(ఈ కథ కేవలం కల్పితం ఏ ఒక్కరినీ ఉద్దేశించినది కాదు…పాత్రలు పాత్రధారులు కూడా కల్పితం )
అవునూ అంత పెద్ద సింగర్ కన్నుమూశారు కదా .. ఓ ప్రాపర్ సంతాపసభ కూడా పెట్టలేదేంటి మీ టాలీవుడ్ వారూ?
పెట్టరయ్యా …
ఆఖరి చూపు చూడ్డానికి కూడా పెద్దలెవరూ పోలేదు.
పోరు అయితే ఏంటటా?
ఆ ఏం లేదు … అందరి విజయంలోనూ ఆయన పాత్ర ఉంది కదా … అనీ …
నీకో విషయం చెప్పాలి … టాలీవుడ్ అగ్రహీరోలకు ఉన్నంత మానవత్వం ఇంకెవరికీ ఉండదు తెల్సా?
ఆ….
ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎఎన్నార్ లు స్వయంగా పాడుకోగలిగీ విపరీతమైన సంగీత జ్ఞానం ఉండీ పోనీ ఏదో బతుకుతాడు అని ఘంటసాలతో పాడించుకున్నారు. అలా వాళ్ల మీద ఆధారపడి బతికేసిన ఆయన అంత్యక్రియలకు వాళ్లు రాలేదు అని పామరులు గగ్గోలు పెట్టారా లేదా…
ఏంటీ? నిజమే…
నిజమేరా నిజం కాకపోతే నేనెట్టా చెప్తానూ … అట్టాగే … ఇప్పుడూనూ .. చిరంజీవి , బాలకృష్ణ ,నాగార్జున ఈళ్లందరూ కూడా అద్భుతమైన గాయకులూ గాన ప్రతిభ ధారాళంగా ఉన్నోళ్లూనూ … ఏదో పోన్లే పాపం బతుకుతాడూ అని బాలసుబ్రహ్మణ్యం అనే పెద్దగా పాడ్డం రాని గాయకుడికి అవకాశాలు ఇచ్చారు ..
ఈ మాట మాత్రం నేనొప్పుకుంటాను .. బాలకృష్ణ గారు శివశంకరీ పాట ఎంత అద్భుతంగా పాడారూ.
అదే నేను చప్తూంటా అసలారోజుల్లోనే … ఆ ఘంటసాల బదులు ఈయనతో ఆ పాట పాడించేసుంటే .. ఈపోలికలూ గట్రా కూడా వచ్చేవి కాదు కదా …
అవును మావా …
అంచేత నేను చెప్పొచ్చేదేటంటే … చిరంజీవి సినిమాల్లో పాటలు హిట్టయ్యాయంటే కేవలం ఆయన డ్యాన్సుల వల్లే గానీ … అందులో ఇంకెవరి ప్రతిభా లేదు కాక లేదు … కాళిదాసు ముఖం చూస్తే కవిత్వం వచ్చినట్టు … ఆయన పేరు తల్చుకుంటేనే సంగీత దర్శకుడికి ట్యూనొస్తుంది గాయకుడికి పాటొస్తుంది … సేమ్ బాలకృష్ణ కూడా …
ఈ బాలసుబ్రహ్మణ్యం మహదేవనూ చక్రవర్తీ ఇళయరాజా ఈళ్లందరూ ఈళ్లమీద పడి బతికేశారంటావా …
కాదేంటి అసలు ఈళ్లేంటెహె వేటూరి సుందర్రామ్మూర్తీ ఆత్రేయా ఆళ్లుకూడానూ … మా చిరంజీవీ బాలకృష్ణలు ఆ మాత్రం పాటలు రాసుకోలేరేంటి?
గలరు గలరు ఏదో పోన్లే అని …
అంచేత ఈ పనికిమాలిన ఏ ప్రతిభా లేని సంగీతం గాళ్ల అంత్యక్రియలకు వెళ్లలేదు … సంతాపసభ ప్రాపర్ గా పెట్టలేదూ లాంటి ఎదవ స్టేట్మెంట్లు ఇవ్వమాక …
అవునూ నిన్న చెన్నైలో ఓ మేరకు భారీగానే సంతాప సభ పెట్టారన్నయ్యో ..
ఆ వాళ్లముఖం అక్కడా చాలా మంది జూములోకొచ్చి మాట్లాడారనుకో కాకపోతే హాలు నిండేలా మాత్రం ప్రముఖులు వచ్చారు… వాళ్లకి టాలీవుడ్ అంత గ్యానం ఇంకా రాలేదురా … పైగా అక్కడ కళాకారులు కూడా మనోళ్లంత టాలెంటెడ్ కాదు … వాళ్లు నిజానికి ఈ సంగీతం సాహిత్యం గాళ్లమీద ఆధారపడిపోయుండడం చేత వెళ్లుంటారులే ..
అంతే అంటావా ….
మరి అసలెందుకులే అని ఈ డైరక్టర్లకీ కెమేరామెన్లకీ అవకాశాలు ఇచ్చి బతకండ్రా వెధవల్లారా అంటున్నారుగానీ మా చిరంజీవికీ బాలకృష్ణకీ నాగార్జునకీ తెలియని విద్యలా ఇవన్నీ … మనోళ్లు డైరక్టర్లని ఒళ్లో కూర్చోబెట్టుకుని డైరక్షన్ చేయించడం మనకు తెల్దేటి … అట్టాగే కెమేరా ఎట్టా పెట్టాలో డీఓపీలకేం తెల్సు .. మనోళ్లు చెప్పితే కదా .. పెట్టేది …
వామ్మో మీ హీరోలు తోపులు బాబాయ్ …
అందుకే ఆడి చావుకెళ్లలేదు ఈడి చావుకెళ్లలేదు లాంటి స్టేట్మెంట్లు ఇవ్వమాక …
ఇవ్వను.
—– Bharadwaja Rangavajhala
నిజాన్ని, నిజం గా రాసిన భరద్వాజ్ గారికి అభి నందనలు !
నిజమే, చనిపోయిన వారి ని చూడాలంటే భయం సి నిమా లో అయితే నటిస్తాం గాని నిజాజీవితం లో ఎలా! ఘంటసాల పోతే పోలేదు, ఆయనకే పోలేదు
ఈ యనకేమి పోతాం, బాలు ఎల్లిపోయారు.
ఇప్పుడిక ఆయనతో పనేము o ది.
ఈo కోరు వస్తారు దేశం ఏ.అన్నా గొడ్డు బోయి o దా
అని.
వెo డితెర మీద సెంటిమెంట్ గాని, నిజజీవితం లో
ఏo దుకు సెంటిమెంట్.