ఆ విమానాలు ఎలా అదృశ్యమైనాయో ?

Sharing is Caring...

ఆ రెండు విమానాలు ఎలా మాయమైనాయో తెలీదు కానీ  దశాబ్దాల తర్వాత వాటి వివరాలు వెలుగు చూశాయి. 1954 సెప్టెంబర్ 4 న  జర్మనీ నుంచి శాంటియాగో 513 విమానం మామూలు గానే టేకాఫ్ అయింది. ఇక ఆ తర్వాత ఏ సమాచారం లేదు.విమానాశ్రయం తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఆ విమానం మిస్ అయిందని అందరూ భావించారు.

ఏళ్ళు గడిచినా విమానం ఎక్కడ ఉందొ ఏ సమాచారం అందలేదు. అందరూ ఆ విమానం సంగతి మర్చిపోయారు. ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసి విసుగు పుట్టి చివరికి దాని గురించి పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలో మాయమైన ఆ విమానం సరిగ్గా 35 ఏళ్ల తరువాత అంటే అక్టోబర్ 12 … 1989 న బ్రెజిల్‌ లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలోకి వచ్చి లాండ్ అయింది.

35 ఏళ్ళ తరువాత ఆ విమానం ఎలా వచ్చి … ఎలా లాండ్ అయ్యిందో ఇప్పటి వరకు తెలియలేదు. ఎవరూ దాని గురించి సమాచారం చెప్పలేకపోయారు. బ్రెజిల్ విమానాశ్రయంలో లాండ్  అయ్యే ముందు ఆ విమానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని, లాండింగ్ సమయం లో క్రాష్ అయినట్టు  విమానాశ్రయ సిబ్బంది విచారణలో చెప్పారు.

క్రాష్ అయిన తరువాత పరిశీలించగా విమానంలో  అన్ని అస్థిపంజరాలు ఉన్నాయట.  టేకాఫ్ తరువాత విమానం ఏమైందో…ఎటు వెళ్లిందో .. ఎవరు కనిపెట్టలేకపోయారు.  35 ఏళ్ళు ఎక్కడ తిరిగిందో ఎవరికీ తెలియ లేదు. అసలు తిన్నగా వచ్చి విమానాశ్రయంలో ఎలా లాండ్ అయిందో కూడా చిత్రం. ఈ విషయం ఇప్పటికి  మిస్టరీ గానే మిగిలి పోయింది.

అలాగే ఇండియాలో కూడా 1968 లో ఒక విమానం మాయమైంది. మాయమైన ఆ విమానం గాల్లో పేలిపోయి దాదాపు 5 దశాబ్దాల తర్వాత వాటి శకలాలు మంచులో కూరుకుపోయి కనిపించాయి. హిమాచల్‌ప్రదేశ్ , లాహౌల్ స్పితి జిల్లాలోని ఢాకా గ్లేసియర్ ప్రాంతంలో ఆ విమానం తాలూకు శకలాలు బయటపడ్డాయి.

1968వ సంవత్సరం ఫిబ్రవరి 7వ  భారత వాయుసేనకు చెందిన ఏఎన్-12 బీఎల్-534 విమానం 98 మంది సైనికులతో వెళుతూ రోహ్‌తంగ్ పాస్ వద్ద అదృశ్యమైంది. 2019 ఆగస్టులో…. 51 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం శకలాల్లో ఎయిర్ ఇంజన్, ఎలక్ట్రిక్ సర్య్యూట్, ప్రొపెల్లర్, ఇంధన ట్యాంకు యూనిట్, ఎయిర్ బ్రేక్, కాక్‌పిట్ డోర్ మంచులో కూరుకుపోయి కనిపించాయి.

అప్పట్లో గల్లంతైన  వాయుసేన విమానంలో 98 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది తాలూకు మృత దేహాలు 2003లో కొంత మందివి…  2007 లో మరి కొంత మందివి దొరికాయి. మధ్యలో ఎంత గాలించినా విమానం ఆచూకీ లభించలేదు.2019 లో 13 రోజుల పాటు ఆర్మీ సిబ్బంది గాలింపులు జరిపితే  ఆ ప్రాంతంలో  విమాన శకలాలు కనిపించాయి.

ఇలా విమానాలు చాలా సార్లు మాయమైనాయి కానీ వారం .. పది రోజుల్లో వాటి ఆచూకీ తెలిసేది. పై రెండు కేసులు వాటికి భిన్నం. అవి ఎలా అదృశ్యమైనాయో ఎవరికి తెలీదు. 

———————-– Theja 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!