ఆమె దేహం ఒక మిస్టరీ !

Sharing is Caring...

ఆమె వైద్య శాస్త్రానికి ఒక మిరాకిల్. ఆమె శరీర నిర్మాణం ఒక మిస్టరీ. ఆమె పేరు మైర్‌ట్లే కార్బిన్‌. ఆమె నాలుగు కాళ్లతో పుట్టింది. ఒక్కరిలా కనిపించే కవలల కలయికే ఆమె.  జన్యు లోపాల కారణంగా ఆమె అలా అసాధారణంగా పుట్టింది.

ఆమె రూపం చూసేందుకు చిత్రంగా ఉంటుంది.1868లో లింకన్‌ కౌంటీ పట్టణం లో కార్బిన్ పుట్టింది. ఇలా అవకరంగా పుట్టిన పిల్లలు ఎక్కువకాలం జీవించరని అంటారు. కానీ నాలుగు కాళ్లతో పుట్టిన కార్బిన్‌ మాత్రం 60 ఏళ్ల పాటు బతికింది. 

పిండం సరిగా అభివృద్ధిచెందని కారణంగా కవలలుగా పుట్టాల్సిన శిశువులు ఒకరుగా పుట్టారని అప్పట్లో డాక్టర్లు నిర్ధారించారు. వైద్య పరిభాషలో ఇలా అదనపు కాళ్లతో పుట్టడాన్నిడిపైగస్‌ అని అంటారు. కార్బిన్ కి  రెండు నాలుగు కాళ్లతో పాటు.. రెండు జననేంద్రియాలు, రెండు గర్భాశయాలున్నట్టు డాక్టర్లు కనుగొన్నారు. కార్బిన్ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చి సంచలనం సృష్టించింది.

మైర్‌ట్లే కార్బిన్‌ నడుము పైభాగం వరకు చూడటానికి సాధారణంగానే ఉంటుంది. కానీ శరీరంలో మటుకు అవయవాలు వేర్వేరుగా ఉన్నాయి.  నాలుగు కాళ్లు ఉన్నప్పటికీ  ఒక కాలు మాత్రమే పని చేసేది. మిగిలినవి బలహీనంగా ఉండేవి.

అన్నిసమానంగా కూడా ఉండేవి కావు. చిత్రంగా ఒక్కో కాలికి మూడేసి వేళ్లు మాత్రమే ఉండేవి. ఇన్నిలోపాలు ఉన్నప్పటికీ ఆమె రూపం మనోహరంగా ఉండేది. అదే ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. లోపమే వరంగా మారింది. కార్బిన్ ఎక్కువ రోజులు బతకదని తల్లిదండ్రులు అనుకున్నారు.

కానీ హెల్తీ గా పెరగడంతో పత్రికలు ఆమె గురించి వార్తలు రాసి అందరికి తెలిసేలా చేశాయి. దాంతో కార్బిన్ సెలబ్రిటీ అయింది.ఒక సర్కస్‌ కంపెనీ ముందుకొచ్చి కార్బిన్ ను టీమ్‌లో చేర్చుకుంది. దాంతో ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు. చిన్న వయసులోనే సెలబ్రిటీ గా మారిన  కార్బిన్‌  అప్పట్లోనే వారానికి సుమారు 450 డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగింది.

మంచి రూపసి కార్బిన్‌ 19 ఏళ్ల వయసులో డాక్టర్ క్లింటన్ బిక్‌నెల్‌ ను వివాహం చేసుకుంది. పెళ్లి అయ్యాక ఆమె సర్కస్‌లో ఉద్యోగాన్నీ వదిలేసింది. ఒక రోజు  కడుపులో నొప్పి రావడంతో.. కార్బిన్ ను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చి చెప్పారు. ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్న విషయం కూడా అపుడే బయటపడింది.దరిమిలా కార్బిన్‌ నలుగురు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ కు జన్మనిచ్చింది.

1928లో కార్బిల్ కాలికి స్ట్రెప్టోకోక్సల్‌ ఇన్ఫెక్షన్‌ సోకింది. అప్పట్లో దానికి చికిత్స లేదు. దాంతో ఆ ఇన్ఫెక్షన్‌ సోకిన వారం రోజులకే కార్బిన్‌ కనుమూసింది.  ఆమె భౌతిక కాయాన్ని పరిశోధనల నిమిత్తం తమకు అప్పగించాలని వైద్యులు కోరారు. నగదు ఆఫర్ చేశారు.

అయినా  కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు.  ఆమె సమాధిని కాంక్రీట్‌తో నిర్మించి అది గట్టి పడేవరకు కొన్ని రోజుల పాటు సమాధికి కాపలా గా ఉన్నారు. అప్పట్లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో పరిశోధకులు కార్బిన్‌ శరీర నిర్మాణం గురించి పూర్తిగా పరిశీలించలేక పోయారు. దాంతో ఆమె దేహ నిర్మాణం మిస్టరీ గానే మిగిలిపోయింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!