గాడిదలను మనం తక్కువగా చూస్తాం కానీ గాడిదలకు ఇపుడు బ్రహ్మాండమైన మార్కెట్ వాల్యూ ఉంది. ఒక గాడిద ఖరీదు సుమారు 10 లక్షల వరకు పలుకుతోంది. గాడిద పాలు మనుష్యులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.
గాడిదల్లో హలారి జాతి కి ప్రాధాన్యత ఉంది. ఈ జాతి గాడిదలు గుజరాత్‌లో ఎక్కువ ఉంటాయట. దాని పాలను ఔషధాల నిధిగా పరిగణిస్తారు. హలారి జాతికి చెందిన గాడిదకు క్యాన్సర్, ఊబకాయం, అలర్జీలు మొదలైన వ్యాధులతో పోరాడే శక్తి ఉందంటారు.
పిల్లలకు గాడిద పాలు పడితే అలెర్జీ సోకదు. చిన్న పిల్లలకు తరచుగా ఆవు లేదా గేదె పాలు వాడేటప్పుడు అలెర్జీలు వస్తాయి, కానీ హలారి జాతి గాడిద పాలు పిల్లలకు ఎటువంటి అలెర్జీని కలిగించవు. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ గాడిద పాలలో కనిపిస్తాయి. గాడిదలపై ఎన్నో పరిశోధనలు చేశారు.
మార్కెట్‌లో గాడిద పాలను లీటరు రూ.2000 నుంచి రూ.7000 వరకు విక్రయిస్తున్నారు. గాడిద పాలతో తయారైన సౌందర్య ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. గాడిద పాలను సబ్బులు, లిప్ బామ్‌లు, బాడీ లోషన్లు మొదలైనవాటిని తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
ఇక గాడిద పాలలో విటమిన్లు A, B, B1, B12, C, E పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ పాలకు రోగనిరోధక శక్తి ని పెంచే లక్షణాలున్నాయి. గాడిద పాలను సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. చర్మకాంతి పెరగడానికి, వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతలను దూరం చేయడానికి గాడిద పాలను ఉపయోగిస్తుంటారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా తన యవ్వనాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ గాడిద పాలతో స్నానం చేసేది అంటారు.
దీన్ని బట్టి గాడిద పాల మహిమను అర్థం చేసుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గాడిద పాలు అకాల వృద్ధాప్యంతో పోరాడగలవని కనుగొన్నారు. గాడిద పాలలో జీర్ణక్రియకు సహాయపడే అనేక పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి. అలసట, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, పొత్తికడుపు నొప్పి, కంటి నొప్పి మొదలైన వాటికి గాడిద పాలు గొప్ప ఔషధం.
తల్లిపాలలో ఉన్నన్ని పోషకాలు ఉన్నందున గాడిద పాలు పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. గాడిద పాలను ఇతర పాలలా మరిగించకూడదు. ఒక సంవత్సరం వరకు రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చు. గాడిద పాలు ఆధారిత సౌందర్య సాధనాలకు మార్కెట్లో అధిక విలువ ఉంది. నాణ్యత పరంగా ఇవి ముందంజలో ఉన్నాయి. చర్మం యొక్క సహజ ప్రకాశాన్ని కాపాడటమే కాదు, అన్ని చర్మ వ్యాధులకు కూడా ఇది అద్భుతమైన ఔషధం.
గుర్రాన్ని పోలి ఉన్నప్పటికీ గాడిదలు వాటి ప్రశాంతమైన ప్రవర్తనకు ప్రసిద్ది చెందాయి. గాడిదలు పచ్చిక బయళ్లలో మందలుగా మేయడానికి ఇష్టపడతాయి. గాడిదకు ఇష్టమైనది సన్నగా తరిగిన మేత.యాపిల్స్ ..పైనాపిల్స్ పాలిచ్చే గర్భిణీ గాడిదలకు పెడుతుంటారు. ఇవి ఇతర జంతువులలా కాటు వేయవు.
మొక్కజొన్న.. బియ్యం ఊకతో కూడిన సమతుల్య ఆహారం గాడిద కు పెడుతుంటారు. వీటి గర్భధారణ కాలం 13-14 నెలలు. ఆడ గాడిదలు మూడు నెలల వయస్సులో పరిపక్వతకు చేరుకుంటాయి. ఆడ గాడిదలకు మార్కెట్ లో విలువ ఎక్కువ.గాడిద పేడ ఒక అద్భుతమైన సేంద్రియ ఎరువు. గాడిద పాలలాగే గాడిద పేడకు కూడా గిరాకీ ఎక్కువ.కాబట్టి గాడిదలను తక్కువ చేసి చూడకూదండోయి.