిగేముందు కూడా నేను అక్కడే ఉన్నాను…నాతో పాటు District Magistrate (కలెక్టర్), S.P గారు ఉన్నారు…అంత్యక్రియలు జరిగే ముందు వాళ్ళు నన్ను అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు..నేను collecter గారితో అంత్యక్రియలు ఉదయం కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహిద్దాము అని చెప్పాను…కానీ ఆయన నా మాట వినలేదు…నన్ను దగ్గరలో ఉన్న police station కి పంపించారు…కనీసం S.P గారు కూడా మనీషా మృత దేహాన్ని అర్ధరాత్రి దహనం చేస్తామని నాకు ముందు చెప్పలేదు…మనీషా ఘటనకు సంబంధించి ఎటువంటి నిరసనలు జరగకుండా కలెక్టర్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు…ఒక MP గా జరిగిన సంఘటనకు నేను సిగ్గు పడుతున్నాను..నేను వాల్మీకి కులస్థులకు మాట ఇస్తున్నాను… మనీషా కు న్యాయం జరిగేలా చూస్తాను..ఒకవేళ న్యాయం జరగని పక్షంలో నా పదవికి నేను రాజీనామా చేస్తాను…”
ఒక అధికార పార్టీ MP అయ్యిండీ తన తోటి కులస్తురాలి పై జరిగిన దారుణాన్ని ఎదిరించలేని, కనీసం ఆమె కుటుంబానికి కూడా తన చివరి చూపుని కల్పించలేని ఈయన అధికారం, పదవి ఏ పాటిది..?
ఒక సామాన్య దళితుని గా కాక ఒక దళిత MP గా కూడా తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోలేక అగ్ర వర్ణాల కాళ్ళకింద బానిసత్వం చేస్తున్న ఈయన మనీషా కి న్యాయం జరగాలని ఎలా పోరాడగలడు..?
ఈయన మనీషా కు న్యాయం చేస్తాడో లేదో కానీ ముందు ఆత్మ గౌరవం పెంచుకుని ఒక MP గా కుర్చీలో కూర్చుని కప్పుల్లో కాఫీ తాగే ఆత్మ ధైర్యం తెచ్చుకుంటే చాలు.