ఈ పొలిటికల్ స్కూల్ గురించి విన్నారా ?(1)

Sharing is Caring...

A school for making politicians…………………………

మనదేశంలో రాజకీయ నాయకులను తయారు చేసే పాఠశాల ఒకటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి ? ఏయే విషయాలు తెలిసి ఉండాలి ? ప్రజలతో ఎలా వ్యవహరించాలి ?ప్రభుత్వం అంటే ఏమిటి ? బడ్జెట్ అంటే ఏంటి ?అన్న విషయాలపై ఈ పాఠశాలలో శిక్షణ ఇస్తారు.

ఇవే గాక మరెన్నో విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఇవన్నీ నేర్చుకుంటే మంచి  లీడర్ అవ్వొచ్చు. ఆ స్కూల్ పేరు  MIT స్కూల్ ఆఫ్ గవర్నమెంట్. పూణే లో ఉంది.   2005 లో ఈ స్కూల్ ప్రారంభమైంది. ఇది పొలిటికల్ లీడర్‌షిప్ అండ్ గవర్నమెంట్ లో రెండు సంవత్సరాల మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. రెండు-సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ అనేది ఒక అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమం. ఈ కోర్సు కి ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది. 

మొదటి సంవత్సరం ప్రధాన అధ్యాపకులు, విజిటింగ్ ఫ్యాకల్టీలు, రాజకీయాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థ, మీడియా, కార్పొరేట్‌ ప్రముఖులు వచ్చి క్లాస్ రూంలో  ఉపన్యాసాలు ఇస్తారు.  సందేహాలకు సమాధానాలు ఇస్తారు.ఉపన్యాసాలతో పాటు ఫీల్డ్ విజిట్ ఉంటుంది.  స్టడీ టూర్స్ కూడా ఉంటాయి. రెండో సంవత్సరం నియోజకవర్గాల్లో సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు,ఎన్జీవోలతో సమావేశం,రాజకీయ నాయకులు, వివిధ పార్టీల కార్యాలయాల పనితీరు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు.

సెఫాలజి , పొలిటికల్ కమ్యూనికేషన్, పొలిటికల్ మేనేజిమెంట్,స్థానిక పాలన,లెజిస్లేటివ్ విధానాలు,  ఆర్థిక విధానాలు, ఇండియన్ బ్యూరోక్రసి , విదేశీ విధానం , పబ్లిక్ పాలసీ, ఎన్నికల విధానం పై విద్యార్థులకు అవగాహనా కల్పిస్తారు. రాజకీయాల్లో ఈ అంశాలన్నీ ముఖ్యమైనవి.

వీటి గురించి  తప్పనిసరిగా తెల్సుకోవాలి. అలాగే జాతీయ స్థాయి రాజకీయ నాయకులతో, ఉన్నతాధికారులతో,న్యాయమూర్తులతో,మీడియా ప్రతినిధులతో,కార్పొరేట్ ,సామాజిక సంస్థల ప్రతినిధులతో  ముఖాముఖీ చర్చలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ చర్చల్లో పాల్గొని తెలియని విషయాలు తెలుసుకోవచ్చు.

ఇలాంటి కార్యక్రమాల వల్ల సొసైటీ లోని వివిధ కీలక వర్గాలతో ఎలా మసులు కోవాలో అర్ధమౌతుంది. అలాగే స్థానిక సంస్థలకు తీసుకెళ్తారు. రాజకీయ పార్టీల కార్యాలయాలకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడవచ్చు. వ్యవస్థల పనితీరుపై అవగాహనా పెంచుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ రీసెర్చ్  .. ఎన్నికల ప్రచారం, నియోజక వర్గ అభివృద్ధి వంటి అంశాల్లో ఇంటర్న్షిప్ చేయిస్తారు. 

లోక సభ, రాజ్య సభ ప్రొసీడింగ్స్ ను పరిశీలించేందుకు 10 రోజుల నేషనల్ స్టడీ టూర్ ఏర్పాటు చేస్తారు. ఈ టూరు లో భాగం గా మంత్రులు, ఎంపీలతో మాట్లాడవచ్చు. రాష్ట్రపతి భవన్,ఎన్నికల కమీషన్ కార్యాలయం, నార్త్ బ్లాక్ , సౌత్ బ్లాక్ లలో ముఖాముఖి చర్చలు జరుగుతాయి.  జాతీయ , ప్రాంతీయ పార్టీల కార్యాలయాలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!