ఆ సీన్లే రిపీట్ చేసి హిట్ కొట్టారా ?

Sharing is Caring...

Neil Kolikapudi  …………………………………………. 

మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాలలో ఐదు సీన్ల..పాయింట్ల ను కలబోసి super hit ఇచ్చాడు పరుశురాముడు.. వాహ్..క్యాబాత్ హై..!! సినిమా పాయింట్ సూపర్..బాంక్ ఋణాలు వేలకోట్ల ఎగ్గొట్టేస్తున్నారు..బడా బడా వాళ్ళు అని..!! కాకపోతే ఆ screenplay లో..కింద సినిమాలు గుర్తొచ్చాయి..ఎవరైనా ఇంగ్లీష్ సినిమాలు కాపీ కొడతారు లేదా పాత సినిమాలు కాపీ కొడతారు..ఇతనెంట్రా బుజ్జా..గులాబీమొక్కకు అంటుకట్టినట్టు..ఏదో పద్దతిగా ఓ గోడకట్టినట్టుగా మహేష్ బాబు సినిమాల్లోని సీన్లు పాయింట్లతోనే అంటుకట్టి..screenplay అనే గోడకట్టి హిట్టొచ్చేశాడ్రా .. ఆడు మగాడ్రా బుజ్జా..!!

అవును..సర్కారివారిపాట చూశాక నాకు సూపర్ స్టార్ మహేష్ హిట్స్ అన్నీ గుర్తొచ్చాయి..నేనసలే hard core కృష్ణగారి ఫ్యాన్..ఆ క్రమంలో ఆటోమేటిగ్గా మహేష్ ఫ్యాన్ ఐపోయా..మహేష్ లో కృష్ణ ని చూసుకుంటాను..అసలు థియేటర్ కి నడిపించేదే మహేష్ నన్ను..అతని సినిమా రిలీజ్ అయితేనే కదులుతాను.. ఎంత తోపు సినిమా అయినా హాల్లో చూడను..ఇంట్లో హాల్లో రిలీజ్ అయినప్పుడు చూస్తా..! సరే విషయానికొస్తే….వరసగా నాకు గుర్తొచ్చిన సినిమాలు చెప్తా చిత్తగించండి..!

మహర్షి :ఈసినిమా అమెరికాలో స్టార్ట్ అవుతుంది..హీరో software company CEO.. ఒక కాజ్ కోసం ఇండియా వస్తాడు..రైతులకోసం పోరాడి మహర్షి అనిపించుకుంటాడు..! ఇక్కడ కూడా అమెరికాలో స్టార్ట్ అవుతుంది..ఒక కాజ్ కోసం ఇండియా వస్తాడు..ఇక్కడ హీరో తండ్రి రైతు..సర్కారివారిపాట లోకూడా ప్రజలకోసం పోరాడి హీరో అనిపించుకుంటాడు..

శ్రీమంతుడు : ఇందులో విలన్ MP హార్డ్ కోర్..ఊరంతటిని గుప్పెట్లో పెట్టేసుకుంటాడు..ఇక్కడ కూడా విలన్ mp ఊరంతటిని గ్రిప్లో పెట్టేసుకుంటాడు..శ్రీమంతుడులోనూ elections time దగ్గరకొస్తుంది ఈసారి టికెట్ కష్టం అనే పరిస్థితి వస్తుంది..సర్కారివారిలో కూడా same.. సెంట్రల్ లో బోల్డంత influence కానీ చివర్లో విలన్ కి చుక్కెదురు అవుతుంది హీరో వల్ల.. శ్రీమంతుడిలో హీరోనే ఢిల్లీ వెళ్లి సదరు విలన్ గారికి వార్నింగ్ ఇస్తాడు..

ఇక్కడ స్మాల్ change హీరోనే MP ని ఢిల్లీ పిలిపిస్తాడు..రెండింటిలోనూ ఢిల్లీలో అసలు పాయింట్ రివీల్ అవుతుంది..! ఫ్యామిలీ జోలికి రాకు అంటాడు అందులో హీరో..ఇక్కడ విలన్ అంటాడన్నమాట…అలాగే శ్రీమంతుడిలో హీరోయిన్ పానీపూరి తింటుంటే ..ఏదో కార్తీక మాసం అని లంగా ఓణి లో చూసి హీరో ఫ్లాట్ అవుతాడు..ఇక్కడ నాలుగు మూరల మల్లెలు..చీరకట్టులో చూసి ఫ్లాట్ అవుతాడు..! సరే అంతవరకే ఇక్కడ హీరోయిన్ని విలన్ కూతుర్ని చేసి ట్విస్ట్ ఇచ్చాడు..

భరత్ అనే నేను : ప్రెస్ మీట్ సీన్ highlight.. ఇక్కడ కూడా same to same పెట్టాడు..మహేష్ అదే modulation లో ఈ సీన్ కూడా పండించాడు..అక్కడ press meet తోనే సినిమా climax ముడిపడి ఉంటుంది..ఇక్కడ కూడానూ..

సరిలేరునీకెవ్వరు :దీన్లో విలన్ ప్రకాష్ రాజ్ ని భాద్యత ఉండక్కర్లా అంటూ చివరి వరకు వెంటపడి ..తలపడుతూ చివరికి బాధ్యత కలిగి ఉండేటట్టు పశ్చాతాపం కలిగిస్తాడు..ఇక్కడ కూడాను same..అప్పనేది ఆడపిల్ల లాంటిది బాధ్యతతో కలిగి తీర్చేయాలని..గౌరవ బాధ్యతలు నేర్పిస్తాడన్నమాట..!! సరిలేరు..లో విజయశాంతి కేరెక్టర్ని జస్ట్ రివర్స్ చేసి ఇక్కడ lady బాంక్ మేనేజర్ ని పెట్టాడు..అక్కడ విజయశాంతి కోసమే వచ్చి ఆమెకు న్యాయం చేస్తాడు..ఇక్కడకూడా ఈ మేనేజర్ ని అరెస్ట్ చేస్తే ఆమెను విడిపిస్తాడు..ఆ లైన్ గుర్తొస్తుంది..!

ఖలేజా : బ్రహ్మానందం దగ్గర తాగి ఆటపట్టించటం..ఇక్కడ అదే సీన్ దాదాపుగా పెట్టేశాడు..పాపం ఈమధ్యకాలంలో మా మహేష్ తాగే సీన్లు లేవు..ఇందులో వాడేసుకున్నాడు..పరుశురాం..! అలాగ్ ఖలేజా లోని డైలాగ్ డెలివరీ ..modulation న్ని కూడ వాడేసుకున్నాడు..!

దూకుడు: మహేష్ వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో సూపర్ కామెడీ పండించారు..ఇందులోనూ దాన్నే వాడేసుకున్నాడు..!!ఇంకా business man కూడా గుర్తొస్తుంది..విలన్ తో చిటికిన వేలు చూపించి ఉచ్చ పోసుకుంటున్నారు కదా సార్ అంటాడు..same యారోగేన్స్ తో..ఎతావాతా సినిమా సూపర్ గా ఉంది..మహేష్ బాబు ని కొత్తగా చూపించాడు..మనోడు ఇరగదీసేశాడు..అది వేరే విషయం.. songs లో steps అదుర్స్..ఫైట్స్ సూపర్..!!

Bottom line : అయ్యా డైరెట్రు నీ గీతగోవిందం fresh గా ఉంది..అలాంటి freshness కోరి చూశా..ప్చ్..మహేష్ బాబు ఫ్రెష్ గాఉన్నాడు..కానీ నీ లైన్ ..మావోడి పాత సినిమాల్లోవే..any how థాంక్స్ మా super star కి super du par హిట్టొచ్చావ్..!! అయ్యా అదివిషయం..నేను చెప్పిన పాయింట్స్ మీకు గుర్తొస్తే చూసి చెప్పండి..!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!